ఆస్ట్రేలియా గడ్డపై ఒకే రోజు భారత్‌కు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ పురుషల జట్టు పరాజయం పాలవ్వగా.. మరోవైపు బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో భారత మహిళల టీమ్ ఘోర ఓటమి చవిచూసింది. 372 పరుగుల లక్ష్య చేధనలో భారత అమ్మాయిల జట్టు 44.5 ఓవర్లలో కేవలం 249 పరుగులకే కుప్పకూలింది.
భారత బ్యాటర్లలో రిచా ఘోష్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిన్ను మణి(46), రోడ్రిగ్స్(43), హర్మాన్ ప్రీత్(38) పరుగులతో పర్వాలేదన్పించారు. కానీ ఏ ఒక్క బ్యాటర్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. స్కాట్, కిమ్ గార్త్, గార్డనర్, కింగ్ తలా వికెట్ సాధించారు.
పెర్రీ, వాల్ సెంచరీలు..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 371 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో జార్జియా వాల్(87 బంతుల్లో 12 ఫోర్లుతో 101), ఎల్లీస్ పెర్రీ(75 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు.
వీరిద్దరితో పాటు లిచ్‌ఫీల్డ్(60),బీత్ మూనీ(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 ఆతిథ్య ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే పెర్త్ వేదికగా డిసెంబర్ 11న జరగనుంది.
చదవండి: ట్రావిస్ హెడ్ అబద్దం చెప్పాడు.. అతడు నన్ను తిట్టాడు: సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment