ముంబై: భారత మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిచా ఘోష్ (36; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (36 నాటౌట్; 8 ఫోర్లు) రాణించారు. ఆసీస్ అమ్మాయిలు 18.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచారు.
ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెత్ మూనీ (57 బంతుల్లో 89 నాటౌట్; 16 ఫోర్లు) మెరిసింది. ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వాణి భారత్ టి20 జట్టు తరఫున అరంగేట్రం చేసిన 72వ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన అంజలి 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చింది.
చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment