భారత మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ముంబై మాజీ ఆటగాడు అమోల్ ముజుందార్ భాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు ఈ హెడ్‌కోచ్ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. జూలై 9న బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌తో భారత జట్టు ప్రధానకోచ్‌గా ముజుందార్ ప్రయాణం ప్రారంభం కానుంది.
దీనిపై బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా కాగా గత డిసెంబర్‌లో మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్‌ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ బదిలి చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రధాన కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మహిళల జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.
హెడ్‌కోచ్ పదవి కోసం ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోన్ లూయిస్, భారత మాజీ కోచ్ తుషార్ అరోథే వంటి వారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజ్‌పే, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కమిటీ ముజుందార్ పేరును ఖారారు చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇక ముజుందార్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. ముజుందార్ ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. అదే విధంగా గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా కూడా పనిచేశాడు. 48 ఏళ్ల ముజుందార్ 2019లో భారత పర్యటనలో దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశాడు.
చదవండి: బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు ఎంపిక.. స్టార్ ప్లేయర్‌పై వేటు
Comments
Please login to add a commentAdd a comment