టీమిండియా హెడ్ కోచ్‌గా బీసీసీఐ మళ్లీ రాహుల్ ద్రవిడ్‌నే కొనసాగించింది. ద్రవిడ్‌తో పాటు విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) కాంట్రాక్ట్‌లను కూడా బీసీసీఐ మళ్లీ పొడిగించింది. వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమి నేపథ్యంలో ద్రవిడ్ కోచింగ్ పదవిని మళ్లీ చేపట్టేందుకు సుముఖంగా లేనప్పటికీ బీసీసీఐ ప్రాధేయపడి అతన్ని ఒప్పించినట్లు తెలుస్తుంది.
దక్షిణాఫ్రికా పర్యటనకు ద్రవిడ్‌ను టీమిండియా కోచ్‌గా ఎంపిక చేయడంపై పలువురు భారత క్రికెట్ అభిమానులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కోచ్‌గా వరుస వైఫల్యాలు చెందిన వ్యక్తిని మళ్లీ ఎందుకు నియమించారంటూ మండిపడుతున్నారు.
కోచ్‌గా ద్రవిడ్ ట్రాక్ రికార్డు ఇలా..!
రాహుల్ ద్రవిడ్ 2021 నవంబర్ 17నుంచి తొలి సారి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. రెండేళ్ల పదవీ కాలాన్ని అతనికి బోర్డు నిర్దేశించింది. వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్న సీనియర్ ఆటగాళ్లతో పాటు అంతకు ముందు వరకు ద్రవిడ్ కోచింగ్‌లో అండర్–19, భారత్ ‘ఎ’ జట్లకు ఆడిన ఆటగాళ్లు చాలా మంది జట్టులో ఉండటంతో కోచింగ్‌లో ద్రవిడ్ పని సులువైంది.
అతను కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత జట్టు టెస్టు, వన్డే, టి20ల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. అయితే మూడు అవకాశాలు లభించినా ఒక్క సారి కూడా ఐసీసీ టోర్నీని మాత్రం గెలవలేకపోయింది. 2022 టి20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్, 2023 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. అయితే ఫైనల్‌కు ముందు వరుసగా పది మ్యాచ్‌లలో సంపూర్ణ ఆధిపత్యంతో విజయం సాధించింది.
ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. రెండో సారి కోచ్‌గా ఇప్పుడు ద్రవిడ్ బాధ్యతలు డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనతో మొదలవుతాయి. ఈ టూర్‌లో 3 టి20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడుతుంది. సఫారీ గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని రికార్డు భారత్‌కు ఉంది. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment