టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు (Rahul Dravid) తృటిలో ప్రమాదం తప్పింది. నిన్న (ఫిబ్రవరి 4) బెంగళూరులో రాహుల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రాహుల్‌కు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని ఓ బిజీ రోడ్డులో (కన్నింగ్హమ్ రోడ్) రాహుల్ ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ద్రవిడ్ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
In #Bengaluru: A video of former India cricket captain and coach Rahul Dravid getting into an argument with an autodriver on Cunningham Road after a minor collision surfaced on Tuesday evening. No one was injured. pic.twitter.com/0tAtoqQk96
— TOI Bengaluru (@TOIBengaluru) February 4, 2025
ఈ ప్రమాదంలో రాహుల్ కారుకు స్వల్ప డ్యామేజీ అయ్యింది. ఇందుకే ద్రవిడ్ ఆటో డ్రైవర్‌తో వాదనకు దిగాడు. ద్రవిడ్.. తన మాతృభాష కన్నడలో ఆటో డ్రైవర్‌పై అసహనాన్ని ప్రదర్శించాడు. ఘటన స్ధలం నుంచి బయల్దేరేముందు ద్రవిడ్ సదరు ఆటో డ్రైవర్ వివరాలు తీసుకున్నాడు. అయితే అతనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే ద్రవిడ్ నడి రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్‌తో వాదనకు దిగడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
52 ఏళ్ల రాహుల్ ద్రవిడ్.. తన 16 ఏళ్ల కెరీర్‌లో మైదానంలో గొడవలు పడిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రత్యర్థులు రెచ్చిగొడితే రాహుల్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పేవాడు కానీ ఎప్పుడూ గొడవకు దిగేవాడు కాదు. అలాంటి ద్రవిడ్ ఓ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగడంపై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తుంది.
ఇదిలా ఉంటే, ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉండగా భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్‌కు అదే చివరి టోర్నమెంట్. టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాక ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రీ జాయిన్ అయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్ తనదైన మార్కును చూపించాడు. ఆ వేలంలో ద్రవిడ్ సూచనలతో రాయల్స్ 13 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని దక్కించుకుంది. వైభవ్ లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
Comments
Please login to add a commentAdd a comment