సౌతాంప్టన్ వేదికగా జులై 7న ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన (జులై 5) రోజు గ్యాప్‌లోనే తొలి టీ20 జరుగనుండటంతో రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ చేసినట్లు సమాచారం. దీంతో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టీ20కు లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్ష్మణ్.. ఇటీవల ముగిసిన ఐర్లాండ్ పర్యటనలో తొలిసారి టీమిండియా (హార్ధిక్ సేన) హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20కు కోచ్‌తో పాటు సీనియర్ సభ్యులు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా కూడా జట్టుకు దూరంగా ఉంటున్నారు. ద్రవిడ్‌తో పాటు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌లో భాగమైన వీరందరికి కూడా విశ్రాంతినిచ్చేందకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ఇదివరకే జట్లను కూడా ప్రకటించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా జట్టులో చేరితే రుతురాజ్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్ జట్టు నుంచి తప్పుకోనున్నారు.
తొలి మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
2, 3 టీ20లకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవి జడేజా, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్
మూడు టీ20లకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, రిచర్డ్ గ్లీసన్, క్రిస్ జోర్డాన్, లియమ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, టైమాల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్, జేసన్ రాయ్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, ఫిల్ సాల్ట్
చదవండి: IND vs ENG: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్ అద్భుతం చేయగలదా?
Comments
Please login to add a commentAdd a comment