టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌.. అధికారిక ప్రకటన | Gautam Gambhir Officially Named As India's New Head Coach: BCCI Secretary Jay Shah Confirmed | Sakshi
Sakshi News home page

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌.. అధికారిక ప్రకటన

Published Tue, Jul 9 2024 8:17 PM | Last Updated on Wed, Jul 10 2024 5:03 PM

Gautam Gambhir Officially Announced As Team India Head Coach

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. గంభీర్‌ను టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఆహ్వానిస్తున్నట్లు షా ట్విటర్‌లో పేర్కొన్నారు. గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. 

కాగా, ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌తో టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ద్రవిడ్‌ అనంతరం గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఎంపిక చేయబడ్డాడు. గంభీర్‌ త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన నేపథ్యంలో గౌతమ్‌ గంభీర్‌ పేరు టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి రేసులో ప్రధానంగా వినిపించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బీసీసీఐ ఇవాళ గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించింది. 

గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి చేపట్టనుండటంతో కేకేఆర్‌ మెంటార్షిప్‌కు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేకేఆర్‌ గంభీర్‌ స్థానాన్ని రాహుల్‌ ద్రవిడ్‌తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం​. 

టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు గంభీర్‌ బీసీసీఐ ముందు ఓ షరతు పెట్టినట్లు ప్రచారం జరిగింది. తన సహాయ సిబ్బంది (కోచింగ్‌ స్టాఫ్‌) ఎంపిక విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని గంభీర్‌ బీసీసీఐని కోరినట్లు సమాచారం​. 

ఇందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గంభీర్‌ తన సపోర్టింగ్‌ స్టాఫ్‌గా జాంటీ రోడ్స్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌), అభిషేక్‌ నాయర్‌ను (అసిస్టెంట్‌ కోచ్‌) ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement