
ఏ జట్టైనా స్వదేశంలో సిరీస్ ఆడుతుంది అంటే పిచ్ మన బౌలర్లకు అనూకూలంగా తయారు చేయడం సహజం. కానీ రాహుల్ ద్రవిడ్ రూటు మాత్రం సెపరేటు. టీమిండియాకు హెడ్‌కోచ్‌గా ఎంపికైనప్పటి నుంచి తనమార్క్ కోచ్ అంటే ఏంటో చూపిస్తూ వచ్చాడు. తాజాగా న్యూజిలాండ్, టీమిండియా మధ్య ముగిసిన తొలి టెస్టు గురించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది.
చదవండి: Rahane-Dravid: రహానే ఫామ్‌పై ఆందోళన వ్యర్థం: ద్రవిడ్
కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్టుకు స్పోర్టింగ్ పిచ్ తయారు చేయాలంటూ గ్రౌండ్ మేనేజ్‌మెంట్‌ను కోరినట్లు తెలిసింది. అందుకు ద్రవిడ్ తన పర్సనల్ అకౌంట్ నుంచి రూ.35 వేలు గ్రీన్‌పార్క్ గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యుపీసీఏ) మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ద్రవిడ్‌పైన ఉన్న గౌరవం మరింత పెరిగింది అంటూ యూపీ క్రికెట్ తెలిపింది.
ద్రవిడ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆట ఫెయిర్‌గా.. స్పోర్టివ్‌గా ఉండాలని భావించేవాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా ద్రవిడ్‌లో అదే తీరు కనబడిందని.. పిచ్ తమకు అనుకూలంగా కాకుండా స్పోర్టింగ్ పిచ్‌ను తయారు చేయమని చెప్పడం ఒక్క ద్రవిడ్‌కు మాత్రమే చెల్లింది. ప్రస్తుతం ద్రవిడ్ చేసిన పని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. '' మ్యాచ్ డ్రాగా ముగిసింది అన్న బాధ కంటే ద్రవిడ్ చేసిన పని ఆనందం కలిగించింది.. ఎంతైనా కోచ్‌గా ద్రవిడ్ రూటే సెపరేటు'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: Rachin-Ajaz Patel: రచిన్, ఎజాజ్ పటేల్.. భారత్‌తో బంధం
Comments
Please login to add a commentAdd a comment