Rahul Dravid Reaction To Media Reports Over Attending BJP Youth Meet In Himachal Pradesh - Sakshi
Sakshi News home page

Rahul Dravid: బీజేపీ మీటింగ్‌కు వెళ్తున్నాడని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ద్రవిడ్‌

Published Tue, May 10 2022 6:46 PM | Last Updated on Tue, May 10 2022 8:21 PM

Rahul Dravid Refutes Media Reports On Attending BJP Youth Meet in Himachal Pradesh - Sakshi

టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఓ రాజకీయ పార్టీ మీటింగ్‌కు హాజరవుతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో జరుగనున్న బీజేపీ యువ మోర్చాలో రాహుల్‌ ద్రవిడ్‌ పాల్గొనబోతున్నాడని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే విశాల్‌ నహేరియా మంగళవారం ప్రకటించాడు. దీంతో ఈ వార్త నిమిషాల వ్యవధిలో నెట్టింట వైరల్‌గా మారింది. ద్రవిడ్‌ లాంటి సౌమ్యమైన వ్యక్తి రాజకీయ పార్టీ మీటింగ్‌లో పాల్గొంటున్నాడా అని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 

తనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ద వాల్‌ తాజాగా స్పందించాడు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశాడు. బీజేపీ మీటింగ్‌లో పాల్గొనబోతున్నాడన్న వార్తను ఖండించాడు. కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ నెల 12 నుంచి 15 వరకు జరగనున్న బీజేపీ యువ మోర్చాలో రాహుల్‌ ద్రవిడ్‌ పాల్గొనబోతున్నాడని ఓ వర్గం మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సమావేశంలో ద్రవిడ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పాల్గొంటారని ప్రచారం జరిగింది. ఈ ఏడాది చివర్లో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
చదవండి: ఆసీస్‌తో టి20 సిరీస్‌.. టి20 ప్రపంచకప్‌ 2022 లక్ష్యంగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement