Asia Cup Ind Vs Pak: Rahul Recovers From COVID 19, Set To Join Indian Team, Says Reports - Sakshi
Sakshi News home page

Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌!

Published Sun, Aug 28 2022 10:11 AM | Last Updated on Sun, Aug 28 2022 12:10 PM

Reports: Rahul Dravid Recovers From COVID 19, Set To Join Indian Team - Sakshi

ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌కు ముందు భారత్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది. ఆసియాకప్‌కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో అతడికి నెగిటివ్‌గా నిర్థారణైంది. ఈ క్రమంలో ఆదివారం(ఆగస్టు 28) దుబాయ్‌ వేదికగా జరగనున్న దాయాదుల పోరుకు ముందు ద్రవిడ్‌ జట్టుతో చేరే అవకాశం ఉంది. ఇక ఇదే విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు దృవీకరించారు.

రాహుల్‌కు నిర్వహించన తాజా టెస్టులో నెగిటివ్‌గా తేలింది. అతడు యూఏఈ వెళ్లడానికి సిద్దంగా ఉన్నాడు" అని అతడు  ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. కాగా హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు ద్రవిడ్‌ తిరిగి జట్టుతో కలవడం భారత శిభరంలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. కాగా ద్రవిడ్‌ కరోనా బారిన పడడంతో భారత తాత్కలిక హెడ్‌ కోచ్‌గా వీవీయస్‌ లక్ష్మణ్‌ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.
చదవండిInd Vs Pak- Virat Kohli: నాడు ఓపెనర్లు డకౌట్‌... మిగతా వాళ్లంతా విఫలం.. కోహ్లి ఒక్కడే! ఇప్పుడు కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement