భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మే 27తో దరఖాస్తు గడువు తేదీ ముగిసినా ఎవరెవరు పోటీలో ఉన్నారు? అనే విషయంపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే భారత హెడ్‌కోచ్ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
అయితే మరి కొన్ని రిపోర్ట్‌లు మాత్రం గంభీర్‌కు హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేదని పేర్కొంటున్నాయి. కాగా గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా పనిచేస్తున్నాడు. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను ఛాంపియన్స్‌గా నిలిపిన తర్వాత గంభీర్ వరుస కార్యక్రమాలతో బీజీబీజీగా ఉన్నాడు.
ఈ క్రమంలో అబుదాబిలోని మెడియర్ ఆసుపత్రిలో విద్యార్థులతో గౌతీ ఇంటరాక్టయ్యాడు. ఈ నేపథ్యంలో భారత హెడ్‌కోచ్ పదవిపై తన అభిప్రాయాలను చెప్పమని గౌతీని విద్యార్థులు ప్రశ్నించారు. జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదని గంభీర్ చెప్పుకొచ్చాడు.
"భారత జట్టు హెడ్‌కోచ్ పనిచేసేందుకు నేను ఇష్టపడతాను. జాతీయ జట్టుకు కోచ్ చేయడం కంటే గొప్ప గౌరవం ఇంకొకటి ఉండదు. మేము దేశంలో ఉన్న 140 కోట్ల భారతీయుల తరపున ఆడుతాము. అంతకంటే అదృష్టం ఇంకేమి ఉంటుందని" గంభీర్ పేర్కొన్నాడు.
చదవండి: T20 WC: సునీల్ గవాస్కర్‌ను కలిసిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment