Samantha Rejects Shah Rukh Khan Atlee Movie 'Jawan', Here Is the Reason In Telugu - Sakshi
Sakshi News home page

Samantha: చై కోసం స్టార్‌ హీరో సినిమాకు నో చెప్పిన సమంత!

Published Sun, Jun 5 2022 3:21 PM | Last Updated on Sun, Jun 5 2022 3:42 PM

Samantha Rejects Shah Rukh Khan Atlee Movie Jawan - Sakshi

ఫ్యామిలీ మ్యాన్‌ 2, పుష్ప తర్వాత హీరోయిన్‌ సమంత పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత విషయాలతోనూ సామ్‌ పేరు నిత్యం సోషల్‌ మీడియాలో ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ హీరోయిన్‌ గురించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అక్కినేని నాగచైతన్య కోసం సామ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోనే రిజెక్ట్‌ చేసిందంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో జవాన్‌ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా! ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే నయన్‌ కన్నా ముందు ఈ ఆఫర్‌ సమంతను వరించిందట. 2019లోనే అట్లీ ఈ స్క్రిప్ట్‌ను సామ్‌కు వినిపించాడట. కానీ చైతన్యతో కలిసి కుటుంబ జీవనాన్ని ఆస్వాదించాలనుకున్న సామ్‌ ఫ్యామిలీకి టైం కేటాయించడం కోసం ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించిందని భోగట్టా. కానీ తర్వాత నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే! ఏదేమైనా ఇంత మంచి ఆఫర్‌ను వదులుకునేముందు సమంత ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్‌.

చదవండి: బాత్రూమ్‌లో కాదు ఆరుబయట స్నానం చేయడం ఇష్టం : స్టార్‌ హీరోయిన్‌
ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలను ఇక్కడే తీశాం: వెంకటేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement