లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోనూ విజయాన్ని అందుకున్న ఈ భామ 75 చిత్రాల మార్క్‌ను దాటేశారు. ప్రస్తుతం 76వ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనికి 'మన్నాంగట్టి' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించారు. దీన్ని ఇంతకు ముందు సర్దార్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎస్.లక్షమణన్ తన ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి)
ఈ చిత్రం ద్వారా యూట్యూబర్ డూడ్ విక్కీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు యోగిబాబు, గౌరీ కిషన్, దేవదర్శిని, నరేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఆర్‌డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోడైక్కానల్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది పిరియడ్ కథాంశంతో వైవిధ్యభరిత కథనంతో రూపొందుతున్న చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు.
కాగా కోలమావు కోకిల, ఐరా చిత్రాల తరువాత నయనతార, యోగిబాబు కాంబినేషన్లో రూపొందటంతో ఈ మన్నాంగట్టి చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. కాగా నయనతార టెస్ట్ అనే మరో చిత్రంలోనూ నటిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment