గత నాలుగేళ్లుగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ 2023 సంవత్సరంలో తన సత్తా చాటుతున్నాడు. ఇదే ఏడాది ప్రారంభంలో విడుదలైన షారుఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' ఏకంగా రూ. 1000 కోట్లను కొల్లగొట్టింది. పఠాన్ తొలిరోజున భారత్‌లో రూ. 55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు 'జవాన్'తో మరోసారి బాలీవుడ్ సింహాసనం తనదేనని 57 ఏళ్ల బాద్ షా నిరూపించాడు. సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ సినిమా తొలిరోజే సూపర్ హిట్ టాక్ రావడంతో షారుక్ తన విజయపతాకాన్ని ఎగురవేశాడు. ఈ సినిమా తొలిరోజే భారీ వసూళ్లను రాబడుతోంది.
(ఇదీ చదవండి: Jawan Review: 'జవాన్' మూవీ రివ్యూ)
జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్
షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఓపెనింగ్ రోజున రచ్చ సృష్టించాడు. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్ రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 54 కోట్లు,బాహుబలి రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా జవాన్ ఏకంగా మొదటి రోజు రూ. 75 కోట్లు రాబట్టి ఇండియన్ కలెక్షన్ కింగ్ షారుక్ ఖాన్ అని నిరూపించాడు.
షారుక్ ఖాన్ గత 5 సినిమాల మొదటిరోజు కలెక్షన్స్
► 2016లో విడుదలైన 'ఫ్యాన్' సినిమాతో షారుఖ్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశాడు. అప్పటికి వరుస ఫ్లాప్‌లతో ఉన్న ఆయనకు ఈ సినిమా భారీ విజయాన్ని ఇచ్చింది. ఈ చిత్రం తొలిరోజు రూ.19.10 కోట్లు వసూలు చేసింది.
► ఆ తర్వాతి సంవత్సరం 2017లో షారుఖ్ ఖాన్, పాకిస్థానీ నటి మహిరా ఖాన్ జంటగా నటించిన చిత్రం రయీస్.. షారుఖ్ ఖాన్‌కు అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా కలెక్ట్ చేయలేదు. ఈ సినిమా తొలిరోజే 20.40 కోట్లు రాబట్టింది.
► 2017లో 'జబ్ హ్యారీ మెట్ సెజల్' సినిమాతో షారుక్ ఖాన్, ఇంతియాజ్ అలీతో పని చేయడం ఇదే మొదటిసారి. 2017లో విడుదలైన ఈ సినిమా షారుఖ్, అనుష్కల 'రబ్ నే బనాదీ'ల హిట్ పెయిరింగ్ ఈ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా తొలిరోజు మొత్తం 15.25 కోట్లు మాత్రమే రాబట్టింది.
► 2018 సంవత్సరంలో విడుదలైన 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత, బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ కెరీర్ ముగిసిందని భావించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో షారుక్ ఖాన్ ఇంటికే పరిమితం అయ్యాడు. జీరో సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కేవలం 19.35 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
► షారుఖ్ ఖాన్ తన 30 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో 'జీరో' చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఇదే చివరి సినిమాగా అని అందరూ భావించారు. 2018 నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో 'పఠాన్'ని అభిమానులకు అందించాడు. ఈ సినిమా భారత్‌లో మొదటిరోజు ఏకంగా రూ. 55 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్టార్‌డమ్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసింది.
బాలీవుడ్‌లో అతనికి ఇంకా స్థానం ఉందని షారుక్ అప్పుడే అనుకున్నాడు. షారుక్ ఖాన్ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం పఠాన్. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం జవాన్ కూడా రూ. 1000 కోట్లను సులభంగా దాటడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment