ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం 'జవాన్' మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. సౌత్ డైరెక్టర్ అట్లీతో కలిసి షారుఖ్ ఖాన్ భారతీయ సినిమా మార్కెట్‌లో వసూళ్ల రికార్డును సృష్టించాడు. అదే సమయంలో షారుక్ ఖాన్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షారుఖ్ ఖాన్ సినిమా 'జవాన్' పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో షెడ్యూల్ ప్రకారం విడుదల కాలేదు. గతంలో షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ కూడా అదే రోజు బంగ్లాదేశ్‌లో విడుదల కాలేదు. తాజాగా జవాన్ సినిమా కూడా బంగ్లాదేశ్‌లో విడుదల కాకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
బంగ్లాదేశ్‌లో జవాన్‌ను ఎందుకు విడుదల చేయలేదు..
విశేషమేమిటంటే, బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అంతర్యుద్ధం లాంటి పరిస్థితిలో నెలకొని ఉన్నాయి. వచ్చే ఏడాది 2024లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ప్రజలు పలు చోట్ల ప్రభుత్వం పట్ల నిరసనలు వంటివి చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ, సామాజిక పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. కొన్ని చోట్ల కర్ఫ్యూ వాతావారణం నెలకొని ఉంది. దీంతో అక్కడ జవాన్ విడుదలను బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ నిషేధించబడింది. దీంతో అక్కడ ఆయన ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఇప్పట్లో బంగ్లాదేశ్‌లో షారుఖ్ ఖాన్ సినిమా జవాన్‌కి థియేటర్లు ఎప్పుడు లభిస్తాయో చెప్పడం కష్టం.
జవాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్
షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఓపెనింగ్ రోజున రచ్చ సృష్టించాడు. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ. 75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు పఠాన్ రూ.55 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ. 54 కోట్లు,బాహుబలి రూ. 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా జవాన్ ఏకంగా మొదటి రోజు రూ. 75 కోట్లు రాబట్టి ఇండియన్ కలెక్షన్ కింగ్ షారుక్ ఖాన్ అని నిరూపించాడు.
(ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్)
Comments
Please login to add a commentAdd a comment