బాద్‌షా షారుక్ ఖాన్ మరో హిట్ కొట్టేశాడు. 'జవాన్'తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం వస్తున్న టాక్, కలెక్షన్స్ చూస్తుంటే.. మరో రూ.1000 కోట్ల పక్కా అనిపిస్తుంది. ఈ ఏడాది 'పఠాన్'తో దుమ్ములేపాడు. ఇప్పుడు మరోసారి రచ్చ చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఓ విషయంలో 'జవాన్', ప్రభాస్ 'ఆదిపురుష్'ని మాత్రం దాటలేకపోయింది.
కింగ్ ఖాన్ షారుక్ దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత.. ఈ ఏడాది 'పఠాన్'తో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఇప్పుడు 'జవాన్'తో సూపర్‌హిట్ కొట్టేశాడు. తమిళ దర్శకుడు అట్లీ తీసిన ఈ చిత్రంలో కథ కొత్తగా లేనప్పటికీ.. స్రీన్ ప్లే రేసీగా ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయే రేంజులో ఉండేసరికి జనాలకు సినిమా నచ్చేసింది. దీంతో తొలిరోజు ఏకంగా రూ.129.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో రిలీజైన సూపర్‌హిట్ సినిమా.. కానీ?)
అయితే హిట్‌తో షారుక్ ఖాన్.. తొలిరోజు అద్భుతమైన వసూళ్లు సాధించి ఉండొచ్చు. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ ని మాత్రం దాటలేకపోయాడు. ఎందుకంటే ఈ ఏడాది జూన్ లో రిలీజైన 'ఆదిపురుష్' చిత్రానికి తొలిరోజు రూ.136.84 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ టాప్ లో ఉన్నట్లే. మరి డార్లింగ్ హీరోని బీట్ చేయాలంటే మళ్లీ 'సలార్' రావాలేమో?
'జవాన్' కథేంటి?
భారత్-చైనా సరిహద్దుల్లోని నదిలో గాయాలతో ఉన్న ఓ వ్యక్తి కొట్టుకొస్తాడు. కట్ చేస్తే ముంబయిలో విక్రమ్ రాథోడ్ (షారుక్ ఖాన్).. ఆరుగురు అమ్మాయిలతో కలిసి మెట్రో ట్రైన్‌ని హైజాక్ చేస్తాడు. ప్రయాణికుల్ని విడిచిపెట్టాలంటే రూ.40 వేల కోట్లు కావాలని అంటాడు. అనుకున్నది సాధిస్తాడు కూడా. ఇంతకీ విక్రమ్ రాథోడ్ ఎవరు? జైలర్‌గా పనిచేస్తున్న ఆజాద్‌తో ఇతడికి సంబంధం ఏంటనేదే 'జవాన్' స్టోరీ.
(ఇదీ చదవండి: 'జవాన్' మూవీ రివ్యూ)
God is so kind
— atlee (@Atlee_dir) September 8, 2023
Thank you everyone
Thank you for the Massy-ive love ❤
Book your tickets now!https://t.co/uO9YicOXAI
Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/q1TdI37nJZ
Top 5 Openers WW Box Office[2023]#Adipurush - ₹ 136.84 cr#Jawan - ₹ 125.05 cr#Pathaan - ₹ 106 cr#Jailer - ₹ 95.78 cr#PonniyinSelvan2 - ₹ 61.53 cr
— Manobala Vijayabalan (@ManobalaV) September 8, 2023
Comments
Please login to add a commentAdd a comment