Vijay Sethupathi Shocking Remuneration For Shah Rukh Khan and Atlee Jawan Movie - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: జవాన్‌ కోసం రెండు సినిమాలు వదిలేసుకున్న నటుడు!?

Published Sun, Aug 28 2022 5:15 PM | Last Updated on Sun, Aug 28 2022 5:54 PM

Vijay Sethupathi Remuneration For Shah Rukh Khan and Atlee Jawan - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోల్‌ నచ్చిందంటే చాలు భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా సినిమాలు చేస్తున్నాడు. ఉప్పెన చిత్రంతో తెలుగులో విలన్‌గా పరిచయమైన ఈయన ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌, కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జవాన్‌ సినిమాలో సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడట. ఈ పాన్‌ ఇండియా సినిమాకోసం ఆయన్ను ఒప్పించేందుకు అక్షరాలా 21 కోట్ల రూపాయలు ముట్టజెపుతున్నారట.

ఇటీవల రిలీజైన విక్రమ్‌ సినిమాలో ఆయన నటించిన పాత్రకు విశేష స్పందన రావడంతో తన రెమ్యునరేషన్‌ను రూ15 కోట్ల నుంచి 21 కోట్ల మేరకు పెంచాడట విజయ్‌ సేతుపతి. అంతేకాదు, జవాన్‌ సినిమా కోసం అప్పటికే లైన్‌లో ఉన్న రెండు సినిమాలను కూడా అతడు వదిలేసుకున్నట్లు సమాచారం. దీంతో జవాన్‌ నిర్మాతలు అతడు అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఇదిలా ఉంటే జవాన్‌ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా దీపికా పదుకొణె ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇటీవలే దీపిక రోల్‌కు సంబంధించిన చిత్రీకరణ సైతం పూర్తయింది.

చదవండి: నానామాటలు అన్న థియేటర్‌ యజమానిని నేరుగా కలిసిన రౌడీ హీరో
 అభిమాని పాదాలకు నమస్కరించిన స్టార్‌ హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement