పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా మార్కెట్ రేంజ్ ఏంటో బాలీవుడ్‌కు చూపించాడు. కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టాడు. జూన్ 27న విడుదలైన కల్కి.. 40 రోజులు దాటినా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. ఇండియా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో కల్కి చేరిపోయింది. భారత్‌లో గ్రాస్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీని కల్కి 2898 ఏడీ దాటేసింది. జవాన్ లైఫ్‌టైమ్ రికార్డ్‌ను కల్కి 40 రోజలు కలెక్షన్లతో దాటేసింది.
షారూఖ్ లైఫ్ టైమ్ రికార్డ్ దాటేసిన ప్రభాస్
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. బాహుబలి 2: ది కన్‌క్లూజన్, KGF 2, RRR తర్వాత భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా కల్కి సత్తా చాటింది. ఇప్పటి వరకు భారత్‌లో నాలుగో స్థానంలో ఉన్న షారుఖ్ జవాన్ చిత్రాన్ని ఈ చిత్రం అధిగమించింది. జవాన్ మొత్తం రూ.640.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే.. కల్కి భారత్‌లో రూ. 641.13 కోట్ల నెట్ మార్క్‌ను అధిగిమించింది. ప్రస్తుతానికి, కల్కి నెట్, గ్రాస్ కలెక్షన్లలో ముందుంది.
అయితే, ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌లో మాత్రం జవాన్ ఇంకా రేసులో ఉంది. జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1160 కోట్లు రాబడితే.. కల్కి రూ. 1100 కోట్లు సాధించింది. మరో రూ. 60 కోట్లు కలెక్ట్ చేస్తే అందులో కూడా ప్రభాస్ ముందుంటాడు.
ఏ వారంలో ఎంత కలెక్షన్
కల్కి 2898 AD మొదటి వారంలో రూ. 414.85 కోట్లు, రెండో వారంలో రూ. 128.5 కోట్లు, మూడో వారంలో రూ. 56.1 కోట్లు, నాలుగో వారంలో రూ. 24.4 కోట్లు వసూలు చేసి ఐదవ వారంలో రూ.12.1 కోట్ల వసూళ్లను కొనసాగించింది. ప్రస్తుతం ఆరో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 5.18 కోట్లతో మొత్తం దేశీయ కలెక్షన్ రూ. 641.13 కోట్లు అని ఒక సంస్థ నివేదించింది. మరో రెండు వారాల పాటు కల్కి కలెక్షన్స్ కొనసాగుతాయని ఆ సంస్థ తెలిపింది.
కల్కికి ఉన్న పోటీ ఏంటి..?
జవాన్ థియేట్రికల్ రన్ ఎనిమిది వారాల వరకు కొనసాగింది. కల్కి 2898 AD ఇంకా ఆరవ వారంలో ఉంది. మరికొన్ని వారాల పాటు కొనసాగుతుంది. ఆగస్ట్ 15న విడుదలవుతున్న స్ట్రీ 2, వేదా, ఖేల్ ఖేల్ మే వంటి కొత్త సినిమాలతో పోటీ పడాల్సి ఉంది. ప్రస్తుతం డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్ సినిమాతో పోటీ పడుతూ కల్కి ముందుకు సాగింది.
కల్కి 2898 AD హిందూ పురాణాలను ప్రధాన అంశంగా తీసుకుని దానికి సాంకేతికత జోడించి సైన్స్ ఫిక్షన్ రూపంలో డైరెక్టర్ తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్,అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి బలమైన తారాగణం ఉంది. ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రత్యేక పాత్రలలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment