
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.625 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలు పోషించారు.
అరుదైన ఘనత
తాజాగా ఈ సినిమా ఓవర్‌సీస్‌లోనూ దూసుకెళ్తోంది. కల్కి మరో ఘనతను సాధించింది. ఉత్తర అమెరికాలో 12 మిలియన్ల డాలర్ల వసూళ్లను అధిగమించింది. ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. కాగా.. హిందీ వర్షన్‌లో ఇప్పటి వరకు మొత్తం రూ.135 కోట్లు వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.1000 కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్ లోపే ఈ సినిమా ఆ మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది .
Comments
Please login to add a commentAdd a comment