ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి నాకు ద్రోహం చేశారు: నటి | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి నాకు ద్రోహం చేశారు: నటి

Published Sat, Feb 3 2024 10:52 AM

Sakshi Agarwal Comments On Raja Rani Movie Makers

కోలీవుడ్‌లో ప్రముఖ డైరెక్టర్‌ అట్లీ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తెరకెక్కిస్తూ కోలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ బేస్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. 'జవాన్‌' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అట్లీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. షారుక్‌ ఖాన్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటింది.

రాజా రాణి సినిమాతో ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆర్య, నయనతార, నజ్రియా, జై తదితరులతో తెరెక్కిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అట్లీ మేకింగ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. దీంతో ఆయనకు వెంటనే హీరో విజయ్‌తో 'తెరి' సినిమా ఛాన్స్‌ దక్కింది. అది కూడా హిట్‌ కొట్టడంతో ఆయనతో వరుసగా మెర్సిల్‌, బిగిల్‌ వంటి చిత్రాలను తెరకెక్కించే ఛాన్స్‌ దక్కింది. ఆపై ఆయనకు జవాన్‌తో బాలీవుడ్‌లో కూడా అవకాశం దక్కింది.

తాజాగా అట్లీ డైరెక్ట్‌ చేసిన 'రాజా రాణి' చిత్రం గురించి హీరోయిన్‌ సాక్షి అగర్వాల్‌ వైరల్‌ కామెంట్‌ చేసింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ' నేను బెంగుళూరులో ఉన్న‌ప్పుడు రాజా రాణి సినిమా చేసే అవ‌కాశం నాకు వ‌చ్చింది. నేను అప్పుడు మోడలింగ్ చేస్తున్నాను. ఆ చిత్రానికి సంబంధించిన యూనిట్‌ నా కాస్టింగ్ ఏజెన్సీని సంప్రదించి రాజా రాణిలో నటించడం గురించి మాట్లాడారు. ఆ సినిమాలో ఆర్య హీరో అని కూడా చెప్పారు. ఆపై నువ్వు సెకండ్ హీరోయిన్ అని నాకు తెలిపారు. వారు చెప్పింది విని నేను కూడా నిజమని నమ్మాను. దీంతో వెంటనే ఓకే చెప్పాను.

ఆ సమయంలో నాతో కొన్ని సీన్లు కూడా తీశారు. తర్వాత ఏమైందో తెలీయదు కానీ ఆ చిత్ర యూనిట్‌ నుంచి నాకు కాల్స్‌ రావడం ఆగిపోయాయి. కొద్దిరోజుల తర్వాత రాజా రాణి సినిమా విడుదలైంది. అవకాశం ఇచ్చినట్లే ఇచ్చే కొన్ని సీన్లకే నన్ను పరిమితం చేశారని తర్వాత అర్ధమయింది. అవి కూడా ఒక రెస్టారెంట్‌లో కాఫీ ఆర్డర్‌ చేసే పాత్రలో చూపించారు. నువ్వే సెకండ్‌ హీరోయిన్‌ అని చెప్పి చాలా చిన్న పాత్ర ఇచ్చారు. అందుకు కారణాలు ఎంటో నాకు ఇప్పటికీ తెలియదు. అదే సమయంలో దీని గురించి నేను దర్శకుడు అట్లీతో మాట్లాడి ఉండుంటే బాగుండేది. ఆయనతో మాట్లాడకపోవడం నా తప్పు అయింది. హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి వారు నాకు పెద్ద ద్రోహమే చేశారు. అని ఆమె తెలిపింది.

మోడల్ అయిన సాక్షి అగర్వాల్‌కి తమిళంలో సరైన అవకాశాలు రాలేదు. ఆమె కొన్ని చిత్రాలలో కనిపించింది. కాలాలో రజనీకాంత్ కోడలుగా ఆమె మెప్పించింది. ఆపై బిగ్ బాస్‌లో కూడా పాల్గొని మరింత పాపులర్‌ అయింది. ప్రస్తుతం కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటిస్తుండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
 
Advertisement