![En Ethire Rendu Papa Web Series Streaming On Hungama OTT Platform - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/24/en-ethirile-rendu-papa.jpg.webp?itok=-bGqyfdv)
హంగామా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో 'ఎన్ ఎదిరిలే రెండు పాప' వెబ్ సిరీస్ హల్‌చల్ చేస్తోంది. నటి సాక్షీ అగర్వాల్, షారిక్ హాసన్, మనీషా జాహ్నవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ బుధవారం నుంచి హంగామా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
దీని గురించి ఆ ఓటీటీ సంస్థ సీఈవో సిద్ధార్ధరాయ్ తెలుపుతూ తాము ఇంతకు ముందు ప్రసారం చేసిన మాయా తోట్ట వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. తాజాగా ఎన్ ఎదిరిలే రెండు పాప వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఇది రొమాంటిక్ కామెడీతో పాటు థ్రిల్లర్ జానర్‌తో కూడిన వెబ్ సిరీస్ అని పేర్కొన్నారు. ఇది ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించడంతో పాటు పలు ఆసక్తికరమైన ఘటనలతో సాగుతుందన్నారు. సాక్షి అగర్వాల్ మాట్లాడుతూ.. ఇది ఇంక్రిడబుల్ జర్నీ కథాంశంతో కూడిన వైవిధ్యభరిత వెబ్ సిరీస్ అని చెప్పారు. ఇందులో తాను ఒక మోడరన్ యువతిగా నటించానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment