రాజారాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ డైరెక్టర్ శంకర్ శిష్యుడు అన్న విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న అట్లీ ఆ తర్వాత విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, తెరీ, బిగిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి షారుక్ ఖాన్ కథానాయకుడిగా జవాన్ చిత్రాన్నిచేశారు. నయనతార, దీపిక పడుకొనే, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.
తాజాగా మరో బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ఇంతకుముందు తమిళంలో విజయ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తెరి చిత్రాన్ని హిందీలో బేబీ జాన్ పేరుతో నిర్మించారు. నటి కీర్తి సురేష్‌ను ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయం చేశారు. వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈనెల 25వ తేదీన తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే దర్శకుడు అట్లీ తమిళంలో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.
బాలీవుడ్‌కు చెందిన మురాద్ ఖేతని చిత్ర నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందులో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. మహారాజా విడుదలై విజయాలతో మంచి జోరు మీద ఉన్న విజయ్ సేతుపతి కథానాయకుడుగా నటించనున్న ఈ చిత్రం సంబంధించిన దర్శకుడు, కథానాయకి తదితర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment