
బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి యానిమల్ సినిమాతో యూత్ ఫేవరెట్‌గా మారిపోయింది. ఈ మూవీ తర్వాత అందరూ ఆమెను నేషనల్ క్రష్ అని పిలవడం మొదలుపెట్టారు. అలా పిలుస్తున్నందుకు తెగ మురిసిపోతోందీ అమ్మడు. తన అభిమానులను అలరిస్తూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తోంది.

స్పెషల్ అట్రాక్షన్‌గా..
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాడ్ న్యూస్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ హాజరయ్యారు. అందరిలోనూ స్పెషల్‌గా ఉండాలని ఆరాటపడే తృప్తి ఈ ఈవెంట్‌లోనూ అందంగా ముస్తాబై సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలబడింది.
చిన్న డ్రెస్‌కు అంత ఖరీదా?
పొట్టి డ్రెస్ కనిపించి కనువిందు చేసింది. మోకాలిపై వరకే ఉన్న ఈ బ్లాక్ డ్రెస్ ధర వేలల్లో కాదు లక్షల్లోనే ఉంది. వెర్సేస్ అనే బ్రాండ్‌కు చెందిన ఈ మినీడ్రెస్ ఏకంగా రూ.4,06,234గా ఉంది. దీని ధర చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత చిన్న అవుట్‌ఫిట్‌కు అన్ని లక్షలా అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే బ్యూటీ భూల్ భులాయా 3 మూవీలోనూ నటిస్తోంది.
చదవండి: బచ్చలమల్లి గ్లింప్స్: ఊర మాస్ లుక్‌లో అల్లరి నరేశ్
Comments
Please login to add a commentAdd a comment