'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే? | Tripti Dimri Bad Newz Movie Review And Rating Telugu | Sakshi
Sakshi News home page

Tripti Dimri Bad Newz: థియేటర్లలోకి వచ్చిన ఫన్నీ మూవీ.. టాక్ ఏంటి?

Published Sat, Jul 20 2024 9:57 AM | Last Updated on Sat, Jul 20 2024 10:48 AM

Tripti Dimri Bad Newz Movie Review And Rating Telugu

'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తృప్తి దిమ్రి.. హీరోయిన్‌గా వరస అవకాశాలు దక్కించుకుంటోంది. అలా చేసిన ఓ మూవీనే 'బ్యాడ్ న్యూజ్'. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఫన్నీ ఎంటర్‌టైనర్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగోళ్లకు నచ్చుతుందా లేదా అనేది చూద్దాం.

కథేంటి?
చెఫ్‌గా ఇంటర్నేషనల్ లెవల్లో అవార్డ్ తెచ్చుకోవాలనే లక్ష‍్యమున్న సలోని (తృప్తి దిమ్రి).. కుటుంబ సభ్యుల తాకిడి తట్టుకోలేక అఖిల్ చద్దా (విక్కీ కౌశల్)ని పెళ్లి చేసుకుంటుంది. హనీమూన్‌కి వెళ్తారు గానీ అక్కడ గొడవ జరగడంతో విడాకులు తీసుకునేందుకు రెడీ అయిపోతారు. పనిలో భాగంగా ముస్సోరికి వెళ్లిన సలోని.. గుర్బీర్ పన్ను(అమీ విర్క్)తో కాస్త దగ్గరవుతుంది. దీంతో ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సలోని కడుపులో అఖిల్, గుర్బీర్‌కి చెందిన కవలలు ఉన్నారని డాక్టర్స్ చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రులిద్దరూ ఏం చేశారనేదే మెయిన్ స్టోరీ.

(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)

ఎలా ఉందంటే?
వినగానే స్టోరీ పాయింట్ కాస్త వింతగా ఉన్నప్పటికీ.. కామెడీ కోసమే అన్నట్లు సినిమా తీశారు. కాకపోతే స్క్రీన్ ప్లే‌తోపాటు నవ్వించాల్సిన సీన్స్ సరిగా వర్కౌట్ కాలేదు. మరీ ముఖ్యంగా తృప్తి దిమ్రి ఓకే అనిపించే యాక్టింగ్ చేసింది. నటన పరంగా ఈమె ఇంకా చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. సెకండాఫ్‌లో ప్రధాన పాత్రధారులు ఇ‍ద్దరూ కలుసుకునే సీన్స్ చాలా సాగదీశారు. దీంతో అప్పటివరకు కాస్తోకూస్తో ఎంటర్‌టైన్ చేసిన సినిమా బోర్ కొట్టేస్తుంది. 'బ్యాడ్ న్యూజ్'లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది విక్కీ కౌశల్ మాత్రమే. తన వంతు చాలా కష్టపడ్డాడు.

'కల్కి' రిలీజై నాలుగు వారాలు అయిపోతున్నప్పటికీ చాలాచోట్ల ఇంకా దీని హవానే నడుస్తోంది. గత వారం 'భారతీయుడు 2' వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ 'డార్లింగ్', 'పేకమేడలు' పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కానీ ఏ మేరకు నిలబడతాయనేది చూడాలి. ఇక 'బ్యాడ్ న్యూజ్' కూడా బాలీవుడ్ ఆడియెన్స్‌కి నచ్చొచ్చు ఏమో గానీ మరీ ఎగబడి వెళ్లేంత అయితే ఈ మూవీలో ఏం లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చని అంటున్నారు.

(ఇదీ చదవండి: 'ద బర్త్ డే బాయ్' మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement