నీ ప్రేమలో..! | Triptii Dimri to star opposite Dhanush Next | Sakshi
Sakshi News home page

నీ ప్రేమలో..!

Published Fri, Jul 12 2024 4:57 AM | Last Updated on Fri, Jul 12 2024 8:05 AM

Triptii Dimri to star opposite Dhanush Next

రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’లో జోయా పాత్రలో గ్లామరస్‌గా నటించి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్‌ త్రిప్తీ దిమ్రి. ‘యూనిమల్‌’ సినిమా కూడా బాక్సాఫీస్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో రాజ్‌కుమార్‌ రావుతో ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’, కార్తీక్‌ ఆర్యన్‌తో ‘భూల్‌ భూలయ్యా 3’, సిద్ధాంత్‌ చతుర్వేదితో ‘ధడక్‌ 2’ సినిమాల్లో హీరోయిన్‌గా చాన్స్‌లు దక్కించుకున్నారు త్రిప్తి. 

ఈ బ్యూటీకి మరో హిందీ సినిమా ఆఫర్‌ దక్కిందని టాక్‌. ‘రాంఝణా’, ‘అత్రంగి రే’ చిత్రాల తర్వాత హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కనుంది. ప్రేమకథ నేపథ్యంలో ‘తేరే ఇష్క్‌ మే’ (నీ ప్రేమలో) టైటిల్‌తో ఈ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను అక్టోబరులో ్రపారంభించాలనుకుంటున్నారు. హీరోయిన్‌ పాత్రకు త్రిప్తీ దిమ్రిని సంప్రదించారనే ప్రచారం బాలీవుడ్‌లో జరుగుతోంది. మరి... ‘తేరే ఇష్క్‌ మే’ అంటూ ధనుష్‌తో త్రిప్తిæజోడీ కడతారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement