యానిమల్ మూవీతో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ సినిమా తర్వాత ఆమె 'బ్యాడ్ న్యూజ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్కీ కౌశల్, అమీ ఆర్క్, నేహా ధూపియా తదితరులు నటించిన ఈ సినిమా జులై 19న విడుదలైంది. అనంతరం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కానీ, సబ్‌స్క్రిప్షన్ ఫీజ్ చెల్లించిన వారికే సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. అయితే, తాజాగా సబ్‌స్క్రిప్షన్ ఫీజ్‌ను ఆ ఓటీటీ సంస్థ తొలగించింది.
బ్యాడ్ న్యూజ్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మూవీని చూడాలంటే రూ. 349 చెల్లించాల్సి వచ్చింది. తాజాగా అమెజాన్ దానిని తొలగించింది. అదనంగా ఎలాంటి రుసుము చెల్లించకుండానే బ్యాడ్ న్యూజ్ చిత్రాన్ని చూడొచ్చు అంటూ తెలిపింది. హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్ల గ్రాస్ రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment