ఒక్క పాటకు అరవై లక్షలు!
ఒక్క పాటకు అరవై లక్షలు!
Published Mon, Sep 30 2013 2:33 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సంచలన వ్యాఖ్యలు చేసి, వివాదాలకు గురవ్వడం పూనమ్ పాండేకి అలవాటు. నిర్మొహమాటంగా మాట్లాడే పూనమ్ దుస్తుల విషయంలో కూడా ఎలాంటి మొహమాటాలు పాటించదు. చాలా పొదుపుగా వాడుతుంటుంది. ‘నషా’ చిత్రంలో ఎక్స్‌పోజింగ్ విషయంలో ఈ హాట్‌గాళ్ హద్దులు దాటేసింది.
ఇప్పుడు దక్షిణాది తెరపై విజృంభించడానికి రెడీ అయ్యింది. కన్నడ చిత్రం ‘లవ్ ఈజ్ పాయిజన్’లో ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించింది పూనమ్. మరో నాలుగైదు రోజుల్లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ చిత్రీకరణకు పూనమ్ తీసుకుంటున్న పారితోషికం 60 లక్షలని సమాచారం. ఇప్పటికే శాండిల్‌వుడ్‌లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యిందట. ఎందుకంటే, అక్కడ స్టార్ హీరోయిన్ తీసుకునే పారితోషికం అరకోటి లోపేనట. అలాంటిది ఒక్క పాటకు అరవై లక్షలా? అని చర్చించుకుంటున్నారని వినికిడి.
Advertisement
Advertisement