
ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే పెళ్లికి సిద్ధమయ్యారు. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబెతో పూనమ్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. వారిద్దరు రింగ్‌లు మార్చుకున్న ఫొటోను సామ్ షేర్ చేశారు. ‘చివరకు మేము.. పూర్తి చేసాం’ అని పేర్కొన్నారు. దీనిపై కామెంట్ చేసిన పూనమ్.. బెస్ట్ ఫీలింగ్ అని అన్నారు. (సాయంత్రం నితిన్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్)
కాగా, సామ్, పూనమ్‌లు గత కొద్దికాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే పూనమ్ కూడా తనదైన వ్యాఖ్యలతో పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మే నెలలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీరిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఖండిచిన పూనమ్.. తాను సమయంలో ఇంట్లో సినిమా చూస్తూ ఉన్నట్టు తెలిపారు. (‘శభాష్ సైబరాబాద్ పోలీస్.. ఎస్‌సీఎస్‌సీ’ )
Comments
Please login to add a commentAdd a comment