2011 ప్రపంచ కప్ సమయంలో బాలీవుడ్ నటి పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారత్ జట్టు గెలిస్తే బట్టలు విప్పి మైదానమంతా తిరుగుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేసి మరోసారి పూనమ్ వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుతున్న సంగతి తెలిసిందే. సౌథాంప్టన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌పై తన అభిప్రాయం చెప్పాల్సిందిగా తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ అడగ్గా ఆమె స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు పూనమ్ మాట్లాడుతూ.. ‘క్రికెట్ మొదలైందా? జనం క్రికెట్ ఆడుతున్నారా? ఈసారి కూడా భారత జట్టు గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్లీ చెప్పాలా? అయితే.. ఈ మ్యాచ్ గురించి నాకు తెలియదు’ అంటూ వ్యాఖ్యానించింది.
ఇక ఆమె వ్యాఖ్యలపై పూనమ్ భర్త సామ్ బాంబే స్పందిస్తూ.. తనకు బదులుగా ఈ సారి తాను నగ్న ప్రదర్శన చేస్తానని సమధానం ఇచ్చాడు. దానికి ‘వద్దులే నువ్వు చేస్తే ఇండియా ఓడిపోతుంది’ అంటూ పూనమ్ చమత్కారంగా బుదులిచ్చింది. చివరకు తను ఇండియా గెలవాని కోరుకుంటున్నానని పేర్కొంది. కాగా తెలుగులో పూనమ్ ‘మాలిని అండ్ కంపెనీ’ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసిన ఆమె గతేడాది సెప్టెంబర్ 1న దర్శకుడు సామ్ బాంబేను పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment