నన్ను బలిపశువును చేయకండి: పూనమ్
ముంబై: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు తనను బాధ్యురాలిని చేయడం తగదని బాలీవుడ్ నటి పూనమ్ పాండే పేర్కొన్నారు. ఫోటోషూట్‌లలో అసభ్యకరంగా ఫోజులిస్తూ, మ్యాగజైన్ ముఖ చిత్రాలపై అర్ధ నగ్నంగా కనబడే పూనమ్ లాంటి తారల వల్లే దేశంలో అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని విమర్శల నేపథ్యంలో ఆమె పెదవి విప్పారు.
అత్యాచార ఘటన లు జరగడానికి తాను ఎంత మాత్రం బాధ్యరాలిని కాదన్నారు. ఐఎన్‌ఎస్‌తో మంగళవారం మాట్లాడిన ఆమె..’ రేప్ ఘటనలపై నన్ను బలిపశువుని చేస్తున్నారని, నా సినిమాలు ఎప్పుడు మహిళలను కించపరిచే విధంగా ఉండవన్నారు. ఇటువంటి దురాఘాతాలకు నా చిత్రాలు వ్యతిరేకమన్నారు.
రెండు రోజుల క్రితం ముంబై ఫోటో జర్నలిస్ట్‌పై జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకిత్తించడంతో పూనమ్‌పై విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అత్యాచార ఘటనకి తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా .. బాధ్యురాలిని చేయడం బాధ కల్గిస్తుందన్నారు. అంతకముందు కూడా ఇటువంటి ఉదంతాలు జరగలేదా అని పూనమ్ ప్రశ్నించారు. గతంలో ఢిల్లీలో నిర్భయపై జరిగిన రేప్ ఘటనను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలని ఎదురు ప్రశ్నించారు. దేశంలో చట్టాలు విఫలం చెందడం వల్లే ఇటువంటి ఘటనలు పునారావృతమవుతున్నాయని ఆమె మండిపడ్డారు.