శక్తి మిల్స్‌లో చెత్త తొలగించండి: హైకోర్టు
Published Fri, Oct 11 2013 12:41 AM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM
ముంబై: ఇటీవలకాలంలో ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగిన శక్తి మిల్స్‌లో చెత్త, పొదల తొలగింపు విషయమై వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని మిల్లు ప్రతినిధులకు, ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) అధికారులకు బోంబే హైకోర్టు గురువారం ఆదేశించింది. ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచారం అనంతరం శక్తి మిల్స్‌లో రక్షణ చర్యల నిమిత్తం సంయుక్తంగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని మిల్లు లిక్విడేటర్‌కు, పీడబ్ల్యూడీ అధికారులను హైకోర్టు ఆదేశిం చింది. దీంతో స్పందించిన అధికారులు మిల్లు పరి స్థితులపై అధ్యయనం చేసి మూడు దశల రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మొదటి దశలో చెత్త, పొదల తొలగింపు చేపట్టడం, రెండో దశలో కాంపౌండ్ నిర్మించి, ఫెన్సింగ్ వైర్‌ను అమర్చడం.. మూడో దశలో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చేయడం.. ఈ మూడు దశల నిర్వహణకు రూ. 1.5 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొంది. కాగా, మొదటి దశ నిర్వహణకు రూ.17 లక్షల అంచనా ఖర్చును పీడబ్ల్యూడీ ప్రతిపాదించింది. కాగా, వీలైనంత తొందరగా పీడబ్ల్యూడీ అధికారులు, మిల్లు ప్రతినిధులు సమావేశమై పనులు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.
Advertisement
Advertisement