గ్యాంగ్‌రేప్‌పై వెల్లువెత్తిన నిరసన
Published Sun, Aug 25 2013 4:51 AM | Last Updated on Wed, Aug 1 2018 4:24 PM
శివాజీనగర్, న్యూస్‌లైన్ :ముంబయి నడిబొడ్డున గురువారం విధి నిర్వహణలో ఉన్న మహిళా ఫొటోగ్రాఫర్‌పై ఐదుగురు వ్య క్తులు గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన ఘటనకు నిరసనగా శనివారం ప్రెస్‌ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ప్రెస్‌క్లబ్ నుంచి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యా లీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశా రు. నిర్భయ ఘటన మరువకముందే మరో దారుణం జరగటం శోచనీయమన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశా రు.
అనంతరం డీఐజీ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల సాయిలు, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపూల లింబాద్రి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీనివా స్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సిద్ధార్థ ఇన్‌స్టిట్యూష న్స్ అధినేత మీసాల శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ అధ్యక్షుడు గైనీ గంగారాం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఫొటోగ్రాఫర్ సంఘం అధ్యక్షుడు నర్సింహా చారి, కార్యదర్శి ఎల్. రవీందర్, ఉపాధ్యక్షుడు కేవీ రమణ, వేణుగోపాల్, కోశాధికారి బి.రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి రతన్‌రెడ్డి, ఈసీ సభ్యులు రంజిత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement