జర్నలిస్ట్ గ్యాంగ్‌రేప్ కేసులో వారంలో అభియోగపత్రం
Published Mon, Sep 16 2013 12:10 AM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM
ముంబై: నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకం చేసిన ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై రెండుమూడు రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయమై క్రైం బ్రాంచి అధికారి ఒకరు మాట్లాడుతూ... అభియోగపత్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశాం. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో కోర్టుకు సమర్పిస్తాం. బహుశా మంగళవారం కోర్టుకు అందజేసే అవకాశముంది. కేసు దర్యాప్తు చివరిదశలో లభించిన మరికొన్ని ఆధారాలతో అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేస్తాం. చార్జిషీట్‌లో ఎటువంటి లోపాలు లేకుండా రాష్ట్ర న్యాయవిభాగం కూడా అవసరమైన సహాయాన్ని అందజేస్తుంద’న్నారు.
Advertisement
Advertisement