మహిళ కాలేజీకి వెళ్తుండగా మినీ వ్యాన్‌లో వచ్చి.. | Woman Allegedly Gangraped, Thrown Out Of Moving Car | Sakshi
Sakshi News home page

మహిళ కాలేజీకి వెళ్తుండగా మినీ వ్యాన్‌లో వచ్చి..

Published Fri, Jul 7 2017 4:35 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

మహిళ కాలేజీకి వెళ్తుండగా మినీ వ్యాన్‌లో వచ్చి..

మహిళ కాలేజీకి వెళ్తుండగా మినీ వ్యాన్‌లో వచ్చి..

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దారుణం చోటు చేటుచేసుకుంది. కాలేజీకి వెళుతున్న ఓ మహిళను బలవంతంగా తమ వ్యాన్‌లోకి లాక్కొని ఎత్తుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం పాశవికంగా ప్రవర్తిస్తూ వాహనంలో కదులుతుండగానే కిందికి తోసి పారిపోయారు. భయానకమైన ఈ ఘటనను ఆ మహిళ పోలీసులకు వివరించింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ముంబయి సుబర్స్‌లోని చార్కోప్‌ ప్రాంతంలోని ఓ కాలేజీకి 20 ఏళ్ల మహిళ వెళుతుండగా ఆమెకు దగ్గరగా ఒక మినీ వ్యాన్‌ వచ్చింది. రన్నింగ్‌లోని దాని డోర్‌ ఓపెన్‌ చేసి ఆమెను వ్యాన్‌లోపలికి బలవంతంగా ఎక్కించారు.

ఆ వెంటనే ముంబయికి సమీపంలోని మాధ్‌ ఐలాండ్‌ వైపునకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, బాధితురాలు తాను వారి వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ గుర్తుపెట్టుకొని పోలీసులకు చెప్పింది. దాని ప్రకారం పోలీసులు విచారించగా ఆ వాహనం వేరేదిగా తెలిసింది. దీంతో బహుశా బాధితురాలు ఆ వాహనం నెంబర్‌లో ఏదో ఒకటి మర్చిపోయి ఉండొచ్చని భావించిన పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఓ నలుగురు వ్యక్తులు తాము ఉపయోగించిన వాహనానికి తప్పుడు నంబర్‌ ప్లేట్‌ అమర్చి ఈ పనిచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును వారు చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement