Top Stories
ప్రధాన వార్తలు

రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ ఏంటి?.. సంచలనంగా ద్రౌపది ముర్ము ప్రశ్నలు!
ఢిల్లీ: ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో, రాష్ట్ర బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించడంపై తాజాగా ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) స్పందించారు.ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు పశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 గవర్నర్ అధికారాలను, బిల్లులకు ఆమోదం తెలపడం లేదా నిలిపివేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడం వంటి విధానాలను వివరిస్తుందని రాష్ట్రపతి హైలైట్ చేశారు. అయితే, ఈ రాజ్యాంగ ఎంపికలను ఉపయోగించుకోవడానికి గవర్నర్‌కు ఎలాంటి గడువును ఆర్టికల్ 200లో పేర్కొనలేదని అన్నారు.సుప్రీంకోర్టును అడిగిన ప్రశ్నలివే..రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు నిర్దేశిస్తాయా?.రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలేంటి?.రాజ్యాంగంలోని 361వ అధికరణం, 200వ అధికరణం కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షపై పూర్తి నిషేధం విధిస్తుందా?రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ వినియోగం న్యాయ సమ్మతమైనదా?రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు?.సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?.ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?.రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు సలహాను పొందడానికి లేదా గవర్నర్, రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా ఇతర విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరమా? అని ప్రశ్నించారు. Big showdown brews between Rashtrapati Bhavan & Supreme CourtPresident Droupadi Murmu invokes Article 143, seeking clarity on SC's ruling that set deadlines for Tamil Nadu Governor RN Ravi to act on bills—without Centre's nod. CJI Gavai to form a Constitution BenchKey… pic.twitter.com/1DShRAn21P— Nabila Jamal (@nabilajamal_) May 15, 2025సుప్రీంకోర్టు తీర్పు ఇదే..తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్.ఎన్.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి!. ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. తమిళనాడుకు చెందిన 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది. తీర్పు పూర్తి మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్ వర్సిటీ, వైస్ చాన్స్లర్ల బిల్లులు తదితరాలున్నాయి.రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్ ఆమోదం పొందాలి. గవర్నర్ దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది.దీనిపై కోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా గవర్నర్ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది.

లిక్కర్ మాఫియా డాన్ 'చంద్రబాబే'
సాక్షి, అమరావతి: దొంగే.. ‘దొంగా...దొంగా!’ అని అరుస్తున్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు!! మద్యం విధానం ముసుగులో కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఆయన తన దోపిడీని కప్పిపుచ్చేందుకు అక్రమ కేసు కుట్రకు తెరతీశారు. మద్యం కుంభకోణంలో గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి తన పన్నాగానికి పదును పెడుతున్నారు. టీడీపీ వీర విధేయులతో నియమించిన సిట్ ద్వారా కుతంత్రానికి పాల్పడుతున్నారు. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలో అంతర్భాగాలుగా మారుతున్నాయి. గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో దాఖలు చేసిన కేసును ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొట్టివేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ అవే అవాస్తవ ఆరోపణలతో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం రెడ్‌బుక్ కుతంత్రమేనన్నది స్పష్టమవుతోంది. అసలు మద్యం మాఫియా డాన్ చంద్రబాబే అని నిరూపించే వాస్తవాలు ఇవిగో ఇలా ఉన్నాయి... సూత్రధారి, లబ్ధిదారు బాబే... రూ.25 వేల కోట్ల లూటీపై ఆధారాలతో సీఐడీ కేసు 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్ ద్వారా చంద్రబాబు యథేచ్చగా దోపిడీకి గేట్లు తెరిచారు. మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్ రూమ్‌లు, 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులుగా పారించారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, డీకే ఆదికేశవులు, ఎస్పీవై రెడ్డి కుటుంబాలకు చెందిన 14 కొత్త డిస్టిలరీలకు అనుమతినిచ్చారు. మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేశారు. అంతేకాదు తమ అస్మదీయులకు చెందిన నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేశారు. చీప్ లిక్కర్లో బ్రాండ్లకు ఎలాంటి వాల్యూ లేదని ఊరూపేరూలేని దాదాపు 200 మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్, లెజెండ్, టీఐ మాన్షన్ హౌస్, హై ఓల్టేజ్ వంటివి వాటిలో కొన్ని. వీటిని గతంలో సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. మంత్రిమండలికి కూడా తెలియకుండా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ చీకటి జీవోలు జారీ చేసిన నోట్ ఫైళ్లపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర సంతకాలు చేసిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. టీడీపీ హయాంలో మద్యం దోపిడీకి పాల్పడ్డారని రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ సైతం స్పష్టం చేసింది. చంద్రబాబు మద్యం దోపిడీని సీఐడీ ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులపై సీఐడీ 2023లో ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇక స్కిల్ స్కామ్‌లో అరెస్టై 52 రోజులు రిమాండ్‌లో ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం, ఇసుక దోపిడీ కుంభకోణం కేసుల్లో కూడా చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసుల దర్యాప్తును అటకెక్కించింది. చంద్రబాబుపై మద్యం దోపిడీ కేసుతోపాటు ఇతర కేసులు న్యాయస్థానం విచారణలోనే ఉన్నాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 నుంచి మళ్లీ ప్రైవేటు మద్యం సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరచింది. యథేచ్చగా అదే దోపిడీ సాగిస్తోంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే... 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెట్టిన 43 వేల బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. రాష్ట్రంలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు ఇక కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? ఇక మద్యం విధానానికి సంబంధించి ఏ ఒక్క ఫైలుపై కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకాలు చేయలేదు. ఆ వ్యవహారాలన్నీ బెవరేజెస్ కార్పొరేషనే సమర్థంగా పర్యవేక్షించింది. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో అధికారులు, సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసు కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. 2014–19 మధ్య మద్యం విధానం ముసుగులో తాను చేసిన కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రస్తుతం చంద్రబాబు ఈ అక్రమ కేసు కుట్రకు తెరతీశారన్నది సుస్పష్టం.విక్రయాలు పెంచిందెవరు? మద్యం అమ్మకాలు పెరిగిన కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. గతంలో చంద్రబాబు హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు ప్రతి ఏటా భారీగా పెరగ్గా... అనంతరం వైఎస్ జగన్ హయాంలో 2019–24లో అమ్మకాలు ప్రతి ఏటా గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది చంద్రబాబు సర్కారుకేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విధానం తేల్చిచెప్పిన కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన అభియోగాలనే గతంలో టీడీపీ దు్రష్పచారం చేసింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ద్వందంగా తిరస్కరించడం గమనార్హం. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ సీసీఐకి 2021లో ఫిర్యాదు చేయించింది. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. దీనిపై విచారించిన సీసీఐ 2022 సెపె్టంబరు 19న విస్పష్టమైన తీర్పు ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని.. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. సీసీఐ తిరస్కరించిన ఆరోపణలతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది స్పష్టమవుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.

పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
దేశంలో బంగారం ధరలు (Gold Prices) భారీగా పడిపోయాయి. వరుసగా రెండో రోజూ గణనీయ తగ్గుదలను నమోదుచేశాయి. అమెరికా, చైనా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రభావంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు పతయ్యాయి. దీంతో బంగారం తులం ధర నేడు (మే 15) రూ.వేలల్లో క్షీణించింది. మే 15 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.93,930🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.86,100హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.2130, రూ.1950 చొప్పున పతనమయ్యాయి. 👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే.. చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.93,930🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.86,100చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.2130, రూ.1950 చొప్పున పతనమయ్యాయి. ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.94,080🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.86,250ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.2130, రూ.1950 చొప్పున పతనమయ్యాయి. ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.93,930🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.86,100ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.2130, రూ.1950 చొప్పున పతనమయ్యాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.93,930🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.86,100బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.2130, రూ.1950 చొప్పున పతనమయ్యాయి. వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు తగ్గుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీ మీద రూ.1000 మేర తగ్గి రూ.1,08,000 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలో రూ.900 తగ్గి రూ. 97,000 వద్దకు దిగివచ్చింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

తెలంగాణ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. పక్కా ప్లాన్ ప్రకారమే చేశారంటూ..
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలిలో భూముల్లో చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలి. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందే. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు అంటూ హెచ్చరించింది.తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ఈరోజు మరోసారి విచారణ చేపట్టారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి?. పక్కా ప్రణాళికతోనే వారాంతంలో చెట్లు నరికారు. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారు. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు ఉంటాయి. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దు.. వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి.. కంచె గచ్చిబౌలిలో పనులన్నీ నిలిపి వేశామని వెల్లడించారు. పర్యావరణం కాపాడుతూనే ఐటీ ప్రాజెక్టులు చేస్తామని చెప్పారు. రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని సింఘ్వీ కోరారు.అనంతరం, విద్యార్థుల అరెస్టు అంశాన్ని ఈ కేసులో చేర్చవద్దని తెలిపింది. విద్యార్థుల అరెస్టు అంశంపై మరొక పిటిషన్‌తో రావాలని సూచించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. తాము ఈ కేసులో పర్యావరణ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.

IPL 2025 Resumption: బట్లర్ స్థానంలో బెయిర్‌స్టో.. హాజిల్‌వుడ్ స్థానంలో నవీన్ ఉల్ హాక్..?
వారం వాయిదా అనంతరం ఐపీఎల్ 2025 మే 17 నుండి పునఃప్రారంభం కానుంది. భారత ఆటగాళ్లంతా లీగ్ తదుపరి లెగ్ కోసం రెడీగా ఉండగా.. విదేశీ ఆటగాళ్ల పూర్తి లభ్యత ఇంకా డైలమాలో ఉంది. జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటంతో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్ల స్థానాల్లో తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఐపీఎల్ గవర్నింగ్ బాడి అనుమతిచ్చింది.బట్లర్ స్థానంలో బెయిర్‌స్టో..?ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో ముందువరుసలో ఉన్న గుజరాత్ జోస్ బట్లర్ సేవలను లీగ్ దశ వరకే పొందగలుగుతుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే తేదీల్లో విండీస్‌తో వన్డే సిరీస్ షెడ్యూలై ఉండటంతో బట్లర్ ఆ మ్యాచ్‌లు ఆడేందుకు స్వదేశానికి వెళ్లిపోతాడు. అతని ప్రత్యామ్నాయ ఆటగాడిగా గుజరాత్ యాజమాన్యం జానీ బెయిర్‌స్టో పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని బెయిర్‌స్టోకు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్లో బెయిర్‌స్టో 50 ఇన్నింగ్స్‌ల్లో 144.45 స్ట్రయిక్‌రేట్‌తో 1589 పరుగులు చేశాడు. బెయిర్‌స్టో కూడా బట్లర్ లాగే వికెట్ కమ్ బ్యాటర్. బెయిర్‌స్టోకు బట్లర్లాగే మూడో స్థానంలో ఆడిన అనుభవం ఉంది. బెయిర్‌స్టో బట్లర్ లాగే సంయమనంతో బ్యాటింగ్ చేయడంతో పాటు మెరుపులు మెరిపించగలడు. కాబట్టి గుజరాత్ యాజమాన్యం బట్లర్‌కు సరైన ప్రత్యామ్నాయంగా బెయిర్‌స్టోను భావించవచ్చు.హాజిల్‌వుడ్ స్థానంలో నవీన్..?ప్రస్తుత సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న మరో జట్టు ఆర్సీబీ. ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన హాజిల్‌వుడ్ డబ్ల్యూటీసీ ఫైనల్ కారణంగా ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. అతని స్థానాన్ని ఆర్సీబీ ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హాక్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని నవీన్ ఐపీఎల్లో 18 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు తీశాడు. గత రెండు సీజన్లలో (2023, 2024) లక్నో తరఫున అద్బుతంగా రాణించిన నవీన్.. ప్లే ఆఫ్స్‌లో తమకు ఉపయోగపడగలడని ఆర్సీబీ భావించవచ్చు. నవీన్ పేరును విరాట్ కోహ్లి సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో నవీన్, విరాట్ మధ్య చిన్నపాటి యుద్దం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయినా విరాట్ నవీన్ పేరును సిఫార్సు చేయడం ఆశ్చర్యంగా ఉంది.

HYD: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పది మంది
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్‌లోని స్క్రాప్ గోదాం(ప్లాస్టిక్ గోడౌన్)లో మంటలు ఎగిసిపడి మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పది మంది మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోందివివరాల ప్రకారం.. పాతబస్తీలో గురువారం ఉదయం ప్లాస్టిక్ గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అనంతరం, పక్కనే ఉన్న మూడు అంతస్తు భవనంలోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది ఆరుగురిని రక్షించారు. అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన వారిలో చిన్నారి కూడా ఉంది. దీంతో, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.అయితే, మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోడౌన్, రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. ఇక, మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం. ప్లాస్టిక్ సమాన్లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

RAPO 22: ఆంధ్రాకింగ్ తాలుకా.. టికెట్ ఇవ్వాల్సిందే..
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం ‘RAPO 22’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానుల్లో సందడి రేపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. నేడు (మే 15) రామ్ బర్త్‌డేను పురస్కరించుకుని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Taluka) అనే టైటిల్‌ను ఆకర్షణీయమైన గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.ఈ గ్లింప్స్ ఒక కిక్కిరిసిన థియేటర్ వెలుపల అభిమానుల కోలాహలంతో ప్రారంభమవుతుంది. అక్కడ ‘ఆంధ్ర కింగ్’ సూర్య కుమార్ (ఉపేంద్ర) కొత్త సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎమ్మోర్వో నుంచి ఎమ్మెల్యే వరకు వీఐపీ రిఫరెన్స్‌లతో టికెట్లు తీసుకోవడంతో విసిగిపోయిన థియేటర్ యజమాని వద్దకు రామ్ సైకిల్‌పై స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అభిమానిగా చెప్పగానే యజమాని టికెట్లను అందజేస్తాడు. వాటిని తీసుకున్న రామ్ తోటి అభిమానులతో సంబరాలు చేసుకుంటాడు. అనంతరం సూర్య కుమార్ భారీ కటౌట్‌పై పూల వర్షం కురిపిస్తూ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అని అరవడంతో టైటిల్ కార్డ్ పడుతుంది.పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సాగర్ పాత్రలో, భాగ్యశ్రీ బోర్సే మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.మరోవైపు, సోషల్ మీడియాలో రామ్ పోతినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు #HappyBirthdayRAPO హ్యాష్‌ట్యాగ్‌తో ఈ టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2, 2025న విడుదల కానుందని సమాచారం.

పురుషులూ మేలుకోండి..హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!
ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్లో జరిగిన సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. ఇద్దరు మహిళలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో వింత ఏముంటుంది.. ఇవి ఈ మధ్యకాలంలో కామనే కదా అనుకుంటున్నారా? అయితే మీరీ అసాధారణ సంగతి గురించి తెలుసుకోవాల్సిందే.బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరు ఈ పెళ్లికి చెప్పిన కారణం ఏంటో తెలుసా? వారికి పురుషులంటే ఇష్టం లేదుట. డేటింగ్లు, డేటింగ్ యాప్ మెసాలు, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న నమ్మకద్రోహాలతో విసిగిపోయారట. ఎందుకంటే బదౌన్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు భర్తలు తమ కులాన్ని, మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ మోసాన్ని భర్తించలేక ఇద్దరూ తమ భర్తల్ని వదిలేశారు. ఇక పురుషులతో కలిసి జీవించేందుకు ఇష్టం లేకపోవడం వల్లనే పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నట్లు మహిళల జంట తెలిపింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీ యాంశమైంది.ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కలిసిన ఈ జంట, తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇద్దరూ ఫేస్బుక్లో ఇద్దరు వ్యక్తులను ప్రేమించి, మోసపోయారు. సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా వారి వైఖరి ఉండటంతో చాలా బాధపడ్డారు. పైగా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ అనుభవమే వారిద్దరిని దగ్గరి చేసింది. డిల్లీలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరూ స్నేహితులయ్యారు. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ బాధలను, బాధలను పంచుకోవడం ప్రారంభించారు. వారిద్దరూ తమ కథలను ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు, వారి ఇద్దరి అనుభవాలు ఒకేలా ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు. మూడు నెలలుగా మంచి స్నేహితులుగా ఉంటున్న వీరు ఇక జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించు కున్నారు. దీనికి సంబంధించికి న్యాయపరమైన మద్దతు కోరుతూ న్యాయవాదిని కూడా సంప్రదించారు. సమాజంలో భార్యాభర్తలుగా జీవించడానికి అవకాశాలపై ఆరాతీశారు. అయితే, భారతీయ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని న్యాయవాది దివాకర్ తేల్చి చెప్పారు. అయినా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్న యువతులు కోర్టు ఆవరణలోని శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.స్వలింగ వివాహాన్ని న్యాయస్థానం అంగీకరించదని తెలుసు. చట్టం అనుమతి లేకపోయినప్పటికీ, భార్యాభర్తలు తమ జీవితాన్ని కొనసాగిస్తామని వధూవరులు మీరా, స్వప్న(పేర్లు మార్పు) వెల్లడించారు. ముందుగా మా కుటుంబ సభ్యులకు చెబుతాము, వారు అంగీకరించకపోతే ఢిల్లీలో ఇల్లు కట్టుకుంటాం. జీవితంలో సంతోషకరమైన రోజులు గడపడానికే నిర్ణయం తీసుకున్నా మన్నారు.“మా పురుషులు మమ్మల్ని మోసం చేశారు, ఇకపై వారిని విశ్వసించలేము కాబట్టి మేము ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాము” అని సప్నా ప్రకటించింది. వధువు మీరా, వరుడు సప్న న్యాయవాదుల బృందం పర్యవేక్షణలో చట్టబద్ధంగా, స్థానిక హనుమాన్ ఆలయ పూజారి వారిద్దరికీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఏపీలో దంచికొట్టిన వాన.. HYDలో మరో రెండు గంటలు అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తర.. దక్షిణ ధ్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, నిన్న శ్రీకాకుళం జిల్లాల్లో 5.3 సెంమీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాప్తాడు, కందుకూరు, ఆకుతోటపల్లి వద్ద కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఉత్తర.. దక్షిణ ధ్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల( మే 14 నుంచి) పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించి తెలిసిందే.. తెలంగాణ లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. రోజంతా ఎండ మండిపోతున్నప్పటికీ.. సాయంత్రం అయ్యేసరికి వర్షం దంచికొడుతోంది.. ఈ క్రమంలో గురువారం ( మే 15 ) కూడా వర్షాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. #HyderabadRains Update : 8:10AMMODERATE-HEAVY Rains Expected In Many Parts Of The Hyderabad City In Next 2-3 Hours Already Rains Happening SouthWest Hyderabad Soon It Will Cover Central And East HyderabadPlan Your Work Accordingly pic.twitter.com/hnKXH19aDo— Hyderabad Weather (@JawadWeatherman) May 15, 2025గురువారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది.. అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, దిల్సుఖ్ నగర్, కోఠి, యూసఫ్ గూడా, కూకట్పల్లి, అల్వాల్, సుచిత్ర, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.. ఉదయం 9 గంటల సమయానికి వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ఉదయం అంతా ఆఫీసుకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. వర్షం కురిసే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. #15MAY 8AMScattered -Intense Rains Continues... in South &West #Hyderabad ⛈️Rain to Continue in Various Parts of the City during the Next 1Hr...PLAN ACCORDINGLY!!#Hyderabadrains pic.twitter.com/9fGOmFBtxL— Hyderabad Rains (@Hyderabadrains) May 15, 2025ఇదిలా ఉండగా.. తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోను ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లు పూర్తిగా నీటమునిగాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.@balaji25_t In Vikarabad District 🌧️🌧️ pic.twitter.com/d0ICc9N8Sb— M Sai Kumar Reddy (@saidarling888) May 15, 2025 HyderabadRains ALERT 3 ⚠️⛈️ The POWERFUL STORMS which formed in North, West HYD is now further spreading into East, Core HYD also now. It's going to be ON AND OFF strong rains, thunderstorms in MOST PARTS OF THE CITY till 9AM. Plan your morning travel accordingly— Telangana Weatherman (@balaji25_t) May 15, 2025

రిమాండ్ నివేదిక సాక్షిగా.. బాబు భేతాళ కుట్రే...!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్ ద్వారా సాగిస్తున్న కుతంత్రం న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు, ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగుచూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాలు, అభూత కల్పనలతో రూపొందించిన నివేదికలనే సిట్ తన రిమాండ్ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ అక్రమ కేసులో సిట్ తాజాగా అరెస్టు చేసిన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. కర్ణాటకలో మంగళవారం అరెస్టు చేసిన ఆయన్ను సిట్ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్ చేస్తూ ఈ కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అరెస్టు అక్రమమని, చట్ట విరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణలో అరెస్టుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని ప్రకటించింది.బాలాజీ గోవిందప్పతో సిట్ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమరి్పంచిన మెమోలో పేర్కొన్న భాగం గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్‌చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని.. ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండటం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని ట్యాంపర్ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలన్నది సిట్ లక్ష్యమన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది. ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే... అంతకుముందే తెల్లవారు జామునే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. సిట్‌లో సభ్యుడుకాని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. సిట్ పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది.అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలా..!ఆ నివేదిక కుట్రే... ఇదిగో సాక్ష్యం...ఇక నిందితుల అరెస్టు, విచారణతో నిమిత్తం లేకుండానే టీడీపీ కార్యాలయంలోనే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు కారణాలను వెల్లడిస్తూ... నిందితుడు పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్ నివేదికలో కృష్ణమోహన్‌రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు..? అంటే నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులోనే రిమాండ్ నివేదికలు రూపొందించి.. వాటిని కాపీ, పేస్ట్ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది.ఎవరినైనా ఇరికిస్తాం..!బాలాజీ గోవిందప్ప వైఎస్ జగన్ దగ్గర పనిచేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు. కానీ ఆయన వైఎస్ జగన్ సంస్థల్లో పని చేయట్లేదు. 12 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో మెజార్టీ వాటాను వికాట్ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్ మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రలకు పాల్పడ్డారని రిపోర్టులో రాశారు. ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్ అక్కౌంటెంట్ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సలపని పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్‌టైమ్ ఫైనాన్స్ డైరెక్టర్‌నే ఇలా టార్గెట్ చేసి అక్రమ కేసులో, జరగని కుంభకోణంలో ఇరికించారంటే.. ఇక దేశంలో ఎవరినైనా కేసుల్లో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కారు పంపింది. దీన్నిబట్టి భేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి.
RAPO 22: ఆంధ్రాకింగ్ తాలుకా.. టికెట్ ఇవ్వాల్సిందే..
కుటుంబం కోసం భార్య జాబ్.. కర్రతో తలపై కొట్టి, చున్నీ బిగించి..
Ration Card: రేషన్ కార్డులు ఎక్కడ .. జారీ ఎప్పుడు..!
ఆంధ్రా రుచుల పండుగ..ఆ టేస్టే వేరేలెవల్..!
IPL 2025 Resumption: బట్లర్ స్థానంలో బెయిర్‌స్టో.. హాజిల్‌వుడ్ స్థానంలో నవీన్ ఉల్ హాక్..?
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ ఏంటి?.. సంచలనంగా ద్రౌపది ముర్ము ప్రశ్నలు!
నిద్ర.. గురక.. గుండెపోటు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
మహిళలు తప్పక చదవాల్సిన పుస్తకం..!
ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
ఇదే రీతిలో ‘సూపర్ సిక్స్ హామీలను’ అడిగే ప్రజలకు ‘ట్యాక్స్’ అని చెప్పి నోరెత్తకుండా చేద్దాం సార్!
ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
కర్నూలులో కాలుష్య కాసారం
"చివరికి ప్రకృతి కూడా కరుణించింది! 'సూపర్ సిక్స్' చలని కబురు ఎప్పుడు వింటామో..ఏమో! "
విజయ్‌కు 105 సీట్లు?
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
RAPO 22: ఆంధ్రాకింగ్ తాలుకా.. టికెట్ ఇవ్వాల్సిందే..
కుటుంబం కోసం భార్య జాబ్.. కర్రతో తలపై కొట్టి, చున్నీ బిగించి..
Ration Card: రేషన్ కార్డులు ఎక్కడ .. జారీ ఎప్పుడు..!
ఆంధ్రా రుచుల పండుగ..ఆ టేస్టే వేరేలెవల్..!
IPL 2025 Resumption: బట్లర్ స్థానంలో బెయిర్‌స్టో.. హాజిల్‌వుడ్ స్థానంలో నవీన్ ఉల్ హాక్..?
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ ఏంటి?.. సంచలనంగా ద్రౌపది ముర్ము ప్రశ్నలు!
నిద్ర.. గురక.. గుండెపోటు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
మహిళలు తప్పక చదవాల్సిన పుస్తకం..!
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
ఇదే రీతిలో ‘సూపర్ సిక్స్ హామీలను’ అడిగే ప్రజలకు ‘ట్యాక్స్’ అని చెప్పి నోరెత్తకుండా చేద్దాం సార్!
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
కర్నూలులో కాలుష్య కాసారం
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
"చివరికి ప్రకృతి కూడా కరుణించింది! 'సూపర్ సిక్స్' చలని కబురు ఎప్పుడు వింటామో..ఏమో! "
విజయ్‌కు 105 సీట్లు?
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ గ్లోబ్ ముందు నిలబడి యుద్ధాన్ని నేనే ఆపా అని పెద్దగా అరుస్తున్నారు డాక్టర్!
గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు!
ఐపీఎల్లో నాకిష్టమైన జట్టు ఇదే: మీనాక్షీ
సినిమా

నటుడు సంతానంకు నోటీసులు
తమిళ నటుడు సంతానంకు తిరుపతికి చెందిన ఓ బీజేపీ నేత నోటీసులు పంపారు. సంతానం కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్’ నిహారిక ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, ఆర్యకు చెందిన షో పీపుల్ సంస్థ కలిసి నిర్మించిన చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈచిత్రంలో శ్రీ వేంకటేశ్వరభక్తి గీతాలు శ్రీనివాస గోవిందా అనే పాటను పొందుపరిచారు. ఈ పాటలో నటుడు సంతానం నటించారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీవేంకటేశ్వరస్వామి భక్తి గీతాన్ని డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ చిత్రంలో పొందుపరిచి భక్తుల మనోభావాలను గాయపరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా తిరుమల, తిరుపతి పోలీస్స్టేషన్లలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సంతానంపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గానికి చెందిన ఓ బీజేపీ నేత దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ చిత్ర విడుదలను నిషేధించాలని, ఆ చిత్రంలో భక్తి గీతాన్ని తొలగించాలని, ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్ చానళ్ల ద్వారా భక్తుల్లోకి వెళ్లి వారి మనోభావాలను గాయపరిచినందుకుగాను నష్టపరిహారం చెల్లించాలని సంతానానికి, నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టెయిన్మెంట్కు నోటీసులు పంపారు. నోటీసులపై 15 రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

కాన్స్ హంగామా మొదలు
కాన్స్ చలన చిత్రోత్సవాల కాంతులు ఫ్రాన్స్‌లో వెలిగిపోతున్నాయి. 78వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్‌లో ఈ నెల 13నప్రారంభమై, 24 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ మేకర్ క్వెంటిన్ టరంటినో ఈ 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ వేడుకనుప్రారంభించి, ఆయన మైక్‌ను వెంటనే కిందపడవేయడం వీక్షకులను సర్ప్రైజ్ చేసింది. ఎందుకిలా చేశారనే చర్చ జరుగుతోంది. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతదేశాని కిప్రాతినిధ్యం వహిస్తూ, ఈ ఏడాది జ్యూరీలో ఓ సభ్యురాలిగా ఇండియన్ ఫిల్మ్ మేకర్పాయల్ కపాడియా ఈ వేడుకకు హాజరయ్యారు. కాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక ‘పామ్ డి ఓర్’ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ అమెరికన్ నటుడు, దర్శకుడు రాబర్ట్ డి నీరో అందుకున్నారు. అమెరికన్ నటుడు లియోనార్డో డికాప్రియో చేతుల మీదుగా రాబర్ట్ డి నీరో ‘పామ్ డి ఓర్’ అవార్డును స్వీకరించారు. అలాగే విదేశాల్లో చిత్రీకరణ జరుపుకునే చిత్రాలను అమెరికాలో ప్రదర్శించాలనుకుంటే వంద శాతం టారీఫ్‌ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనను రాబర్ట్ డి నీరో తన అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో తప్పుబట్టారు. దీంతో అమెరికాలో సినిమాలపై వంద శాతం టారీఫ్ విధానం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చర్చనీయాంశమైంది. ముంబై ఫిల్మ్ మేకర్పాయల్ కపాడియా జ్యూరీ మెంబర్‌గా ఉండటం పట్ల రాబర్ట్ డి నీరో హర్షం వ్యక్తం చేశారు. అలాగే జూన్‌లో వందేళ్లు పూర్తి చేసుకోనున్న చార్లీ చాప్లిన్ ‘ది గోల్డ్ రష్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇక ఈసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేవారి వస్త్రధారణపై జ్యూరీ ప్రత్యేక నియమ నిబంధనలను విధించింది. ఇండియన్ డిజైనర్ గౌరవ్ సిద్ధం చేసిన ఓ ప్రత్యేక కాస్ట్యూమ్‌ను కాన్స్ ప్రస్తుత రూల్స్ వల్ల తాను ధరించలేకపోయాయని అమెరికన్ నటి హాలీ బెర్రీ పేర్కొన్నారు. కాన్స్‌లో భారతీయం: సత్యజిత్ రే దర్శకత్వంలోని ప్రముఖ బెంగాలీ ఫిల్మ్ ‘అరణ్యేర్ దిన్ రాత్రి’, అనుపమ్ ఖేర్ డైరెక్షన్‌లోని తాజా చిత్రం ‘తన్వి: ది గ్రేట్’, హైదరాబాద్ ఫిల్మ్‌మేకర్ నీరజ్ దర్శకత్వం వహించిన ‘హోమ్ బౌండ్’ (జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ లీడ్ యాక్టర్స్‌గా చేశారు), చరక్, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టి్టట్యూట్ నిర్మాణంలోని ‘ఏ డాల్ మేడప్ ఆఫ్ క్లే’ చిత్రాలు కాన్స్‌లో ప్రదర్శితం కానున్నాయి. దీంతో ఈ సినిమాలకు చెందిన కొందరు నటీనటులు, దర్శక–నిర్మాతలు ఈ చిత్రోత్సవాలకు హాజరు కానున్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్స్’ విభాగంలో అవార్డు కోసం ‘హోమ్‌బౌండ్’ చిత్రం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోపాల్గొననున్నట్లుగా ఆలియా భట్ ఓ సందర్భంగా చెప్పారు. అయితే భారత్–పాక్ యుద్ధం నేపథ్యంలో ఆమె ఈ ఫెస్టివల్‌కు హాజరు కాకూడదనుకున్నారట. ఇంకా దాదాపు పది రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి ఆలియా మనసు మారొచ్చేమో. ఇక కాన్స్ అంటే ఐశ్వర్యా రాయ్ ఉండా ల్సిందే. ఈసారి ఆమెతోపాటు ఇంకొందరు భారతీయ తారలు కాన్స్ చిత్రోత్సవాల్లో మెరవనున్నారు. ఊహూ... ఉర్ఫీకి చేదు అనుభవం బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్‌కి చేదు అనుభవం ఎదురైంది. ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025’లో తొలిసారిపాల్గొనే అవకాశం అందుకున్నారామె. హ్యాపీగా వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఊహూ... అంటూ వీసాని తిరస్కరించడంతో ఉర్ఫీ నిరుత్సాహపడ్డారు. కానీ తిరస్కరణలు తనకు కొత్తేం కాదంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారామె. ‘‘కాన్స్‌లో కొన్ని వైవిధ్యమైన దుస్తుల్లో కనిపించాలని ΄్లాన్ చేసుకున్నాను. కానీ, విధిరాత వల్ల నా వీసా తిరస్కరణకు గురైంది. నా జీవితంలో వ్యాపారంలో ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. జీవితంలో ఎన్నో తిరస్కరణల తర్వాత కూడా నేను ఎక్కడా ఆగిపోలేదు. నాలాగా మీలో చాలామంది తిరస్కరణకు గురై ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటే... షేర్ చేసుకుని, అందరికీ ఆదర్శంగా నిలవాలి’’ అని పోస్ట్ చేశారు ఉర్ఫీ జావేద్.అప్పుడు మొసలి.. ఇప్పుడు చిలుక!కాన్స్ చిత్రోత్సవాల ఎర్ర తివాచీ పై రంగురంగుల గౌనులో సందడి చేశారు నటి ఊర్వశీ రౌతేలా. కొందరు నెటిజన్స్ మాత్రం ఆమె లుక్‌పై విమర్శలు చేస్తున్నారు. 2018లో జరిగిన కాన్స్ చిత్రోత్సవాల్లోపాల్గొన్న ఐశ్వర్యా రాయ్ ఇలాంటి మల్టీ కలర్ గౌను ధరించారని, ఆమె లుక్‌ని ఊర్వశి కాపీ కొట్టారనీ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఆమె మేకప్ ఎక్కువైందని, హెయిర్ స్టైల్ బాగోలేదని విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఊర్వశీ రౌతేలా చేతిలో ఉన్న చిలుక ఆకారం ఉన్న క్లచ్ (పర్సు) అందర్నీ ఆకట్టుకుంది. చిలుక ఆకారంలో క్రిస్టల్స్ ΄÷దిగిన ఈ క్లచ్ ధర సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని టాక్. కాగా 2023లో జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోపాల్గొన్న ఊర్వశీ రౌతేలా ధరించిన మొసలి ఆకారంలోని నెక్లెస్ అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. కోట్ల రూపాయలు విలువ చేసే ఆ నెక్లెస్ అంత బాగా లేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా మేకప్, హెయిర్ స్టైల్ విషయంలో విమర్శలు ఎదురయ్యాయి. అయితే ‘΄్యారెట్ క్లచ్’ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆర్ఆర్ఆర్-2 చేస్తారా?.. రాజమౌళి సమాధానమిదే.. వీడియో వైరల్!
ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్‌లో సందడి చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అక్కడే ఉన్నారు. తాజాగా లండన్‌లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మూవీ ప్రదర్శనతో పాటు ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్ఆర్ఆర్ ఫరెవర్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.మే 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా కనిపించారు. నాటు నాటు సాంగ్ ప్లే అవుతుండగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత రాజమౌళిని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ఆట పట్టించారు. ముగ్గురు కలిసి నవ్వుతూ సందడి చేశారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఉన్నారు.ఈ సందర్భంగా ఉపాసన ఆర్ఆర్ఆర్-2 చేస్తారా? అంటూ రాజమౌళిని అడిగింది. దీనికి రాజమౌళి అవును అని సమాధానమిచ్చారు. ఉపాసన వెంటనే 'గాడ్ బ్లెస్ యూ' అంటూ వారిని దీవించింది. ఈ సరదా వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ ఈవెంట్లో ఆస్కార్ స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. దాదాపు మూడేళ్ల తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదటిసారి వేదికపై తిరిగి కలిశారు.ఇక సినిమాల విషయానికొస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. ఈ సినిమా జూన్ 25, 2026న విడుదల కానుంది. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)

'ఇలియానాను ఎందుకు తీసుకోలేదంటే'.. రైడ్-2 డైరెక్టర్ క్లారిటీ!
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఇటీవలే రైడ్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో అజయ్ దేవగణ్ సరసన వాణి కపూర్ హీరోయిన్గా నటించింది. 2018లో వచ్చిన రైడ్ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే పార్ట్-1లో హీరోయిన్గా ఇలియానా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైడ్-2లో ఇలియానాను ఎంపిక చేయకపోవడంపై డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా స్పందించారు. ఇలియానాను కాదని.. వాణి కపూర్‌ను ఎందుకు ఎంపిక చేశారన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఆమె జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. తాను ప్రస్తుతం ఓ బిడ్డతో పాటు మంచి కుటుంబం కలిగి ఉంది.. అంతేకాకుండా విదేశాలకు వెళ్లిపోయిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్లే హీరోయిన్ను మార్చాల్సి వచ్చిందని రాజ్ కుమార్ గుప్తా వెల్లడించారు.కానీ ఇలియానాతో రైడ్ మూవీలో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపాకు. ఆమె ఎల్లప్పుడూ రైడ్ ప్రపంచంలో భాగమేనని రాజ్ కుమార్ గుప్తా అన్నారు. రైడ్- 2లో వాణి కపూర్ నటించడంపై ఎలాంటి వ్యతిరేకత లేదని దర్శకుడు పేర్కొన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే నటీనటుల మార్పులు తప్పనిసరని ఆయన వివరించారు. అంతకుముందు రైడ్ -2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఇలియానా స్థానంలో నటించే అంశాన్ని ప్రస్తావించగా.. మా మధ్య ఎటువంటి పోటీ లేదని వాణి కపూర్ స్పష్టం చేశారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

IPL 2025 Resumption: ఆ ఇంగ్లిష్ ప్లేయర్లు వస్తారు కానీ..!
వాయిదా అనంతరం జరుగబోయే ఐపీఎల్ 2025లో పాల్గొనాల్సి ఉన్న ఇంగ్లండ్ ప్లేయర్లపై సందిగ్దత వీడింది. జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జేకబ్ బేతెల్ (ఆర్సీబీ), లియామ్ లివింగ్‌స్టోన్ (ఆర్సీబీ) ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వస్తారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు (ఈసీబీ) చెందిన ఓ కీలక అధికారి స్పష్టం చేశారు. అయితే వీరిలో వెస్టిండీస్ సిరీస్‌కు (ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో జరిగే సిరీస్) ఎంపికైన బట్లర్, బేతెల్, జాక్స్ లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యే వరకే సంబంధిత ఫ్రాంచైజీలతో ఉంటారని, ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని తేల్చేశారు.మరోవైపు జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్), జేమీ ఓవర్టన్ (సీఎస్కే), సామ్ కర్రన్ (సీఎస్కే) ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు తిరిగి రారని కూడా స్పష్టం చేశారు. మరో ఇద్దరు ఇంగ్లిష్ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్ (ఆర్సీబీ), మొయిన్ అలీపై (కేకేఆర్) క్లారిటీ లేదని అన్నారు.సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్కు సంబంధించి వారి ఫ్రాంచైజీ (సీఎస్కే) ఇదివరకు ఈ విషయాన్ని స్పష్టం చేయగా.. రాజస్థాన్ కూడా ఆర్చర్ అందుబాటులోకి రాడన్న విషయాన్ని లైట్‌గా తీసుకుంది. ఈ రెండు ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కర్రన్, ఓవర్టన్, ఆర్చర్‌కు తాత్కాలిక రీప్లేస్మెంట్ల కోసం కూడా ఆయా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది.కాగా, ఐపీఎల్ ప్లే ఆఫ్స్ జరిగే తేదీల్లో (మే 29, జూన్ 1, 3) ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. హ్యారీ బ్రూక్ తొలిసారి నాయకత్వం వహిస్తున్న ఇంగ్లిష్ జట్టులో ఐపీఎల్ స్టార్లు బట్లర్, ఆర్చర్, ఓవర్టన్, విల్ జాక్స్, జేకబ్ బేతెల్‌కు చోటు దక్కింది.ఇదిలా ఉంటే, భారత్-పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సిన ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు తిరిగి భారత్‌కు రానున్నారు. మే 8న రద్దైన ఐపీఎల్.. మే 17న పునఃప్రారంభం కానుంది. లీగ్ దశ మ్యాచ్‌లు మే 27న ముగియనుండగా.. మే 29 (తొలి క్వాలిఫయర్), మే 30 (ఎలిమినేటర్), జూన్ 1 (రెండో క్వాలిఫయర్) తేదీలోల ప్లే ఆఫ్స్ జరుగనున్నాయి. జూన్ 3న ఫైనల్ జరుగనుంది.

పోలాండ్ ఈవెంట్‌కు నీరజ్
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పోలాండ్ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి చోప్రా ఈ నెల 24న ‘ఎన్సీ క్లాసిక్’ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. కానీ భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల పలు విమానాశ్రయాల మూసివేతతో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలనుకున్న ఎన్సీ క్లాసిక్ ఈవెంట్ నిరవధికంగా వాయిదా పడింది. ఇపుడు ఇదే సమయంలో పోలాండ్‌లో జరిగే ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగుతాడు. ఈ నెల 23న అక్కడ ‘ఒర్లిన్ జానుస్జ్ కుసొసిన్సికి మెమోరియల్ ఈవెంట్’ జరుగనుంది. ఈ ఈవెంట్లో పలువురు అంతర్జాతీయ మేటి జావెలిన్ త్రోయర్లు పాల్గొంటారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), జులియన్ వెబెర్ (జర్మనీ), పోలాండ్ జాతీయ రికార్డు నెలకొల్పిన మార్సిన్ క్రుకొవ్‌స్కీ తదితరులు పాల్గొంటారు. ఈ సీజన్లో దక్షిణాఫ్రికా ఈవెంట్‌తో ఈ సీజన్‌కు శ్రీకారం చుట్టిన చోప్రా ఈ నెల 16న దోహా డైమండ్ లీగ్‌లో పాల్గొనాల్సి ఉంది.

గడుల ఆట... కొత్త బాట!
ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు మారబోతున్నాయి. దీంతో గడుల్లో వేసే ఎత్తులు, పైఎత్తులు కొత్త ఫార్మాట్లో జరగనున్నాయి. అయితే ఈ తరహా ఫార్మాట్ ఇప్పుడైతే ఖతర్‌లో జరిగే టోర్నీలో నిర్వహిస్తారు. ఆ తర్వాత కొనసాగుతుందో లేదో టోర్నీ జరిగిన విధానం, ఆసక్తిగొలిపిన వైనాన్ని బట్టి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తుది నిర్ణయం తీసుకుంటుంది. మొత్తానికి ఇన్నాళ్లు జరిగిన ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలది ఒక లెక్కయితే... దోహాలో జరగబోయేది మాత్రం కొత్త లెక్క! ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ మాత్రం మారలేదు. తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగనుంది. టూకీగా... ఇదీ టోర్నీ కహానీ! ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్–బ్లిట్జ్ టోర్నీకి దోహా (ఖతర్) ఆతిథ్య వేదిక కాగా... డిసెంబర్ 26 నుంచి 31 వరకు ఆరు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 10 లక్షల యూరోలు (భారత కరెన్సీలో రూ. 9.58 కోట్లు). ఓపెన్ కేటగిరీ విజేతలకు ర్యాపిడ్, బ్లిట్జ్ (3.5 లక్షల యూరోల చొప్పున) 7 లక్షల యూరోలు (రూ. 6.7 కోట్లు), మహిళల విభాగం విజేతలకు 3 లక్షల యూరోలు (రూ.2.87 కోట్లు). ర్యాపిడ్, బ్లిట్జ్లకు లక్షన్నర యూరోల చొప్పున కేటాయించారు. బ్లిట్జ్ ఫార్మాట్ మార్పులివి... ఈ ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీల్లో నాకౌట్ దశను మరింత క్రమబద్దీకరించారు. అంటే గతంలో ఎనిమిది మందితో మొదలయ్యే క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశ స్థానంలో ఇప్పుడు నలుగురు మాత్రమే పాల్గొనే సెమీఫైనల్‌ను తీసుకొచ్చారు. ఈ టోర్నీల తొలిదశ స్విస్ లీగ్ పద్ధతి నుంచి నేరుగా సెమీఫైనల్స్ పోటీలే జరుగుతాయి. మధ్య ఎనిమిది మంది బరిలో ఉండే క్వార్టర్ ఫైనల్స్ ఉండవిక! ఈ మార్పుతో ఒరిగేదేంటి? ‘ఫిడే’ అధికారుల వివరణ ప్రకారం కొత్త బ్లిట్జ్ ఫార్మాట్లో స్విస్ లీగ్ పద్ధతి నుంచి నాకౌట్ చేరే వరకు ప్రతీ మ్యాచ్ ఆసక్తికరంగా, పోటాపోటీగా జరిగే అవకాశముంటుంది. స్విస్ లీగ్ దశలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఇందులో నిలకడైన ప్రదర్శన కనబరిచిన వారే చివరకు నాకౌట్ దశ (సెమీస్)కు అర్హత సాధిస్తారు. అంటే ఒకరితో ఒక ఎత్తు పొరపాటుతో ఓడిన మ్యాచ్, మరొకరు ఒక పైఎత్తుతో గెలిచిన మ్యాచ్‌ల వల్ల నాకౌట్ అవకాశాలు కోల్పోరు. ఎందుకంటే విరివిగా ఉండే లీగ్ మ్యాచ్‌ల వల్ల ఒక పొరపాటును అధిగమించి మరో మ్యాచ్‌లో గెలిచే అవకాశాలుంటాయి. బ్లిట్జ్‌లో 19 రౌండ్లు ఓపెన్ కేటగిరీలో బ్లిట్జ్ చాంపియన్‌షిప్ 19 రౌండ్ల పాటు జరుగుతుంది. మహిళల విభాగంలో 15 రౌండ్ల పాటు నిర్వహిస్తారు. అనంతరం నలుగురు చొప్పున సెమీఫైనల్‌కు చేరతారు. ఇక్కడి నుంచి గెలిచిన ఇద్దరి మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని, నియమనిబంధనల్ని ఫిడే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. యథాతథంగానే ర్యాపిడ్ ఈవెంట్ బ్లిట్జ్ పోరు మారింది. కానీ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌ను ఫిడే మార్చలేదు. ఓపెన్ కేటగిరీలో 13 రౌండ్లు, మహిళల విభాగంలో 11 రౌండ్ల మ్యాచ్‌లు జరుగుతాయి. అగ్రస్థానంలో నిలిచిన వారే విజేతగా ఆవిర్భవిస్తారు. ఒకవేళ టాప్‌లో పాయింట్లు సమంగా ఉంటే మాత్రం విజేతను తేల్చడానికి ప్లేఆఫ్ పోటీని నిర్వహిస్తారు. గత ఏడాది న్యూయార్క్ వేదికగా ప్రపంచ ర్యాపిడ్, చెస్ చాంపియన్‌షిప్ జరిగింది. ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్‌లో విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల ముర్జిన్... మహిళల విభాగంలో భారత స్టార్ కోనేరు హంపి విజేతలుగా నిలిచారు. బ్లిట్జ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో ఇయాన్ నిపోమ్‌నిషి (రష్యా), కార్ల్సన్ (నార్వే) సంయుక్త విజేతలుగా నిలువగా... మహిళల విభాగంలో చైనాకు చెందిన జు వెన్జున్ టైటిల్ సాధించింది.

సినెర్ ముందంజ
రోమ్: నిషేధం గడువు పూర్తయ్యాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో ప్రపంచ పురుషుల టెన్నిస్ నంబర్‌వన్ యానిక్ సినెర్ జోరు కొనసాగిస్తున్నాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 18వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో సెరున్‌డోలో (అర్జెంటీనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సినెర్ 7–6 (7/2), 6–3తో విజయం సాధించాడు. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ రెండు ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఏడుసార్లు నెట్ వద్దకు దూసుకొచి్చన సినెర్ నాలుగుసార్లు పాయింట్లు గెలిచాడు. సెరున్‌డోలో 14 సార్లు నెట్ వద్దకు వచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు సొంతం చేసుకున్నాడు. 17 విన్నర్స్ కొట్టిన సినెర్ 30 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు సెరున్‌డోలో 29 విన్నర్స్ కొట్టి ఏకంగా 53 అనవసర తప్పిదాలు చేశాడు. 91 సర్వీస్ పాయింట్లలో సినెర్ 51 పాయింట్లు... 86 సర్విస్ పాయింట్లలో సెరున్‌డోలో 47 పాయింట్లు సాధించారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)తో సినెర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో సినెర్ 3–0తో రూడ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్ జాక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–4, 6–4తో విజయం సాధించాడు. సెమీస్‌లో కోకో గాఫ్ రోమ్ ఓపెన్ మహిళల టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్, అమెరికా స్టార్ కోకో గాఫ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ మీరా ఆంద్రియెవా (రష్యా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 6–4, 7–6 (7/5)తో గెలుపొందింది. ఒక గంట 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కోకో గాఫ్ తన సర్విస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.
బిజినెస్

టాటా కంపెనీల దూకుడు.. ఎగసిన లాభాలు
ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 25 శాతం ఎగసి రూ. 1,306 కోట్లను అధిగమించింది. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక బిజినెస్‌ల పటిష్ట పనితీరు ఇందుకు తోడ్పాటునిచ్చాయి.అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 1,046 కోట్ల లాభం మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 16,464 కోట్ల నుంచి రూ. 17,447 కోట్లకు బలపడింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2.25 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. జులై 7న చెల్లించనుంది.కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 4,280 కోట్ల నుంచి రూ. 4,775 కోట్లకు పుంజుకుంది. మొత్తం ఆదాయం రూ. 63,272 కోట్ల నుంచి రూ. 66,992 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 2 శాతం లాభంతో రూ. 397 వద్ద ముగిసింది.టాటా క్యాపిటల్ లాభం హైజంప్త్వరలో ఐపీవోకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్న టాటా క్యాపిటల్ మార్చి త్రైమాసికానికి రూ.1,000 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.765 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం ఇదే కాలంలో 50 శాతం వృద్ధితో రూ.7,478 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4,998 కోట్లుగా ఉంది.2024–25 ఆర్థిక సంవత్సరంలో టాటా క్యాపిటల్ లాభం రూ.3,665 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2023–24) లాభం రూ.3,327 కోట్లతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. ఆదాయం రూ.18,715 కోట్ల నుంచి రూ.28,313 కోట్లకు చేరుకుంది. గత నెలలో టాటా క్యాపిటల్ సెబీ వద్ద ఐపీవో పత్రాలను దాఖలు చేయడం తెలిసిందే.2 బిలియన్ డాలర్ల నిధులను (రూ.17వేల కోట్లు) సమీకరించాలనుకుంటోంది. సెబీ ఆమోదం లభిస్తే అతిపెద్ద ఐపీవోల్లో ఒకటి కానుంది. టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌కు 92.83 శాతం వాటా ఉంది. అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ నుంచి టాటా క్యాపిటల్ గుర్తింపు కలిగి ఉంది.

‘గోగో’ ఈవీను విడుదల చేసిన బజాజ్ ఆటో
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో ‘గోగో’ను విడుదల చేసింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బజాజ్ ఆటో లిమిటెడ్ ఇంట్రాసిటీ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు సమర్దీప్ సుబంధ్ , వినాయక బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి బాబుల్ రెడ్డి కలిసి గోగోను ఆవిష్కరించారు.బజాజ్ గోగోను P5009, P5012, P7012 మూడు వేరియంట్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది.వేరియంట్‌ను అనుసరించి గోగోలో 9.2 కిలోవాట్ నుంచి 12.1 కిలోవాట్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 251 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది.ఇది నాలుగు గంటలలోపు 80% ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ఈసారి 7,000 మంది బలి?గోగోలో మల్టిపుల్ డ్రైవ్ మోడ్లు ఉన్నాయి. ఎకో, పవర్, క్లైంబ్, పార్క్ అసిస్ట్ వంటి మోడ్లున్నట్లు కంపెనీ తెలిపింది. విభిన్న డ్రైవింగ్ అవసరాలకు వీటిని వినియోగించవచ్చని పేర్కొంది.డ్రైవర్ సౌలభ్యం కోసం డిజిటల్ డిస్ ప్లే, యూఎస్బీ ఛార్జింగ్, స్టోరేజ్ స్పేస్ ఉంటుందని చెప్పింది.రేడియల్ ట్యూబ్ లెస్ టైర్లు, హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో వివిధ రోడ్డు పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది.

రూ. 11140 కోట్ల షేర్ అమ్మేస్తున్న రిలయన్స్
ముంబై: దేశీ పెయింట్స్ దిగ్గజం ఏషియన్ పెయింట్స్‌లో తనకున్న 4.9 శాతం వాటాలను విక్రయించడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ వాటా విలువ దాదాపు రూ. 11,140 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఏకమొత్తంగా ఒకేసారి లేదా పలు డీల్స్ ద్వారానైనా ఈ లావాదేవీని నిర్వహించేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్‌ఏ)ను నియమించుకున్నట్లు సమాచారం.అయితే, ప్రస్తుత మార్కెట్ ధర కంటే డిస్కౌంట్‌కే ఆఫర్లు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పుడో 17 ఏళ్ల క్రితం 2008 జనవరిలో రిలయన్స్ ఈ వాటాలను రూ. 500 కోట్లతో కొనుగోలు చేసింది. దానితో పోలిస్తే ప్రస్తుత ధర ప్రకారం దాదాపు 24 రెట్లు లాభాన్ని కంపెనీ అందుకోనుంది.పెయింట్స్ పరిశ్రమలో పోటీ తీవ్రం కావడంతో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరం 59 శాతం నుంచి 52 శాతానికి తగ్గింది. అలాగే గత ఏడాది వ్యవధిలో షేరు విలువ సుమారు 19 శాతం పైగా క్షీణించింది. దేశీయంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఏషియన్ పెయింట్స్ అంతర్జాతీయంగా 8వ స్థానంలో ఉంది. 15 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

హోల్‌సేల్ ధరలూ తగ్గాయ్..
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, ఇంధనం మొదలైన వాటి ధరలు నెమ్మదించడంతో ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం తగ్గింది. టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) 13 నెలల కనిష్టమైన 0.85 శాతానికి పరిమితమైంది. గతేడాది మార్చిలో 0.26 శాతంగా నమోదైన తర్వాత డబ్ల్యూపీఐ ఇంత తక్కువ స్థాయికి దిగి రావడం ఇదే ప్రథమం. ఇది తాజా మార్చిలో 2.05 శాతంగా, గతేడాది ఏప్రిల్‌లో 1.19 శాతంగా నమోదైంది.డేటా ప్రకారం ఆహార ఉత్పత్తుల ధరలు 0.86 శాతం, కూరగాయల రేట్లు 18.26 శాతం స్థాయిలో క్షీణించడంతో ప్రతిద్రవ్యోల్బణం నమోదైంది. సీక్వెన్షియల్‌గా విమాన ఇంధనం, కిరోసిన్ మొదలైన వాటి ధరలు తగ్గడంతో ఇంధనాలు.. విద్యుత్ రేట్లు 2.18 శాతం క్షీణించాయి. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.62 శాతంగా నమోదైంది.సానుకూల బేస్ ఎఫెక్ట్ కారణంగా రాబోయే నెలల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని బార్క్లేస్ ఒక నివేదికలో తెలిపింది. రుతుపవనాలు ముందే తాకడం, వర్షపాతం సాధారణ స్థాయికన్నా ఎక్కువగానే ఉండొచ్చనే అంచనాలు పంట దిగుబడులకు, ఆహార ద్రవ్యోల్బణానికి సానుకూలాంశాలని ఇక్రా సీనియర్ ఎకనమిస్ట్ రాహుల్ అగ్రవాల్ తెలిపారు.
ఫ్యామిలీ

International Family Day అద్భుత విజయాల పవర్ హౌస్
ఫ్యామిలీ అంటే...జీవితం మొదలయ్యే చోటు. ప్రేమ ఎప్పటికీ అంతం కాని చోటు. ‘భారతదేశ బలం కుటుంబం’ అంటారు. అయితే కాలంతో పాటు కుటుంబ ముఖచిత్రం మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు కనిపించడం అరుదైపోయింది. కుటుంబం అసాధారణమైన బలం ఇస్తుంది. అద్భుత విజయాలు సాధించేలా చేస్తుంది. ఈ స్పృహతో ముందుకు వెళదాం... ఆ విషాదంలో ఒకరికి ఒకరు అండగా... ‘ఫ్యామిలీ నా స్ట్రెంత్’ అని తరచుగా చెబుతుంటుంది బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. శ్రీదేవి చనిపోవడం జాన్వీ కుటుంబానికి షాక్. ఆ విషాదం నుంచి బయట పడడానికి కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు అండగా నిలిచారు. జాన్వీ ఎప్పుడైనా డల్‌గా కనిపిస్తే నాన్న బోనీ కపూర్ ఆ సమయంలో అమ్మగా మారిపోతాడు. తన కబుర్లతో జాన్వీ యాక్టివ్ అయ్యేలా చేస్తాడు. మరి బోనీ డల్‌గా కనిపిస్తే? కూతుళ్లు జాన్వీ, ఖుషీ తండ్రి దగ్గరకు వచ్చేస్తారు. నాన్నకు ఫ్రెండ్స్‌గా మారిపోతారు. నాన్న ఎప్పటిలాగే నవ్వేలా చేస్తారు. ఆ ముగ్గురిలో ఏ మూలో విషాదం గూడుకట్టుకొని ఉండవచ్చు. అయితే వారు ఒక దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సరదాలు, సంతోషాలే ఉంటాయి. కొన్ని సమయాల్లో చెల్లి ఖుషి అక్క జాన్వీకి అమ్మ అవుతుంది. ధైర్యం చెబుతుంది. దారి చూపుతుంది! ఖుషి విషయంలో జాన్వీ కూడా అంతే! తల్లి లేని లోటు రానివ్వకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటుంది. ‘నాన్న, చెల్లి, అన్న అర్జున్ నాకు మెంటార్స్. నా జీవితానికి మార్గదర్శకులు. కెరీర్లో, జీవనగమనంలో వారు నా బలం’ అని తన కుటుంబం గురించి చెబుతుంది జాన్వీ కపూర్.పెద్ద కుటుంబం... మను బాకర్ బలం తన స్ట్రెంత్‌కు కేరాఫ్ అడ్రస్ చెప్పమంటే స్టార్ షూటర్ మను బాకర్ నోటి నుంచి వచ్చే మాట... గోరియా.హరియాణా రాష్ట్రం చర్కీ దాద్రి జిల్లాలోని గోరియా గ్రామంలో బాకర్ కుటుంబ సభ్యులు ఉంటారు. మను పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆ కుటుంబ సంతోషం అంబరాన్ని అంటుతుంది. పోటీలకు వెళ్లి స్వదేశానికి తిరిగివస్తున్నప్పుడు... కుటుంబ సభ్యులను కలవబోతున్నానే సంతోషం మనూను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆమె తండ్రి రామ్ కిషన్ బాకర్ నేవీలో చీఫ్ ఇంజనీర్. తల్లీ సుమేధ స్కూల్ ప్రిన్సిపల్. ఆటల్లో కూతురుని ఎంతో ప్రోత్సహించేవారు. అవసరమైన ట్రైనింగ్ ఇచ్చేవారు. ‘మీ అమ్మాయిని డాక్టర్ చేస్తారా? ఇంజనీర్ చేస్తారా?’ అని బంధువులు అడిగినప్పుడు.... ‘ఛాయిస్ మాది కాదు... మనూ దే’ అనే వాళ్లు.ఇదీ చదవండి: దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకేఅలా తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే మను బాకర్ స్టార్ షూటర్ అయింది. మను బాకర్‌కు ఊళ్లో మరో పెద్ద కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరు యూనివర్శల్ హైయర్ సెకండరీ స్కూల్. మను కుటుంబమే ఈ స్కూల్‌ను నడుపుతుంది. ఈ స్కూల్లోని పిల్లలందరికీ మను బాకర్ అక్క. దయా కౌర్ తనకు అమ్మమ్మ కాదు... క్లోజ్ ఫ్రెండ్! ‘సంతోషంలో ఉన్నప్పుడైనా, బాధలో ఉన్నప్పుడైనా ఈ సమయంలో నా ఫ్యామిలీ నాతో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అదే ఫ్యామిలీకి ఉన్న బలం’ అంటుంది మను బాకర్.పిల్లలకు కుటుంబ విలువ తెలియజేసే పుస్తకాలుకుటుంబ బంధాలు, శక్తి గురించి పిల్లలకు సులభమైనరీతిలో అవగాహన కలిగించడానికి ‘సెర్చ్ ఇనిస్టిట్యూట్’ సంస్థ ‘ఫస్ట్ లుక్’ భాగస్వామ్యంతో కొన్ని పుస్తకాలు విడుదల చేసింది... ‘ఫ్యామిలీ స్ట్రెంత్’ను పిల్లలకు తెలియజేయడానికి టాడ్ పార్ రాసి, బొమ్మలు వేసిన పుస్తకం...ది ఫ్యామిలీ బుక్. ‘హ్యాపీ లైక్ సాసర్: ఇన్వెస్ట్’ పుస్తకాన్ని మారిబెత్ బోయిల్డ్స్ రాశారు. లారెన్ కాస్టిలో బొమ్మలు వేశారు. అవర్ ట్రీ నేమ్డ్ స్టీవ్(ఫ్యామిలీ స్ట్రెంత్: బీ డిపెండబుల్) పుస్తకాన్ని అలాన్ జ్వైబెల్ రాశారు. డేవిడ్ కాట్రో బొమ్మలు వేశారు. సాల్ట్ ఇన్ హిజ్ షూస్(ఫ్యామిలీ స్ట్రెంత్: గైడ్) పుస్తకాన్ని మైఖేల్ జోర్డన్ రాశారు. నెల్సన్ బొమ్మలు వేశారు. అమేజింగ్ గ్రేస్(ఫ్యామిలీ స్ట్రెంత్: ఇన్స్పైర్) పుస్తకాన్ని మేరీ హఫ్మాన్ రాశారు. కరోలైన్ బించ్ బొమ్మలు వేశారు. (పురుషులూ మేలుకోండి.. హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!)ఫ్యామిలీ మైండ్‌సెట్ కోచ్!‘ఫ్యామిలీ డైనమిక్స్‌లో సమగ్రమైన, సమర్థమైన మార్పులు తేవడమే మా లక్ష్యం’ అంటున్నారు ఫ్మామిలీ మైండ్‌సెట్ కోచ్‌లు. ఫ్యామిలీ మైండ్‌సెట్ కోచింగ్ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? అనే విషయానికి వస్తే...కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి వ్యక్తిగత, గ్రూప్ సెషన్లు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల మధ్ భేదాభిప్రాయాలు ఉంటే గ్రూప్ సెషన్లలో ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా లేకుండా చేస్తారు. ‘సైకోమెట్రిక్ అసెస్మెంట్’ప్రోగ్రాం ద్వారా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరి బలాబలాలను అంచనా వేసి అవసరమైన సలహాలు ఇస్తారు.

దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకే
పహల్గామ్ ఉగ్రదాడి అనేక కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపిండి. తాజాగా BSF కానిస్టేబుల్ రాంబాబు సింగ్ అసువులు బాశాడు. మే 9, 2025న ఇండో-పాక్ సరిహద్దులో తన ధైర్య సైనికుల సోదరులతో కలిసి పోరాడుతున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్లో ప్రత్యర్థుల కాల్పులకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతను మే 13న తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయింది.నాలుగు నెలల క్రితం వివాహంబోర్డర్ సెక్యూరిటీ దళానికి చెందిన రాంబాబు సింగ్ బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందినవాడు. ఏప్రిల్ 22న జరిగినపహల్గామ్ దాడి, 26 మంది అమాయకుల చనిపోయిన తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పోరాడుతూ అమరుడైనాడు. రాంబాబు మృతదేహాన్ని మే 14, 2025న అతని గ్రామం వాసిల్పూర్కు తీసుకువచ్చారు. గ్రామస్తులందరూ అమరసైనికుడికి కన్నీటి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు , జిల్లా అధికారుల అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా వీర జవాన్‌కు నివాళులర్పించారు.#WATCH | Siwan, Bihar | Mortal remains of BSF Jawan Rambabu Singh, who lost his life in the line of duty due to cross-border shelling from Pakistan, brought to his native village in Siwan. pic.twitter.com/iShgQ0J1Dh— ANI (@ANI) May 14, 2025 #WATCH | Patna, Bihar | Mortal remains of BSF Jawan Rambabu Singh, who lost his life in the line of duty due to cross-border shelling from Pakistan, brought to Patna.RJD leader Tejashwi Yadav pays tribute to him. pic.twitter.com/RBGOMOUNF2— ANI (@ANI) May 14, 2025ఆపరేషన్ సిందూర్లోరాంబాబు సింగ్ ముందు వరుసలో నిలబడి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. చిన్నప్పటినుంచీ దేశానికి సేవ చేయాలనేకోరికతో సైనికుడిగా బాధ్యతల్లో చేరాడు. ఆ జవాన్ నాలుగు నెలల క్రితం (2025, ఫిబ్రవరి) వివాహమైంది. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతానికి బదిలీ అయ్యాడు. దేశంకోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరుడి మరణ వార్త రాంబాబు సింగ్ గ్రామం మొత్తాన్ని దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. తన భర్త మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందిని, కానీ చాలా గర్వంగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవలే రాంబాబు తండ్రి మరణించారు. ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?రాంబాబు సింగ్ త్యాగాన్ని దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది అంటూ జవాను మరణంపైబీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమరవీరుడి బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.చదవండి: లగ్గం..షరతుల పగ్గం! పెళ్లికాని ప్రసాదుల కష్టాలు ఇంతింత కాదయా!పహల్గామ్ దాడి , 'ఆపరేషన్ సిందూర్'జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసరన్‌లో అమాయక పౌరులపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతిస్పందనగా, మే 7, 2025 తెల్లవారుజామున రక్షణ మంత్రిత్వ శాఖ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసింది.

డయాబెటిస్‌ని చిటికెలో నయం చేసే గుడి.. ఎక్కడుందంటే?
భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా. మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్తో బాధపడుతున్నారు. అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే మాయమై పోతుందట. అందుకోసం నిత్యం వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇంతకీ అది ఏ దేవుడు ఆలయం?. ఎక్కడ కొలువై ఉంది?..ఇదంతా నిజమేనా..? వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం..!.తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నీడమంగళం సమీపంలోని కోవిల్ వెన్ని అనే గ్రామంలో ఉంది. తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి 26 కి.మీ. మీ. అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది. చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అనిపిలుస్తారు. ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వరర్‌గా, పార్వతి దేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు. ఇది స్వయంభూ దేవాలయం. ఈ శివుడు చూడటానికి చెరకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు. ఒకప్పుడూ ఈ ప్రదేశం చెరకు (కరుంబు), వెన్ని(నందివర్ధనం చెట్టు) చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంభేశ్వరర్ అని పిలుస్తారు.మధుమేహం ఎలా నయం అవుతుందంటే..ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయం కొలువై ఉన్న శివలింగం దాదాపు ఐదు వేల ఏళ్లనాటి పురాతనమైన లింగం. దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. నిజమేనా అంటే..?ఈ ఆలయానికి కేవలం భారతదేశం నుంచే గాక, విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడకి వచ్చి ఈ స్వామిని దర్శించుకుని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారని కథలు కథలుగా చెబుతుంటారు. అది నిజమేనా కాదా అని పరీక్షించి మరీ తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరు భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అది నిజమని నిరూపితమవ్వడంతో ఇదేలా జరుగుతుందని విస్తుపోతున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆలయాన్ని దర్శించి..మధుమేహం వ్యాధి నుంచి బయటపడండి.గమనిక: ఇది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం. దానినే మేము ఇక్కడ వార్తగా ఇచ్చాము. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం (చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర)

TSRTC city bus : అత్యంత రద్దీగా బస్సులు...అసలు కారణాలివీ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగింది. ఫ్యూచర్‌సిటీ ఇప్పటి నుంచే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ అతి పెద్ద గ్లోబల్‌సిటీగా అవతరించనుందని ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ ఈ విస్తరణకు తగినవిధంగా ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధిపైన మాత్రం దృష్టి సారించడం లేదు. మెట్రో రెండో దశకు డీపీఆర్‌లు సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఆ ప్రాజెక్టు ఊగిసలాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఔటర్‌ను దాటుకొని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తున్న కాలనీలు, జనావాసాల దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల ప్రకారం హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ పదేళ్లుగా కొత్త బస్సులు రోడ్డెక్కలేదు. కాలం చెల్లిన వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఏసీ కేటగిరీలకు చెందిన అద్దె బస్సులను ప్రవేశపెట్టడం మినహా ప్రజావసరాలకు అనుగుణంగా సిటీబస్సులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సులు ఇంచుమించు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ 60 శాతం బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 40 శాతం బస్సులు తగ్గాయి. బస్సుల కొరత క్రమంగా పెరుగుతోంది. ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?కొత్త బస్సులేవి..? నగరంలో ఒకవైపు సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరోవైపు సిటీబస్సుల వినియోగం కూడా పెరిగింది. మెట్రో రైళ్లు తిరిగే కారిడార్లలో మినహాయించి నగరం నలువైపులా ప్రయాణికులు బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రెండేళ్ల క్రితం సుమారు 16 లక్షల మంది ప్రయా ణం చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరినట్లు అంచనా. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించు 6 లక్షల మంది పెరిగారు. 2023 డిసెంబర్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తరువాత మెట్రోల్లో ప్రయాణం చేసే మహిళలు, సొంత వాహనాలను వినియోగించేవారు సైతం సిటీబస్సుల వైపు మళ్లారు. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. నగరంలోని 28 డిపోల పరిధిలో 2800 బస్సులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.శివారు ప్రాంతాలు, కాలనీలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. వందలాది ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం ఒకటి, రెండు ట్రిప్పుల చొప్పున మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్ సీటర్ ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొత్తగా కొన్ని బస్సులను ప్రవేశపెట్టినప్పటికీ కాలం చెల్లిన వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చినవే కానీ పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం అవసరాల మేరకు ప్రవేశపెట్టినవి కాదని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ఇల్లు అమ్ముకుని లక్షలు పంచుకున్నారు, అమ్మానాన్నలను గెంటేశారు! మెట్రో నగరాలతో పోటీ ఎక్కడ? ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులను కూడా గణనీయంగా పెంచారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తేలిగ్గా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 8,121 బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 2000 బస్సులను కొనుగోలుచేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ముంబయిలో ప్రస్తుతం 3,228 బస్సులు అందుబాటులో ఉన్నాయి.2027 నాటికి ఈ సంఖ్యను 8000 లకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. బెంగళూరులో 6,835 బస్సులు అందుబా టులో ఉన్నాయి. మరో 1000 బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్‌లో 2,800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 500 బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి.
ఫొటోలు
అంతర్జాతీయం

మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
ఇస్లామాబాద్: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలో తమ సైనిక సిబ్బందిలో కేవలం 11 మంది చనిపోయారని పాకిస్తాన్ మంగళవారం ప్రకటించింది. వీరిలో స్క్వాడ్రాన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ సైతం ఉన్నట్లు పేర్కొంది. భారత వైమానిక, క్షిపణి, డ్రోన్ దాడుల్లో సాయుధ బల గాలకు సంబంధించి 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.భారత్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మే ఆరో తేదీ అర్ధరాత్రి తర్వాత భారత్ జరిపిన దాడుల్లో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, 121 మంది పౌరులు గాయపడ్డారని తెలిపింది. చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ సైతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వీళ్లంతా ఏ పరిస్థితుల్లో మరణించారో, మరణానికి కారణాలను పాకిస్తాన్ బయటపెట్టలేదు. ఒక యుద్ధవిమానం పాక్షికంగా ధ్వంసమైందని తెలిపింది.అయితే అది ఏ సంస్థ తయారీ, ఏ రకానికి చెందినది అనే వివరాలనూ పాక్స్తాన్ వెల్లడించలేదు. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా ‘మర్కా–ఇ–హక్ (ఘన విజయం)’ లక్ష్యంగా ‘ఆపరేషన్ బుని యాన్ అల్ మర్సుస్’ను చేపట్టామని ఆ ప్రకటన తెలిపింది. గాయపడిన సైనికులు, పౌరులను పరామర్శించేందుకు సోమవారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ రావల్పిండిలోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిని సందర్శించడం తెల్సిందే. గాయపడిన సైనికాధికారులు, జవాన్లను ఓదార్చేందుకు లాహోర్‌లోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిని పంజాబ్ మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్ సందర్శించారు.

బద్దలైన బేస్‌లు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో కీలక మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోయాయని స్పష్టమైంది. తాజాగా విడుదలైన శాటిలైట్ ఉపగ్రహాల స్పష్టమైన ఫొటోలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా 11 మిలటరీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. వైమానిక స్థావరాల్లోని విమాన రన్వేలు, విమానాలను నిలిపి ఉంచే హ్యాంగర్లు ధ్వంసమైనట్లు ఈ శాటిలైట్ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఒక ప్రైవేట్ వాణిజ్య ఉపగ్రహ సంస్థ ఈ హై–రెజల్యూషన్ ఫొటోలను తీసింది. ఏమాత్రం అటూఇటూగా కాకుండా, గురిచూసి సరిగ్గా వాయుసేన స్థావరాల మీదనే బాంబులు పడేసినట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. భారత్‌పై మరింతగా దాడులకు తెగిస్తే ఆకాస్త స్థావరాలనూ పూర్తిగా నేలమట్టం చేస్తారనే భయంతోనే మూడ్రోజులకే పాకిస్తాన్ కాళ్లబేరానికి వచి్చందనే వాదనకు పూర్తి బలం చేకూర్చేలా ఫొటోలు ఉన్నాయి. మాక్సార్ అనే శాటిలైట్ సంస్థ తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు జాతీయమీడియాలో మంగళవారం ప్రత్యక్షమయ్యాయి. సింధ్‌లోని సిక్కూర్, రావర్పిండిలోని నూర్ ఖాన్, దక్షిణ పంజాబ్ ప్రావిన్స్‌లోని రహీం యార్ ఖాన్, సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సిం«ద్‌లోని జకోబాబాద్, ఉత్తర థటా జిల్లాలోని భోలారీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైన తీరు ఫొటోలో వివరంగా తెలుస్తోంది. దాడి తర్వాత కీలక మిలటరీ బేస్‌లలో రన్‌వేలపై భారీ గొయ్యి, కార్యనిర్వాహక భవనాలు, నిల్వ కేంద్రాల పైకప్పులకు పెద్ద రంధ్రాలు పడటం, భవంతుల గోడలు కూలి శిథిలాలు, శకలాలు సమీప ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిన వివరాలు ఫొటోల్లో తెలుస్తున్నాయి. పస్రూర్, సియాల్కోట్లోని రాడార్ కేంద్రాలు క్షిపణుల దెబ్బకు పేలిపోయాయి. సుక్కూ ర్ ఎయిర్‌బేస్‌లో రెండు విమాన షెల్టర్లు కూలిపోయాయి. చక్లాలాలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో భారీ సైనిక, సరకు రవాణా వాహనాలు రెండు బాగా దెబ్బతిన్నాయి. రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఒక్కటే రన్‌వే ఉంది.దానిపై బాంబులేయడంతో 19 అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. 43 అడుగుల పరిధిలో రన్‌వే పాక్షికంగా ధ్వంసమైంది. ముషాఫ్ ఎయిర్‌బేస్ రన్‌వేపై రెండు పేద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఒకటి 10, మరోటి 15 అడుగుల విస్తీర్ణంలో ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడి విమానాల రాకపోకలు ఆగిపోయాయి. సమీప రవాణా వాహనాలూ దెబ్బతిన్నా యి. జకోబాబాద్‌లోని షాబాజ్ ఎయిర్‌బేస్‌తోపాటు భోలారీ ఎయిర్‌బేస్‌లో చెరో విమాన హ్యాంగర్‌కు భారీ నష్టం జరిగింది. హ్యాంగర్‌లో నిలిపిఉంచిన విమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

బంగ్లా మాజీ అధ్యక్షుడు హమీద్ పరార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్(Mohammed Abdul Hamid)(81) ఎవరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా దేశం విడిచి వెళ్లిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానంలో గుర్తుతెలియని ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి నుంచి చక్రాల కురీ్చలో వెళ్లే సమయంలో ఆయన ఒంటిపై లుంగీ మాత్రమే ఉండడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.గత ఏడాది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను బలవంతంగా అణచివేసిన కేసులో మొహమ్మద్ అబ్దుల్ హమీద్‌పై దర్యాప్తు జరుగుతోంది. ఆయనపై హత్య కేసు సైతం నమోదైంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోవడం ప్రాధాన్యం సంచలనాత్మకంగా మారింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ వ్యవహారం పట్ల బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పారిపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల మండిపడింది. కొందరు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసింది.మరికొందరికి బదిలీ వేటు వేసింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ పరారీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సలహాదారు సి.ఆర్.అబ్రార్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. హమీద్ 2013 నుంచి 2023 మధ్యలో రెండుసార్లు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2024లో షేక్ హసీనాతోపాటు ఆమె అనుచరులపై నమోదైన హత్య కేసులో ఆయన సహ నిందితుడిగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 14న కిశోర్‌గంజ్ సదర్ పోలీసు స్టేషన్లో ఆయనపై హత్య కేసు నమోదైంది. వైద్యం కోసమేనా? కేవలం వైద్యం కోసమే హమీద్ థాయ్‌లాండ్ వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయనతోపాటు సోదరుడు, బావమరిది కూడా వెళ్లినట్లు తెలిపారు. అయితే, దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే దేశం నుంచి హమీద్ పరారైనట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పారీ్టలో హమీద్ చురుగ్గా వ్యవహరించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన ఛాత్రా లీగ్ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఛాత్రా లీగ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో మధ్యంతర ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఇంటిని ఇస్లామిక్ రాడికల్స్ కూల్చివేశారు.

కాశ్మీర్ అంశంపై మా విధానంలో మార్పు లేదు: విదేశాంగ శాఖ
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌కు భారత్ గట్టి గుణపాఠం చెప్పింది. పహల్గాం ఘటన తరువాత సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. భారత్ అమెరికా నాయకులు మాట్లాడారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి 'రంధీర్ జైస్వాల్' పేర్కొన్నారు.కాల్పుల విరమణకు కోసం పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంపై రెండు దేశాల DGMOల మధ్య అవగాహనా కుదిరింది. సింధూ నదీ జలాల రద్దు ఒప్పందం కొనసాగుతుంది. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.కాశ్మీర్ అంశంపై ద్వైపాక్షింగా చర్చిస్తాం. ఈ అంశంపై మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైన చర్చలు ఉంటాయి. టీఆర్ఎఫ్ లష్కరితోయోబా సంస్థ. దీనిపైన అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న ఏకైక పరిష్కారం కాని సమస్య.. అక్రమంగా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి ఇవ్వడం. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని విడిచిపెట్టడం అనేది పరిష్కారం కాని విషయం' అని జైస్వాల్ అన్నారు.
జాతీయం

సీజేఐగా జస్టిస్ గవాయ్
న్యూఢిల్లీ: భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ గవాయ్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సుప్రీంకోర్టుకు తొలి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత రెండో దళిత సీజేఐ. ప్రమాణస్వీకారం తర్వాత తల్లి కమల్ తాయ్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రాంగణంలో గాం«దీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. న్యాయవాదులు తదితరులు తనకు శుభాకాంక్షలు తెలపగా ‘జై భీమ్’ అంటూ నినదించారు. న్యాయవ్యవస్థలోని అత్యున్నత స్థానం నుంచి సామాజిక న్యాయం తాలూకు శక్తిమంతమైన ప్రకటనకు ఆ నినాదం ప్రతీక అని సుప్రీంకోర్టు బార్ పేర్కొంది. జస్టిస్ గవాయ్ ప్రమాణస్వీకార ఫొటోలను మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు జస్టిస్ గవాయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 64 ఏళ్ల జస్టిస్ గవాయ్ మహారాష్ట్ర నుంచి సీజేఐ పదవి చేపట్టిన ఆరో వ్యక్తి. మంగళవారం రిటైరైన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఆర్నెల్ల పాటు, అంటే నవంబర్ 23 దాకా విధులు నిర్వర్తిస్తారు. ప్రజా పక్షపాతి జస్టిస్ గవాయ్‌ది అతి సాధారణ కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థానానికి చేరిన అత్యంత స్ఫూర్తిదాయక నేపథ్యం. ఆయన 1960 నవంబర్ 24న మహారాష్ట్రలో అవరావతి జిల్లాలోని ఓ కుగ్రామంలో జని్మంచారు. ఆయన తండ్రి ఆర్ఎస్ గవాయ్ రాజకీయ నాయకుడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్)ని స్థాపించారు. జస్టిస్ గవాయ్ న్యాయప్రస్థానం 1985లో న్యాయవాదిగా మొదలైంది. నాగపూర్, అమరావతి కార్పొరేషన్ల స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 1993లో బాంబే హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, ఏడాదికి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, 2000లో నాగపూర్ బెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి, రెండేళ్లకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. చరిత్రాత్మక తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ 700కు పైగా ధర్మాసనాల్లో సభ్యునిగా, సారథిగా ఉన్నారు. 300కు పైగా తీర్పులు వెలువరించారు. రాజ్యాంగపరమైన అంశాలు, పౌర హక్కులకు సంబంధించిన పలు కీలక తీర్పులు వాటిలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ గవాయ్ నాయకత్వం వహించారు. కూల్చివేతలను తీవ్రంగా తప్పుబట్టడమే గాక వాటికి అడ్డుకట్ట వేస్తూ కఠిన నిబంధనలు రూపొందించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆరి్టకల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సబబేనని తీర్పు వెలువరించిన, పారీ్టలకు విరాళాలిచ్చే ఎన్నికల బాండ్లను రద్దు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాల్లో ఆయన సభ్యులు. పెద్ద నోట్ల రద్దు సబబేనని 4:1 మెజారిటీతో తీర్పు వెలువరించిన, ఎస్సీల్లో ఉప వర్గీకరణ చేసే అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిందంటూ 6:1తో తీర్పిచ్చిన రాజ్యాంగ ధర్మాసనాల్లో కూడా జస్టిస్ గవాయ్ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ నిబంధనను ప్రవేశపెట్టాలని ఈ కేసులో భాగంగానే తీర్పు వచ్చింది. మహిళల ఛాతీ పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచార యత్నం పరిధిలోకి రాబోవన్న అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలను జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టడమే గాక ఆ తీర్పుపై స్టే విధించింది. పలు రాజ్యాంగ, పర్యావరణ సంబంధ అంశాలపై కొలంబియా, హార్వర్డ్ తదితర ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీల్లో జస్టిస్ గవాయ్ ప్రసంగాలిచ్చారు. దేశవ్యాప్త సంచలనానికి కారణమైన వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసులను ఆయన ధర్మాసనమే విచారించాల్సి ఉంది.

పాకిస్తాన్ వైమానిక శక్తి...మూడోవంతు ఊడ్చుకుపోయింది!
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్‌కు అలా ఇలా తగల్లేదు. మన ప్రతి దాడుల దెబ్బకు దాయాది ఏకంగా మూడో వంతు వైమానిక శక్తిని కోల్పోయింది! ఆ నష్టాల తాలూకు పూర్తి వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. మన బ్రహ్మోస్ తదితర క్షిపణులు పాక్‌లోని 11 కీలక వైమానిక స్థావరాలపై విరుచుకుపడడం తెలిసిందే. వాటి ధాటికి అవి కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలతో పాటు రక్షణ నిపుణులు తేల్చారు. ‘‘పాక్ వైమానిక స్థావరాల్లోని కీలక వ్యవస్థలన్నీ భారీగా దెబ్బతిన్నాయి. పాక్ ఎంతోకాలంగా మిడిసిపడుతున్న ఎఫ్ 16, జేఎఫ్ 17 వంటి అత్యాధునిక అమెరికా, చైనా తయారీ యుద్ధ విమానాల్లో చాలావరకు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి’’ అని వెల్లడించారు. సైనిక ఆపరేషన్లలో స్వావలంబన ప్రస్థానంలో ఆపరేషన్ సిందూర్‌ను మైలురాయిగా రక్షణ శాఖ అభివర్ణించింది. భారత రక్షణ పాటవానికి, ఆ రంగంలో సాధించిన స్వావలంబనకు ప్రతీకగా నిలిచిందని పేర్కొంది. ‘‘సరిహద్దులు దాటకుండానే పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలతో పాటు ఆ దేశ నలుమూలల్లోని కీలక సైనిక, వైమానిక వ్యవస్థలను కూడా తుత్తునియలు చేసి చూపించాం. పాక్ మాత్రం సైనికపరంగా కేవలం విదేశీ సాయాన్నే నమ్ముకుంది. మనపై దాడులకు చైనా తయారీ పీఎల్–15, తుర్కియేకు చెందిన ‘యిహా’ డ్రోన్లు, యూఏవీలను వాడింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ద్వారా తిరుగులేని రుజువులను ప్రపంచానికి చూపించాం’’ అని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.ఐఏఎఫ్ చీఫ్‌దే కీలకపాత్ర పాక్ వైమానిక స్థావరాలపై మన దాడుల్లో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్సింగ్దే కీలక పాత్ర. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ దాడులు పూర్తిగా ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. ముఖ్యంగా అతి కీలకమైన రావల్పిండిలోని చక్లాలా (నూర్ ఖాన్) ఎయిర్‌బేస్‌పై దాడి ప్లానింగ్ పూర్తిగా ఆయనదే. ఆ దాడిలో పాల్గొన్న పైలట్ల ఎంపిక తదితరాలను కూడా సింగ్ స్వయంగా ఎంపిక చేశారు. శనివారం తెల్లవారుజామున చక్లాలాలో మూడు ప్రాంతాలపై మన క్షిపణులు విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించాయి. వాటి దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మూడు గంటలు బంకర్లో తలదాచుకోవడమే గాక తన నివాసాన్ని సురక్షిత ప్రాంతానికి మార్చేశారట!నేవీ త్రిముఖ వ్యూహం పాక్‌పై మన దాడుల సందర్భంగా నేవీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పాక్‌ను అష్టదిగ్బంధం చేసేసింది. అందులో భాగంగా పాక్‌కు జీవనాడి వంటి కరాచీ ఓడరేవుపై మన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక పూర్తిస్థాయిలో గురిపెట్టింది. ఏకంగా 36 నావికా దళాలను మోహరించింది. ఏడు డి్రస్టాయర్లు, ఐఎన్ఎస్ తుషిన్ వంటి యుద్ధనౌకలు వాటిలో ఉన్నాయి. అవన్నీ బ్రహ్మోస్, ఎంఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులను ఎక్కుపెట్టి ఏ క్షణమైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచాయి. అంతేగాక వరుణాస్త్ర వంటి అత్యాధునిక టార్పెడోలతో జలాంతర్గాములను కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా సన్నద్ధం చేసింది. దాంతో మరో దారిలేక పాక్ నేవీ కేవలం పోర్టుకే పరిమితం కావాల్సి వచ్చింది.నవాజ్ కనుసన్నల్లోనే...! భారత్‌పై పాక్ సైనిక చర్యలను పూర్తిగా ప్రధాని షహబాజ్ సోదరుడు నవాజ్ షరీఫే పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. మనపై దాడులన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగినట్టు సమాచారం. నవాజ్ మూడుసార్లు పాక్ ప్రధానిగా చేశారు. ప్రస్తుతం అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) సారథి. 1999లో ఆయన ప్రధానిగా ఉండగానే కార్గిల్ యుద్ధం జరిగింది. మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం, పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడం తెలిసిందే. ఆ మర్నాడు షహబాజ్ ఏర్పాటు చేసిన కీలక భేటీలో ప్రభుత్వపరంగా ఏ హోదా లేని నవాజ్ కూడా పాల్గొన్నారు.మా మద్దతు పాక్‌కే: తుర్కియే అంతర్జాతీయంగా ఛీత్కారాలు ఎదురవుతున్నా తుర్కియే బుద్ధి మాత్రం మారడం లేదు. అన్నివేళలా పాక్‌కే మద్దతుగా ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ బుధవారం కుండబద్దలు కొట్టారు. ‘‘పాక్ మా నిజమైన మిత్రదేశం. మా దేశాల సోదర భావం నిజమైన స్నేహానికి నిదర్శనం. పాక్–తుర్కియే దోస్తీ జిందాబాద్!’’ అని చెప్పుకొచ్చారు.

భార్గవాస్త్రం సిద్ధం
న్యూఢిల్లీ: ప్రత్యర్థి దేశాల డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలను తుత్తునియలు చేసే స్వదేశీ కౌంటర్–డ్రోన్ సిస్టమ్ ‘భార్గవాస్త్ర’ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల రూపంలో ఎదురవుతున్న ముప్పును సమర్థంగా తిప్పికొట్టడంలో గొప్ప ముందడుగు వేసింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్(ఎస్‌డీఏల్) అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల నిరోధక వ్యవస్థను ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ) అధికారుల సమక్షంలో మంగళవారం పరీక్షించారు. మొత్తం మూడు ట్రయల్స్ నిర్వహించగా, అన్నీ విజయవంతమయ్యాయి. ఎక్కడా గురి తప్పలేదు. ‘భార్గవాస్త్ర’లోని నాలుగు మైక్రో రాకెట్లు అన్ని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి. తొలుత రెండు రాకెట్లను వేర్వేరుగా ఫైర్ చేశారు. దాంతో రెండు ట్రయల్స్ పూర్తయ్యాయి. మూడో ట్రయల్‌లో భాగంగా.. మరో రెండు రాకెట్లను ఒకేసారి సాల్వో మోడ్‌లో కేవలం రెండు సెకండ్ల వ్యవధిలోనే పరీక్షించారు. నాలుగు రాకెట్ల పనితీరూ అద్భుతంగా ఉన్నట్లు తేలింది. అవి నిర్దేశిత లాంచ్ పారామీటర్లను సాధించాయి. భారీ డ్రోన్లతో దాడులు జరిగినప్పుడు వాటిని గురిపెట్టి కచ్చితంగా నేలకూల్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించిన కొన్ని రోజులకే భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది. → భార్గవాస్త్రలో మొదటి దశలో ఆన్‌గైడెడ్ మైక్రో రాకెట్లు ఉంటాయి. ఇవి శత్రుదేశాల డ్రోన్లను కూల్చివేస్తాయి. → ఇక రెండో దశలో గైడెడ్ మైక్రో మిస్సైల్ ఉంటుంది. ఇది పిన్‌పాయింట్ కచ్చితత్వంతో ప్రత్యర్థి డ్రోన్లను చిత్తుచేస్తుంది. శత్రువు డ్రోన్లు తప్పించుకొనే అవకాశమే ఉండదు. గైడెడ్ మైక్రో మిస్సైల్‌ను గతంలోనే పరీక్షించారు. → అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసేలా భార్గవాస్త్రను అభివృద్ధి చేశారు. సముద్ర మట్టానికి 5 కిలోమీటర్లకుపైగా ఎత్తులోనూ చక్కగా పనిచేయగలదు. భారత సైనిక దళాల అవసరాలను అనుగుణంగా రూపొందించారు. → పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, చాలా తక్కువ ఖర్చుతో భార్గవాస్త్రను డిజైన్ చేయడం విశేషం. త్రివిధ దళాల అవసరాల మేరకు ఇందులో అదనంగా మార్పుచేర్పులు చేసుకోవచ్చని ఎస్‌డీఏఎల్ వెల్లడించింది. → అడ్వాన్స్డ్ సీ4ఐ(కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో భార్గవాస్త్ర పనిచేస్తుంది. గగనతలంలో ఎదురయ్యే ముప్పును రియల్–టైమ్‌లో ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. → ఇందులోని రాడార్ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించగలదు. అలాగే ఎలక్ట్రో ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్(ఈఓ/ఐఆర్) సెన్సార్లు ‘లో రాడార్ క్రా–సెక్షన్’ లక్ష్యాలను కనిపెట్టగలవు. → కౌంటర్–డ్రోన్ టెక్నాలజీలో భార్గవాస్త్ర ఒక మైలురాయి అని ఎస్‌డీఏఎల్ అధికారులు చెబుతున్నారు. → కొన్ని దేశాలు భార్గవాస్త్ర తరహాలో మైక్రో–మిస్సైల్ సిస్టమ్స్‌ను రూపొందించినప్పటికీ... పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో ఇలాంటి బహుళ దశలతో కూడిన కౌంటర్–డ్రోన్ వ్యవస్థను ఎవరూ తయారు చేయలేకపోయారు. → భార్గవాస్త్రను హార్డ్‌కిల్ మోడ్‌లో రూపొందించారు. భారీ డ్రోన్లతోపాటు చాలా చిన్నస్థాయి డ్రోన్లను కూడా గుర్తించి, కూల్చివేయగలదు.

టీపీసీసీకి జంబో కార్యవర్గం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ కూర్పు తుది దశకు చేరింది. పార్టీ అగ్రనాయకత్వం సూచనల మేరకు సిద్ధమైన కార్యవర్గ ప్రతిపాదనల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అందజేశారు. కార్యవర్గంతోపాటు పార్టీలోని వివిధ కమిటీల చైర్మన్లకు సంబంధించిన పేర్లను అందులో చేర్చారు. దీనిపై తుది పరిశీలన అనంతరం రెండుమూడు రోజుల్లో కార్యవర్గ ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువమందికి అవకాశం కల్పించేలా..కొత్తగా ఏర్పాటు చేయనున్న టీపీసీసీకి జంబో కార్యవర్గమే ఉండనున్నట్టు తెలుస్తోంది. కొత్త కార్యవర్గంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు. మొదట ఐదు నుంచి ఆరు పేర్లు అనుకున్నా, దానిని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి వర్గాలకు ఇచ్చేలా నాలుగుకు కుదించారు. ఈ పోస్టు కోసం ఎక్కువ మంది పోటీలో ఉన్న నేపథ్యంలో ఒక్కోవర్గం నుంచి ముగ్గురేసి పేర్ల చొప్పున 12 మంది పేర్లను సిఫార్సు చేశారు. హైకమాండ్ సూచనల మేరకు అందులో ఒకరి పేరు ఖరారు కానుంది. వైస్ ప్రెసిడెంట్లుగా 35 మంది వరకు ఉంటారు. అయితే 50 మంది పేర్లను ఏఐసీసీ ముందుంచినట్టు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులుగా 80 మందిని నియమించుకున్నారు. ప్రతి జిల్లాకు కచ్చితంగా ఇద్దరేసి చొప్పున అవకాశం ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మాత్రం ఎక్కువ మందికి అవకాశం కల్పించనున్నారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (పీఈసీ), పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ), క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, ప్రచార కమిటీ, మీడియా కమిటీలకు సైతం పలువురు పేర్లను సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలను టీపీసీసీ చీఫ్ ఏఐసీసీకి అందజేశారు. వీటిపై మరోమారు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌తోపాటు రాష్ట్ర నేతలను సంప్రదించిన అనంతరం కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశముంది.
ఎన్ఆర్ఐ

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.

న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.

పహల్గామ్ విషాదం, ఎన్ఆర్ఐల శాంతి ర్యాలీ
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన చేశారు.అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావటం, ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకోవటంపై ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు. హింసామార్గంలో ఎవరూ కూడా లక్ష్యాలను సాధించలేరన్న విషయాన్నిపాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.ఉగ్రవాదుల అణిచేతకు భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం(నైటా), వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారతీయ జెండాలను ప్రదర్శిస్తూ, కొవ్వత్తులతో శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.

లండన్‌లో ఘనంగా తాల్ 20వ వార్షికోత్సవం, ఉగాది సంబరాలు
తెలుగు అసోసీయేషన్ ఆఫ్ లండన్(తాల్(TAL)) 20వ వార్షికోత్సవం తోపాటు, ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిలల 26న ఈస్ట్ లండన్‌లోని లేక్వ్యూమార్కీలో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. దీంతో ఇది తాల్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల తన బృందంతో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఈవెంట్ కన్వీనర్ రవీందర్ రెడ్డి గుమ్మకొండ, కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల ప్రత్యేక అథిధులుగా పాల్గొన్నారు. ముందుగా ఫల్గాం విషాద సంఘటనలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిముషాల మౌనం పాటించి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాల్ సమైక్యతను, మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది. తాల్ 20 సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఛైర్మన్ రవి సబ్బా ఈ తాల్ విజయ పరంపరకు తోడ్పడిన గత చైర్మన్లు, ట్రస్టీలు, ఉగాది కన్వీనర్లందర్నీ ఘనంగా సత్కరించారు. తాల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాములు దాసోజుని తాల్ కమ్యూనిటీ లీడర్షిప్ అవార్డుతో సత్కరించారు. తాల్ వార్షిక పత్రిక "మా తెలుగు 2025"ని కూడా ఈ వేడుకలో ఆవిష్కరించారు. అందుకు కృషి చేసిన సూర్య కందుకూరి, ప్రధాన సంపాదకుడు రమేష్ కలవల తదితర సంపాదక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో తాల్ చరిత్రను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీ ప్రదర్శన ద్వారా గత రెండు దశాబ్దాల విశేషాలను చిత్ర మాలికా రూపంలో ప్రదర్శించారు. ఇక ఈ వేడుకలోనే స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ సత్య పెద్దిరెడ్డి తాల్ ప్రీమియర్ లీగ్ (TPL) T20 క్రికెట్ సీజన్‌ను కూడా ప్రారంభించారు. ముఖ్యఅతిథి రామ్ మిరియాల2025 ఛాంపియన్ ట్రోఫీని ఆవిష్కరించారు.(చదవండి: టంపాలోనాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు)
క్రైమ్

భార్యతో విడాకులు తీసుకుంటున్నానని చెప్పి..!
బంజారాహిల్స్(హైదరాబాద్): నా తల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి..నా భార్య నాతో సఖ్యంగా ఉండదు..అందుకే విడాకులు తీసుకుంటున్నాం..అందుకు సంబంధించిన విడాకులు పత్రాలు ఇవిగో అంటూ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. చివరకు సదరు వైద్యుడి అసలు నిజ స్వరూపం తెలియడంతో తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భరత్ గెరా నగరంలోని కొండాపూర్ ప్రైమ్ స్ప్లైండర్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని డెరెడియా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెచ్ఆర్ ఆపరేషనల్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో భరత్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు గతంలోనే వివాహం జరిగిందని, తన భార్యతో గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. న్యాయవాది ఎదుట ఇద్దరూ సంతకం చేసిన పత్రాలను కూడా ఆమెకు చూపించాడు. తన తల్లికి తనకు ఆస్తి గొడవలు ఉన్నాయని, తల్లి, సోదరుడు ఢిల్లీలో ఉంటారని చెప్పాడు. ఈ క్రమంలో మార్చి 31న కంపెనీ పనిపై చంఢీఘడ్ వెళుతున్న భరత్ సదరు వైద్యురాలిని కూడా తీసుకెళ్లి అక్కడ హోటల్ రూంలో బస చేశారు. ఆ సమయంలో భరత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భరత్‌ను కంపెనీ యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించగా, అతడితో పాటు సదరు యువతి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం ఆమె నుంచి భరత్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. అంతేగాక భరత్ సదరు యువతి ఫోన్లో లోకేషన్‌ను ట్రాక్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భరత్‌తో మాట్లాడేందుకు అతని ఇంటికి వెళ్లగా అతడి భార్య ఇంట్లో ఉండటాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా వైద్యురాలిని అసభ్యంగా దూషించడమేగాక వివాహితుడితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావంటూ నిలదీసింది. ఆ తర్వాత భరత్, అతని భార్య పూణెకు మకాం మార్చారు. కొన్ని రోజుల తర్వాత గర్భం దాల్చిన బాధితురాలు భరత్ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆగని ‘రక్తచరిత్ర’.. ఎదురొస్తే ఎవరినీ వదలం
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ దాషీ్టకాలతో నియోజకవర్గంలోని రామగిరి మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తారో, ఏ పరిణామాలు ఎవరి ప్రాణాలు తీస్తాయో.. అని వణికిపోతున్నారు. బలవంతంగా పార్టీలోకి చేర్చుకోవడం,అవసరమైతే దాడులు చేయడం రామగిరి మండలంలో టీడీపీ గూండాలకు పరిపాటిగా మారింది. ఎంపీపీ ఉప ఎన్నికకు మరోసారి నోటిఫికేషన్ విడుదల కావడంతో ‘రక్తచరిత్ర’ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చిలో జరగాల్సిన ఎంపీపీ ఉప ఎన్నికను టీడీపీ గూండాల దౌర్జన్యాలతో అధికారులు వాయిదా వేశారు. ఎంపీటీసీ సభ్యులను బెదిరించి కిడ్నాప్‌నకు యత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు హతమార్చారు. పరామర్శించడానికి వచి్చన మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పోలీసులు సరైన రక్షణ కల్పించలేదు. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్సీపీ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఎంపీపీ స్థానానికి అభ్యర్థి కూడా లేని టీడీపీ వాళ్లు ఎలాంటి దారుణాలకు ఒడిగడతారోనని వైఎస్సార్సీపీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు భయపడుతున్నారు. బలవంతంగా టీడీపీలో చేర్చుకుని.. ఈ నెల 19వ తేదీన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుంది. ఎంపీపీ పదవి మహిళా అభ్యర్థికి రిజర్వు కావడంతో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి వేటలో పడ్డారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని మంగళవారం బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లి టీడీపీ కండువా వేసి పా ర్టీలో చేరినట్లు పరిటాల సునీత, శ్రీరామ్ ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం నుంచి భారతి ఎవరికీ కనిపించకుండా పోయారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ వారు దు్రష్పచారం చేశారు. వారి ప్రచారాన్ని భారతి ఖండిస్తూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బుధవారం వీడియో విడుదల చేశారు. ఇంటిపై దాడి... పట్టించుకోని పోలీసులు టీడీపీలో చేరిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని ఎక్కడ దాచారో చెప్పాలంటూ కొత్తపల్లి గ్రామంలో కురుబ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి టీడీపీకి చెందిన మాదాపురం శంకర్‌తోపాటు మరికొంతమంది రౌడీలు దాడి చేశారు. ఈ ఘటన గురించి బుధవారం ఉదయం రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసులపై నమ్మకం పోయిందని, ఎన్నిక పూర్తయ్యే వరకు స్థానికంగా ఉంటే టీడీపీ గూండాలు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్యను హత్య చేసిన తరహాలోనే దారుణానికి ఒడిగడతారని కొత్తపల్లి గ్రామస్తులు భయపడుతున్నారు.ఎంపీపీ ఇస్తామన్నారు ‘టీడీపీ నేతలు నన్ను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లారు. పరిటాల సునీత, శ్రీరామ్ సమక్షంలో పార్టీ కండువా వేసి ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. నాకు ఎలాంటి పదవీ వద్దని చెప్పినా బలవంతపెట్టారు. ఆ తర్వాత మా గ్రామంలో వదిలారు. అక్కడ ఉంటే రక్షణ ఉండదని భావించి బంధువుల ఇంటికి వచ్చాను. నాకు టీడీపీలోకి వెళ్లడం ఇష్టం లేదు. పదవి కంటే పార్టీ ముఖ్యం. వైఎస్సార్సీపీలోనే కొనసాగుతా. ఎంపీపీ ఉప ఎన్నికకు హాజరుకాలేను. ఈ నెల 20 తర్వాత గ్రామానికి వస్తాను. – భారతి, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు, పేరూరు–2ఎన్నికను బహిష్కరిస్తున్నాం ‘రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తోంది. మార్చి 27న జరగాల్సిన ఎన్నిక టీడీపీ నాయకుల దౌర్జన్యాల కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కురుబ లింగమయ్యను కోల్పోయాం. మరోసారి ఇంకొందరు కార్యకర్తలను కోల్పోలేం. అందుకే ఎన్నికకు దూరంగా ఉంటాం. రామగిరి పోలీసులపై నమ్మకం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తేనే సరైన రక్షణ కల్పించలేకపోయారు.’ – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే

ఇద్దరు బామ్మర్దులను బల్లెంతో పొడిచి చంపిన బావ
అల్లూరి సీతారామరాజు: జిల్లాలో సంచలనం సృష్టించిన బావమరుదుల హత్య కేసులో బావను సీలేరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను జీకే విధి సీఐ వరప్రసాద్, సీలేరు ఎస్ఐ రవీంద్ర విలేకరులకు తెలియజేశారు. నిందితుడు వంతల గెన్ను సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. గ్రామంలో ఆదివారం జరిగిన బంధువు దినకర్మకు బావమరుదులు కిముడు కృష్ణ, కిముడు రాజు హాజరయ్యారు. అనంతరం ఆదివారం రాత్రి నిందితుడి ఇంట్లోనే వారంతా ఉన్నారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో గెన్ను తన తరచూ వేధిస్తున్న విషయాన్ని అన్నదమ్ములకు సోదరి(గెన్ను భార్య) చెప్పింది. దీంతో బావమరుదులు గెన్నును నిలదీశారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు గొడవ కొనసాగింది. ఆగ్రహించిన గెన్ను.. ఇంట్లో ఉన్న బల్లెంతో ముందుగా మూడో బావమరిది కిముడు రాజును పొడిచాడు. ఆయన తప్పించుకుని పారిపోయాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఆడవాళ్లు, పిల్లలు కేకలు వేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న మరో బావమరిది కిముడు రాజు అడ్డుకున్నాడు. అతనిని కూడా బల్లెంతో కడుపులో పొడవడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇంటి బయట కారులో నిద్రిస్తున్న కిముడు కృష్ణ చూసి ఇంట్లోకి పరిగెత్తి వెళ్లగా నిందితుడు దాడి చేసి హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై 2013లో కూడా ఓ హత్య కేసు ఉందన్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించామని తెలిపారు.వేదన మిగిల్చిన హత్యలుసీలేరు మేజర్ పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల హత్యలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా.. మరో సోదరుడు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అన్నదమ్ముల అంత్యక్రియలకు కూడా తమ్ముడు రాలేని దీన పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రం పోస్టుమార్టం నిమిత్తం సీలేరు నుంచి చింతపల్లికి మృతదేహాలను తరలించారు. మంగళవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్పినట్టు ఎస్ఐ రవీందర్ తెలిపారు. మృతదేహాలకు స్వగ్రామమైన ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. సొంత కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా కిరాతకంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.

ఎందుకురా నీ బతుకు చావరాదు..! అని తిట్టడంతో
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కులపెద్దలు చేసిన పంచాయితీ ఒకరి నిండు ప్రాణాన్ని తీసింది. పంచాయితీలో బూతులు తిట్టడంతో అవమాన భారంగా భావించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కడమంచి స్వామి(34) ఇంట్లో లేనప్పుడు అ తని భార్యపై అదే గ్రామానికి చెందిన టేకు ప్రేమ్‌కుమార్ లైంగికదాడికి యత్నించాడు. స్వామికి ఈ విషయం తెలియడంతో ప్రేమ్‌కుమార్‌ను నిలదీశా డు.మూడు రోజుల క్రితం కులపెద్దలు పంచాయితీ పెట్టి ప్రేమ్‌కుమార్‌కు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రేమ్‌కుమార్ స్వామిని అందరిముందే బూతులు తిట్టాడు. అంతేకాకుండా చావమని తిట్టడంతో అవమానంగా భావించిన స్వామి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో ప్రేమ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రెయినీ ఎస్సై కె.వినీతారెడ్డి తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులతోపాటు కొందరు విలేకరులు కలిసి ఈ పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. వీరిద్దరి నుంచి రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షలు పంచాయితీ దరావతుగా తీసుకోవడంతోపాటు ఆ మొత్తం కూడా ఖర్చు అయినట్లు తెలిపారనే చర్చ సాగుతోంది.