
ప్రెగ్నెన్సీ అని రాస్తారా.. వంద కోట్లు ఇవ్వండి!
అందాల ఆరబోతతో వెలుగులోకి వచ్చిన వివాదాస్పద నటి, మోడల్ పూనం పాండేకు నిత్యం వార్తల్లో ఉండటం ఎలాగో బాగా తెలిసినట్టు ఉంది. ఈ భామ ఇప్పుడు ఓ వెబ్‌సైట్‌పై అక్షరాల రూ. వందకోట్ల పరువు నష్టం దావా వేసింది. తాను గర్భం దాల్చి అబార్షన్ చేయించుకున్నట్టు లేనిపోని అసత్యాలను ఆ వెబ్‌సైట్ ప్రచురించిందని, ఈ కథనాలను తనను తీవ్రంగా బాధించాయని 'నషా' నటి చెప్తోంది.
తన గురించి రాసిన కథనం పచ్చి బూటకమని, అందుకే ఆ వెబ్‌సైట్‌పై తాను చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నట్టు పూనం తాజాగా ట్విట్టర్‌లో ప్రకటించింది. 'నేను షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు ఈ కథనం గురించి తెలిసింది. దీంతో తీవ్రంగా మథనపడ్డా. అసలు వాస్తవాలేమిటో తెలుసుకోవాలని నా మేనేజర్‌ను ఆదేశించా' అని ఆమె పేర్కొంది. 'ఎలాంటి ఆధారం లేకుండా ఆ కథనాన్ని ఎందుకు రాశావని నేను ఆ రిపోర్టర్‌ను అడిగాను. ఆమె చెప్పింది విని బిత్తరపోయాను. తన వద్ద ఎలాంటి ఆధారం లేకపోయినా.. ఎవరో చెప్పింది విని తాను అది రాసినట్టు ఆమె చెప్పింది. ఇలాంటి జర్నలిజం చూసి నేను షాక్ తిన్నాను' అని రాసుకొచ్చింది 'నషా' నటి.