
లాకప్‌లోని జడ్జిమెంట్ డే ఎపిసోడ్‌లు సాధారణంగా వివాదాలతో , ఆసక్తికరంగా సాగుతాయి. ఈసారి కూడా కంగానా జడ్జిమెంట్ ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ షో ఇదివరకు ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌లకు విభిన్నమైన టాస్క్‌లు ఇచ్చారు.
Kangana Ranaut Praises Poonam Pandey For Seductress Task: బీటౌన్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'లాకప్'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షోలో కంటెస్టెంట్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి వారి రహస్యాలు బయటపెట్టారు. అవి విన్న ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే లాకప్‌లోని జడ్జిమెంట్ డే ఎపిసోడ్‌లు సాధారణంగా వివాదాలతో , ఆసక్తికరంగా సాగుతాయి. ఈసారి కూడా కంగానా జడ్జిమెంట్ ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ షో ఇదివరకు ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌లకు విభిన్నమైన టాస్క్‌లు ఇచ్చారు. అందులో హాట్ బ్యూటీ పూనమ్ పాండేకు 'సమ్మోహనురాలు (సెడక్ట్రస్/సెడ్యూస్)' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో పూనమ్ అదరగొట్టిందని కంగనా ప్రశంసలు కురిపించింది. టాస్క్‌కు తన బెస్ట్ ఇచ్చిందని పొగడ్తలతో ముంచెత్తింది.
చదవండి: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాను.. 4 కేసులు కూడా ఉన్నాయి: లాకప్ కంటెస్టెంట్
'పూనమ్ మీరు చాలా బాగా ఆడారు. నిజంగా చాలా హాట్‌గా కవ్వించి అదరగొట్టారు. నాకే హాట్‌గా అనిపించింది అంటే మీరు ఎంతలా యాక్ట్ చేశారో అర్థమవుతుంది. సెడక్షన్ అనేది ఒక కళ. 64 కళల్లో సమ్మోహన కళ కూడా ఒకటి. మీరు అందులో ఒక మంచి కళాకారిణి. ఇతర మహిళలకు సమ్మోహన కళను నేర్పించేందుకు ఒక పాఠశాలను తెరవండి. మాకు కూడా ఆ కళలో కోచింగ్ ఇవ్వండి.' అంటూ పూనమ్ పాండేను ప్రశంసలతో ముంచెత్తింది కంగనా రనౌత్. ఆమె పొగడ్తలు విని సిగ్గు పడుతూ నవ్వింది పూనమ్. ఇతర కంటెస్టెంట్‌లు కూడా ఆసక్తిగా ఈ సంభాషణను విన్నారు. ఈ రియాలిటీ షోలో కరణ్‌వీర్ బోహ్రా, నిషా రావల్, మునావర్ ఫరూఖీ, సారా ఖాన్, అలీ మర్చంట్, సైషా షిండే, పాయల్ రోహత్గీ, బబిదా ఫోగట్, అంజలి అరోరా మిగతా కంటెస్టెంట్లు.
చదవండి: 'లాకప్'లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఎందుకంటే ?