సన్నీ లియోన్ వర్సెస్ పూనం పాండే | poonam pandey also to sizzle in new year eve at hyderabad | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్ వర్సెస్ పూనం పాండే

Published Wed, Dec 31 2014 8:57 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

సన్నీ లియోన్ వర్సెస్ పూనం పాండే - Sakshi

సన్నీ లియోన్ వర్సెస్ పూనం పాండే

మరికొన్ని గంటలు.. కొన్ని వేల వాట్ల సౌండుతో మ్యూజిక్ హోరెత్తుతుంది. బీర్లు బుస్సు బుస్సుమంటూ పొంగుతాయి. హైదరాబాద్ వాసులకు ఆ మద్యం కంటే కొన్ని వేల రెట్లు కిక్కు ఎక్కించేందుకు ఇద్దరు సుందరీమణులు పోటీ పడుతున్నారు. అవును.. ఒకవైపు సన్నీ లియోన్, మరోవైపు పూనం పాండే కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ వచ్చేశారు!! ముంబై.. ఢిల్లీ కంటే మన హైదరాబాదే బెస్టంటూ వీళ్లిద్దరూ కట్టగట్టుకుని మరీ అడుగు పెట్టేశారు.

జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ వెన్యూలో సన్నీ లియోన్ కాలు కదుపుతోందన్న విషయం అందరికీ ఇప్పటికే తెలుసు గానీ, ఆమెకు పోటీగా పూనం పాండే కూడా దిగుతోందన్నది మాత్రం కచ్చితంగా కొత్త విషయమే. చిట్ట చివరి నిమిషంలో ఆమె కార్యక్రమం ఖరారైంది. వాస్తవానికి మాలిని అండ్ కో అనే తెలుగు సినిమాలో పాట షూటింగ్ కోసం పూనం పాండే వస్తున్న విషయం తెలుసుకుని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వాహకులు వెంటనే అమ్మడిని బుక్ చేసేశారట. ఇక ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడుతూ డాన్సులు చేస్తుంటే.. కుర్రకారుకు కిర్రెక్కదా మరి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement