సాక్షి, బెంగళూరు: బాలీవుడ్ నటి సన్నిలియోన్‌కు కర్ణాటక రక్షణ వేదిక యువసేన భారీ షాకిచ్చింది. బెంగళూరులో జరగనున్న నూతన సంవత్సర వేడుకల్లో సన్నీ పాల్గొనేందుకు వీళ్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ న్యూ ఇయర్ వేడుకల్లో సన్నీ పాల్గొంటే.. సామూహిక ఆత్మహత్యకు వెనుకాడే ప్రసక్తే లేదంటూ యువసేన హెచ్చరించింది.
న్యూ ఇయర్ లాంటి భారీ ఈవెంట్లు వచ్చాయంటే సన్నీ లియోన్ లాంటి హాట్ భామలకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తుంటాయి. ఈ క్రమంలో బెంగళూరు న్యూ ఇయర్ ఈవెంట్‌లో పాల్గొనే ఆఫర్ రావడంతో సన్నీ ఒకే చెప్పింది. కాగా, సన్నీ గతం మంచిదికాదని, ఆమెలాంటి వాళ్లను ప్రోత్సహించడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని, కర్ణాటక సంస్కృతిని రక్షించుకోవాలంటే ఆ నటిని ఇక్కడికి రాకుండా చేయాలంటూ కర్ణటక రక్షణ వేదిక యువసేన పిలుపునిచ్చింది. ఈ మేరకు కర్ణాటకలో పలు జిల్లా కేంద్రాల్లో సన్నీ లియోన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి, ఆమె పోస్టర్లు, ఫొటోలు కాల్చేశారు. ఇక్కడికి రాకపోతే సన్నీకే మంచిదని, అలా కానిపక్షంలో 20 జిల్లాల్లో ఆమెకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
ఈవెంట్ నిర్వాహకుడు హరీశ్ మాట్లాడుతూ.. గతంలో కర్ణాటకలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సన్నీ పాల్గొన్నారు. కన్నట పాటకు సంప్రదాయ దుస్తులు ధరించి సన్నీ షోలో పాల్గొంటుంటే, అడ్డుకోవాలనుకోవడం మంచిది కాదన్నారు. ఎన్నో మంచి ఆఫర్లను తిరస్కరించి సన్నీ ఈ షోకు ఒకే చెప్పారని, ఎందుకంటే ఆ నటికి హైదరాబాద్ అన్నా, బెంగళూరన్నా చాలా ఇష్టమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment