‘నేను అక్కడకు రావడం లేదు’ | Sunny Leone cancels New Year event in Bengaluru | Sakshi
Sakshi News home page

‘నేను అక్కడకు రావడం లేదు’

Published Tue, Dec 19 2017 7:26 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

Sunny Leone cancels New Year event in Bengaluru - Sakshi

సాక్షి, ముంబై : బెంగళూరులో జరగనున్న న్యూ ఇయర్‌ వేడుకలకు తాను హాజరుకావడం లేదని బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ ప్రకటించారు. బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకలకు సన్నీలియోన్‌ హాజరవుతుందని పార్టీ నిర్వాహకులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రమంతటా నిరసనలు మిన్నంటాయి. కర్ణాటక సంస్కృతీ సంప్రదాయాలు పతనమవుతాయంటూ.. కర్ణాటక రక్షణ వేదిక ఉద్యమించింది. ఈ వివాదాల నేపథ్యంలో బెంగళూరుకు వస్తే రక్షణ పరమైన సమస్యలు తలెత్తవచ్చన్న కారణంతోనే న్యూ ఇయర్‌ ఈవ్‌ను రద్దు చేసుకున్నట్లు సన్నీలియోన్‌ ట్విటర్‌లో తెలిపారు. 

అంతేకాక సన్నీ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమించిన యువతను ఉద్దేశించి కూడా సన్నీలియోన్‌ ట్వీట్‌ చేశారు. ‘మీరంతా యువకులు.. మీ కంటూ సొంత అభిప్రాయాలు, సొంత నిర్ణయాలు ఉంటాయి. వాటిని గౌరవిస్తాను.. మీతోనే నవభారతం’ అంటూ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement