మొత్తం టికెట్లు సేల్‌ అయిపోయాయి.. | Sunny Leone declines to perform in Bengaluru | Sakshi
Sakshi News home page

సారీ చిందేయడం లేదు!

Published Mon, Dec 25 2017 9:27 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

Sunny Leone declines to perform in Bengaluru - Sakshi

తమిళసినిమా: నూతన సంవత్సరం వస్తుందంటే నక్షత్ర హోటళ్లలో, ఫామ్‌ హౌస్‌లలో ఆటాపాటా అంటూ పార్టీలు జోరుగా సాగుతుంటాయి. అలాంటి పార్టీల్లో సినీ తారలకు భారీ పారితోషికాలు చెల్లించి డాన్స్‌ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. పెద్ద మొత్తంలో ముట్టడం వల్ల స్టార్‌ హీరోయిన్లు, క్రేజీ నృత్య తారలు ఆ రోజు పార్టీలో నర్తించడానికి సై అంటుంటారు.అదే విధంగా ఈ ఏడాది చాలా మంది ప్రముఖ తారలు నూతన సంవత్సర పార్టీలకు బుక్‌ అయిపోయారని తెలుస్తోంది. ఐటమ్‌ సాంగ్స్‌కు బ్రాండ్‌గా మారిన నటి సన్నిలియోన్‌ కూడా డిసెంబర్‌ 31వ రాత్రి జరగనున్న ఒక పార్టీలో ఆడడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆమె అంగీకరించింది బెంగళూర్‌లో జరగనున్న పార్టీలో. ఒక ప్రైవేట్‌ సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సన్నిలియోన్‌ చిందేయనుందని ఇటీవల ఆ సంస్థ ప్రచారం కూడా చేసుకుంది.

దీంతో టికెట్ల విక్రయం జోరుగా సాగి మొత్తం టికెట్లు సేల్‌ అయిపోయాయి.అయితే బెంగళూర్‌లో సన్నిలియోన్‌ డాన్స్‌ చేయడాన్ని అక్కడి కన్నడ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నటి సన్ని లియోన్‌ సెక్సీడాన్స్‌లతో కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలుగుతుందనే వాదనను వారు తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఆ రాష్ట్ర హోంశాఖామంత్రి ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సన్నిలియోన్‌ డాన్స్‌కు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నీ కూడా సారీ తానా పార్టీలో చిందేయడం లేదు అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన వల్ల కర్ణాటక ప్రజల్లో మనస్పర్థలు రావడం, సమస్యలు తలెత్తడం తనకిష్టం లేదన్నారు.అందుకే తానా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. విషయం ఏమిటంటే ఈ అమ్మడు త్వరలో దక్షిణాది భాషల్లో ఒక భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు బెంగళూర్‌లో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించనున్న పార్టీలో సన్నిలియోన్‌ డాన్స్‌ చేస్తే తదుపరి తను హీరోయిన్‌గా నటించే చిత్రానికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, ఈ పార్టీలో చిందేయకపోవడమే బెస్ట్‌ అనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement