dance program
-
అక్టోబర్ 28న తారామతి బారాదరిలో నాట్యతోరణం !
భారతదేశానికి చెందిన పురాతనమైన, అంతరించిపోతున్న నాట్యరీతులకు పునర్వైభవం కల్పించేందుకు టెక్నాలజీ, సోషల్ మీడియాల ద్వారా కృషిచేస్తున్న సంస్థ.. అమృత కల్చరల్ ట్రస్ట్. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ శనివారం నగరంలోని ప్రముఖ కళావేదిక తారామతి బారాదరిలో గల కేళిక ఇండోర్ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నాట్యతోరణం-2023 పేరిట ఒక నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కూచిపూడి, భరతనాట్యం, మోహిని అట్టం, ఒడిస్సి, కథక్‌లతో పాటు.. ప్రముఖ నాట్యగురువు కళాకృష్ణ బృందం పేరిణి శివతాండవం కూడా ప్రదర్శిస్తారు. ఈ అన్నిరకాల నాట్యరీతులను వాటిలో లబ్ధ ప్రతిష్ఠులైన గురువుల మార్గదర్శకత్వంలో వారి బృందాలు ప్రదర్శిస్తాయి. ఇందులో ప్రవేశం పూర్తిగా ఉచితం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ హాజరవుతారు. మహిళా సంరక్షణ విభాగం డీఐజీ సుమతి, డాక్టర్ అనురాధ జొన్నలగడ్డ, కళారత్న డాక్టర్ వనజా ఉదయ్, చావలి బాల త్రిపుర సుందరి తదితరులు కూడా పాల్గొంటారు. హైదరాబాద్ క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో రెండు లేదా మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమం ద్వారా సంప్రదాయ నాట్య రూపాల విశిష్టతను చాటిచెప్పే అవకాశం కలగజేస్తామని అమృత కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భార్గవి పగడాల అన్నారు. అమృత కల్చరల్ ట్రస్ట్ మూడో వార్షికోత్సవ కార్యక్రమమైన నాట్య తోరణం- 2023 ద్వారా భారతదేశవ్యాప్తంగా ఉన్న నిపుణులైన డ్యాన్సర్ల కళాప్రదర్శన వీక్షించే అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. నృత్యాన్ని వృత్తిగా అవలంబించేవారికి తమ ట్రస్టు స్కాలర్షిప్లను అందజేస్తోందని భార్గవి తెలిపారు. సంప్రదాయ నృత్య అంశాలను భద్రపరచడం, ప్రోత్సహించడం కోసం అమృత కల్చరల్ ట్రస్ట్ ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ రంగంలో ఉత్సాహవంతులైన యువతను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తున్నట్లు భార్గవి చెప్పారు. (చదవండి: వాటర్ విమెన్! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!) -
అలరించిన నాట్యతోరణం
సాక్షి, మాదాపూర్(హైదరాబాద్): నాట్య తోరణం పేరిట ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మాదాపూర్‌లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్) సెంటర్లో శనివారం అమ్రిత కల్చరల్ అధ్వర్యంలో దేశ సంస్కృతికి ప్రతిరూపంగా నాట్య తోరణం పేరిట పలు నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ , విదేశీ కామన్వెల్త్ ఆఫీస్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, విశ్రాంత ఐఎఎస్ అధికారి, డాక్టర్ ఎస్ చెల్లప్ప, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆంధ్రనాట్య విద్యాకోవిదులు ఆచార్య కళాకృష్ణ, కూచిపూడి, భరతనాట్య , విశారదుడు పసుమర్తి రామలింగశాస్త్రి, ఒడిస్సీ నాట్య విదుషీమణి నయనతార నందకుమార్, సీసీఆర్టీ ప్రత్యేక అధికారి తాడేపల్లి సత్యనారాయణ శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూచిపూడి, కథక్, ఒడిస్సా, భరతనాట్య ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి. భార్గవి పగడాల(హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన నయన మనోహరంగా సాగింది. మురమళ్ల సురేంద్రనాథ్చే కూచిపూడి నృత్య ప్రదర్శన, నిదగ కరునాథ్చే కథక్, అభయాకారం కృష్ణన్ భరతనాట్య ప్రదర్శన, బిజినచే మోహినియట్టం తదితర నృత్యప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అతిథులను ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజేష్ పగడాల గౌరవ పూర్వకంగా సత్కరించారు. భారతీయ నాట్యతోరణం దేశ సంస్కృతికి ప్రాణం ఆభరణంగా నిలుస్తుందదని పేర్కొన్నారు. దేశంలో శాస్త్రీయ నాట్య రంగాలలో కృషిచేసి ప్రతిభతో పేరు గడిస్తున్న యువ నాట్యాచార్యులకు వేదిక కల్పిస్తూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇటువంటి ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
ధన్యజీవి అన్నదాత
-
బాలోత్సవం
-
మొత్తం టికెట్లు సేల్ అయిపోయాయి..
తమిళసినిమా: నూతన సంవత్సరం వస్తుందంటే నక్షత్ర హోటళ్లలో, ఫామ్ హౌస్‌లలో ఆటాపాటా అంటూ పార్టీలు జోరుగా సాగుతుంటాయి. అలాంటి పార్టీల్లో సినీ తారలకు భారీ పారితోషికాలు చెల్లించి డాన్స్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. పెద్ద మొత్తంలో ముట్టడం వల్ల స్టార్ హీరోయిన్లు, క్రేజీ నృత్య తారలు ఆ రోజు పార్టీలో నర్తించడానికి సై అంటుంటారు.అదే విధంగా ఈ ఏడాది చాలా మంది ప్రముఖ తారలు నూతన సంవత్సర పార్టీలకు బుక్ అయిపోయారని తెలుస్తోంది. ఐటమ్ సాంగ్స్‌కు బ్రాండ్‌గా మారిన నటి సన్నిలియోన్ కూడా డిసెంబర్ 31వ రాత్రి జరగనున్న ఒక పార్టీలో ఆడడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆమె అంగీకరించింది బెంగళూర్‌లో జరగనున్న పార్టీలో. ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సన్నిలియోన్ చిందేయనుందని ఇటీవల ఆ సంస్థ ప్రచారం కూడా చేసుకుంది. దీంతో టికెట్ల విక్రయం జోరుగా సాగి మొత్తం టికెట్లు సేల్ అయిపోయాయి.అయితే బెంగళూర్‌లో సన్నిలియోన్ డాన్స్ చేయడాన్ని అక్కడి కన్నడ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నటి సన్ని లియోన్ సెక్సీడాన్స్లతో కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలుగుతుందనే వాదనను వారు తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఆ రాష్ట్ర హోంశాఖామంత్రి ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సన్నిలియోన్ డాన్స్‌కు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నీ కూడా సారీ తానా పార్టీలో చిందేయడం లేదు అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తన వల్ల కర్ణాటక ప్రజల్లో మనస్పర్థలు రావడం, సమస్యలు తలెత్తడం తనకిష్టం లేదన్నారు.అందుకే తానా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. విషయం ఏమిటంటే ఈ అమ్మడు త్వరలో దక్షిణాది భాషల్లో ఒక భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు బెంగళూర్‌లో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించనున్న పార్టీలో సన్నిలియోన్ డాన్స్ చేస్తే తదుపరి తను హీరోయిన్గా నటించే చిత్రానికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, ఈ పార్టీలో చిందేయకపోవడమే బెస్ట్ అనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. -
అరవిరిసిన నాట్యపారిజాతం
కృష్ణసాహితి కూచిపూడి అరంగేట్రం రాజమహేంద్రవరం కల్చరల్: పువ్వు పుట్టగానే పరిమళించింది. మూడో తరగతి విద్యార్థిని కడియం కృష్ణసాహితి తన హావభావాలు, అభినయాలతో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న కృష్ణసాహితి కూచిపూడి రంగప్రవేశం (అరంగేట్రం) ఆదివారం సాయంత్రం రివర్‌బే ఆహ్వానం హాలులో ఘనంగా జరిగింది. ’గం గణపతికివే నా ప్రణతులు’ (గణపతి కౌతం), ’వలచి వచ్చియున్నానురా’ (నవరాగమాలిక వర్ణం), బాలగోపాల (తరంగం), మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ (దశావతార శబ్దం), జయజయ దుర్గే (దుర్గాసూక్తి), ’నారాయణ తే నమోనమో’ (అన్నమయ్య కీర్తన), ధిరతాన ధీంతా (తిల్లాన)లకు ఆమె చేసిన నృత్యాభినయం ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. కృష్ణసాహితిని అతిథులు, నిర్వాహకులు సత్కరించారు. ముందుగా నాట్యాచారిణి గోరుగంతు ఉమాజయశ్రీకు కృష్ణ సాహితి గురుపూజ నిర్వహించింది. శ్రీ రాధాకృష్ణ సంగీత, నృత్యకళాక్షేత్ర విద్యార్ధులు బృందగానాలు ఆలపించారు. ప్రియాంక వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంస్థ డైరెక్టర్ జి.రాధాకృష్ణ స్వాగత వచనాలు పలికారు. కళారత్నహంస అవార్డు గ్రహీత డి.రాజకుమార్ వుడయార్, హైదరాబాద్‌కు చెందిన నాట్యకళాకారిణి డాక్టర్ పి.ఇందిరా హేమ, కూచిపూడి నాట్యకళాకారుడు పసుమర్తి శ్రీనివాసు, అయినవిల్లి సర్పంచ్ కె.రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.