
పూనమ్ హంగామా!
సంచలన వ్యాఖ్యలకు చిరునామా అనిపించుకున్న పూనమ్ పాండే ఇప్పటివరకు హిందీ చిత్రాలు మాత్రమే చేశారు. ఇప్పుడు తెలుగులో ఆమె ‘మాలినీ అండ్ కో’ చిత్రంలో టైటిల్ రోల్ చేశారు. వీరు .కె దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా అధినేత కిషోర్ రాఠీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పూనమ్ జోరుగా పాల్గొననున్నారు. ఈ నెల 17న వైజాగ్, 18న విజయవాడ, 19న తిరుపతిలో ఆమె ఈ చిత్రవిశేషాలు పంచుకోనున్నారు. 18న గుంటూరులో ఆడియో ఆవిష్కరణ వేడుక జరపనున్నామని నిర్మాత తెలిపారు.