బ్యాంకాక్‌లో ఫైట్ | Poonam Pandey malini and co మూవీ shooting in Bangkok | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌లో ఫైట్

Published Tue, Jan 27 2015 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

బ్యాంకాక్‌లో ఫైట్

బ్యాంకాక్‌లో ఫైట్

 పూనమ్ పాండే టైటిల్ రోల్‌లో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా అధినేత కిషోర్ రాఠీ నిర్మిస్తున్న చిత్రం ‘మాలినీ అండ్ కో’. చిత్రనిర్మాత తనయుడు మిలన్ హీరోగా నటిస్తున్నారు. వీరు. కె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫైట్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా వీరు. కె మాట్లాడుతూ -‘‘పూనమ్ పాండే అంటే గ్లామరస్ ఆర్టిస్ట్ అని అందరూ అనుకుంటారు. అది వాస్తవమే అయినా.. శక్తిమంతమైన పాత్రలను కూడా ఆమె అద్భుతంగా చేయగలరని నిరూపించే చిత్రం ఇది. ఈ నెలాఖరున బ్యాంకాక్‌లో ఓ భారీ ఫైట్‌ని చిత్రీకరించనున్నాం. హాలీవుడ్ నటుడు జాకీచాన్ చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా చేసిన రోనీ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ చిత్రీకరణ జరగనుంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement