Kishore rathi
-
యమలీలకు పాతికేళ్లు
కమెడియన్ అలీ టాప్ ఫామ్‌లో కొనసాగుతున్న సమయంలో అలీని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన చిత్రం ‘యమలీల’. కిశోర్ రాఠి సమర్పణలో కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేటితో (ఏప్రిల్ 28) పాతికేళ్లు పూర్తి చేసుకుంది. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు నిండి ఉండటం చిత్రవిజయానికి ఓ కారణం. తల్లిగా మంజు భార్గవి, యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడు పాత్రలో బ్రహ్మానందం, తోట రాముడిగా తనికెళ్ల భరణి ఇలా సినిమాలో ప్రతి పాత్రా ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ‘నీ జీనూ ప్యాంటు చూసి బుల్లోడో..’, సిరులొలికించే చిన్ని నవ్వులే..., జుంబారే జుంజుంబారే...’ పాటలు హైలైట్. సూపర్ స్టార్ కృష్ణ, ఇంద్రజ ఓ స్పెషల్ సాంగ్ చేయడం స్పెషల్ అట్రాక్షన్. రిలీజ్ అయిన కొన్ని కేంద్రాల్లో ఏడాది పాటు ఏకధాటిగా ప్రదర్శితం అవ్వడం విశేషం. అలా ‘యమలీల’ అలీ కెరీర్లో ఓ మరపురాని చిత్రంగా నిలిచిపోతుంది. -
బ్యాంకాక్‌లో ఫైట్
పూనమ్ పాండే టైటిల్ రోల్లో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా అధినేత కిషోర్ రాఠీ నిర్మిస్తున్న చిత్రం ‘మాలినీ అండ్ కో’. చిత్రనిర్మాత తనయుడు మిలన్ హీరోగా నటిస్తున్నారు. వీరు. కె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫైట్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా వీరు. కె మాట్లాడుతూ -‘‘పూనమ్ పాండే అంటే గ్లామరస్ ఆర్టిస్ట్ అని అందరూ అనుకుంటారు. అది వాస్తవమే అయినా.. శక్తిమంతమైన పాత్రలను కూడా ఆమె అద్భుతంగా చేయగలరని నిరూపించే చిత్రం ఇది. ఈ నెలాఖరున బ్యాంకాక్‌లో ఓ భారీ ఫైట్‌ని చిత్రీకరించనున్నాం. హాలీవుడ్ నటుడు జాకీచాన్ చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా చేసిన రోనీ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ చిత్రీకరణ జరగనుంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.