అభినయానికి ఆస్కారమున్న పాత్ర చేశా! | Poonam Pandey to make her debut in Tollywood | Sakshi
Sakshi News home page

అభినయానికి ఆస్కారమున్న పాత్ర చేశా!

Published Wed, Nov 12 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

అభినయానికి ఆస్కారమున్న పాత్ర చేశా!

అభినయానికి ఆస్కారమున్న పాత్ర చేశా!

ఉగ్రవాదం నేపథ్యంలో సాగే రొమాంటిక్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మాలిని అండ్ కో’. ఇటీవలి కాలంలో వివాదాలతో బాగా ప్రాచుర్యం పొందిన పూనమ్ పాండే ఇందులో కథానాయిక. వీరు కె. దర్శకుడు. యమలీల, వినోదం తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కిశోర్‌రాఠీ నిర్మాత. మంగళవారంతో సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.

అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్ర ఇందులో చేశాననీ, తప్పకుండా తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందనీ పూనమ్ పాండే నమ్మకం వెలిబుచ్చారు. కేరళ, హైదరాబాద్‌ల్లో నిరవధికంగా ఇరవై రోజులు చిత్రీకరణ జరిపామనీ, స్టార్ హీరో సినిమాకు ఉండాల్సిన హంగులన్నీ ఇందులో ఉన్నాయనీ కిశోర్ రాఠీ తెలిపారు. సామ్రాట్, మిలన్, కుషి, ఫరా, కావ్యాసింగ్  తదితరలు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ప్రసాద్, మాటలు: మరుదూరి రాజా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement