
తొమ్మిది భాషల్లో... పూనమ్ మసాలా
బాలీవుడ్ హాట్‌గాళ్ పూనమ్ పాండే తెలుగు ప్రేక్షకులను ‘మాలిని’గా అలరించడానికి సిద్ధమవుతున్నారు. వీరు.కె దర్శకత్వంలో పూనమ్ పాండే ప్రధాన పాత్రలో మహేశ్ రాఠీ నిర్మించిన ‘మాలినీ అండ్ కో’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. పూనమ్ పాండే మాట్లాడుతూ - ‘‘ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ . ఇందులో నాది విభిన్నమైన పాత్ర’’ అన్నారు. ‘‘పూనమ్ పాండే ఫైట్స్, యాక్షన్ ఈ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తాయి. తెలుగుతో పాటు తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రవి హార్ కూట్, కెమెరా: సి. రామ్‌ప్రసాద్.