Poonam Pandey Emotional: No Woman Wants To Go Through Such Incidents - Sakshi
Sakshi News home page

Poonam Pandey: పెళ్లయ్యాక ఏమైందో చూశారుగా, ఏ అమ్మాయికీ ఇలా జరగొద్దు!

Published Fri, Feb 25 2022 9:07 AM | Last Updated on Fri, Feb 25 2022 11:07 AM

Poonam Pandey: No Woman Wants To Go Through Such Incidents - Sakshi

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్న సెన్సేషనల్‌ షో లాకప్‌లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్‌ వైవాహిక జీవితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 'పెళ్లి తర్వాత ఇన్ని ఇబ్బందులు రావడం నా దురదృష్టం. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. నేను సామ్‌ బాంబేను పెళ్లాడాక ఏమైందో చూశారుగా. ఇది అనుకోకుండా జరిగిపోయింది. ప్రస్తుతం నేను సింగిల్‌గా ఉన్నాను. నాకిప్పుడు ఏ భాగస్వామి తోడు అవసరం లేదు' అని చెప్పుకొచ్చింది.

కాగా గతంలోనూ పూనమ్‌.. తనను భర్త కొడుతున్నాడని గృహహింస కేసు పెట్టిన విషయం తెలిసిందే! ఇదిలా ఉంటే వీరిద్దరూ 2000వ సంవత్సరంలో సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత సామ్‌ తనను కొట్టడం ప్రారంభించాడని, ఒకసారైతే హత్య చేసినంత పని చేశాడని తీవ్ర ఆరోపణలు గుప్పించింది. కానీ అంతలోనే వైవాహిక జీవితమన్నాక చిన్నచిన్నగొడవలు జరుగుతూనే ఉంటాయని మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు. ఆ మరుసటి ఏడాదే సామ్‌ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పూనమ్‌ గృహహింస కేసు పెట్టగా సామ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement