ముంబై : మోడల్, నటి పూనమ్ పాండే వైవాహిక జీవితం ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకు సాగిపోతోంది. తన భర్త సామ్ బాంబే వేధిస్తున్నాడంటూ కేసు పెట్టిన ఆమె వారం రోజుల్లోనే మనసు మార్చుకుంది. భర్తతో కలిసిపోయి వైవాహిక జీవితాన్ని మళ్లీ కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాకుండా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌తో ఆమె మాట్లాడుతూ..‘‘మా మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకున్నాం. మళ్లీ కలిసి ఉండబోతున్నాం. మీకు తెలుసా? మేమిద్దం ఒకరిని ఒకరం చాలా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం పిచ్చి ప్రేమలో ఉన్నాం. వైవాహిక జీవితంలోని హెచ్చు, తగ్గులు మమ్మల్ని ఆపలేవ’’ని తెలిపారు. సామ్ బాంబే కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇద్దరూ కలిసి ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు.( ముఖంపై పిడికిలితో గుద్దాడు.. జుట్టు పట్టుకొని! )
కాగా, గత కొన్ని సంవత్సరాలుగా సామ్ అహ్మద్ బాంబే అనే దర్శకుడితో ప్రేమలో ఉన్న ఆమె ఈ నెల 1వ తేదీన అతడ్ని పెళ్లాడింది. పెళ్లయి నెల కూడా తిరగకుండానే సామ్ తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 22వ తేదీన సామ్ బాంబే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. (పూనమ్ భర్తకు బెయిల్ మంజూరు)
Comments
Please login to add a commentAdd a comment