పెళ్లి విషయం దాచాలనుకోలేదు: పూనమ్‌ | Poonam Pandey Says Her Wedding Was Not A Secret | Sakshi
Sakshi News home page

హనీమూన్‌ ట్రిప్‌ ఆగిపోయింది: పూనమ్‌

Published Sat, Sep 12 2020 11:30 AM | Last Updated on Sat, Sep 12 2020 12:28 PM

Poonam Pandey Says Her Wedding Was Not A Secret - Sakshi

పూనమ్ పాండే.. సోషల్‌ మీడియా నెటిజన్లకు ఈ పేరు సుపరిచితం. అందాల ఆరబోత, వివాదాస్పద కామెంట్లు, వీడియోలతో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఈ భామ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ఈ నెల 1న పూనమ్‌ పాండే పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 'నీతో ఏడు జన్మలు కలిసి నడవాలనుకుంటున్నాను' అనే క్యాప్షన్‌ కూడా జత చేశారు. ఈ ఇద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఏడడుగులు వేసిన వేళ)

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్‌ తన ప్రేమ ప్రయాణాన్ని,పెళ్లి గురించి మాట్లాడారు. సామ్‌తో పెళ్లి జరిగిన విషయాన్ని దాచి ఉంచడం తన ఉద్ధేశ్యం కాదని అన్నారు. ‘సామ్‌ నేను చాలా పేరు పొందిన జంట. కరోనా పరిస్థితి కారణంగా మా వివాహం ప్రైవేటుగా ఉంచాలి అనుకున్నాం అంతే. ఒక ప్రాజెక్ట్ షూటింగ్ సందర్భంగా సామ్‌ను కలిశాను. అతని ప్రేమలో పడేందుకు నాకు మూడు నెలలు పట్టింది. అప్పటి నుంచి మా ప్రేమ ఓ రొమాంటిక్‌ బాలీవుడ్ సినిమా లాగా సాగింది. నా దృష్టిలో సామ్‌ చాలా తెలివైన వాడు. గొప్పవాడు కూడా. మా ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు దగ్గరగా ఉంటాయి. అతను నా బెస్ట్ ఫ్రెండ్. మా బంధం బలమైనది అందుకే ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం. మహమ్మారి కారణంగా హనీమూన్‌ ట్రిప్‌ ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడ్డాక లాస్‌ఏంజెలెస్‌కు వెళ్లాలి అనుకుంటున్నాం’ అని చెప్పారు. (బాయ్‌ ఫ్రెండ్‌తో పూనమ్‌ నిశ్చితార్థం!)

ఇక మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్‌  2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. దీని కారణంగానే సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ సంపాదించారు. జూలై 27న బాయ్‌ప్రెండ్‌ సామ్‌తో పూనమ్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. సుమారు రెండేళ్లుగా సామ్‌తో సహజీవనం చేసి పూనమ్ బాంద్రాలోని వారి ఇంటిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నిశ్చితార్థం చేసుకున్న రెండు నెలల్లోనే పెళ్లి పీటలు ఎక్కి అతనితో ఏడడుగులు వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement